ఏపీ ప్రజలకు శుభవార్త.. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు లేదు..

రాష్ట్రంలోని రైతులకు అందించే ఉచిత విద్యుత్తు, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు సబ్సిడీ,  ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణులకు ఇస్తున్న విద్యుత్ రాయితీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందట… ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు శుభవార్తను తీసుకువచ్చింది. 2023 – 24 సంవత్సరానికి విద్యుత్ ఛార్జీలు పెంచట్లేదని అధికారికంగా ప్రకటించింది.. విద్యుత్ భారం ఉండదని స్పష్టం చేసింది. 2023 -24 ఆర్థిక సంవత్సరం విద్యుత్ టారిఫ్ వివరాలను ఏపీఈఆర్సి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి […]

Share:

రాష్ట్రంలోని రైతులకు అందించే ఉచిత విద్యుత్తు, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు సబ్సిడీ,  ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణులకు ఇస్తున్న విద్యుత్ రాయితీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందట…

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు శుభవార్తను తీసుకువచ్చింది. 2023 – 24 సంవత్సరానికి విద్యుత్ ఛార్జీలు పెంచట్లేదని అధికారికంగా ప్రకటించింది.. విద్యుత్ భారం ఉండదని స్పష్టం చేసింది. 2023 -24 ఆర్థిక సంవత్సరం విద్యుత్ టారిఫ్ వివరాలను ఏపీఈఆర్సి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి తెలిపారు..

వారికి ఉచితంగా విద్యుత్..

ఈ ఏడాది విద్యుత్ టారిఫ్ పెంచడం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. కాగా రైతులకు అందించే ఉచిత విద్యుత్తు, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు సబ్సిడీ,  ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణులకు ఇస్తున్న విద్యుత్ రాయితీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ సబ్సిడీలకు అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇందుకుగాను  రాష్ట్ర ప్రభుత్వం రూ. 10,135 కోట్లు భరిస్తుందని వివరించారు‌. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఛార్జీల పెంపు లేదు అని నాగార్జున రెడ్డి తెలిపారు.

రూ. 475 అదనపు డిమాండ్..

ఆర్థిక అవసరాలపై డిస్కంలో ప్రతిపాదించిన టారిఫ్‌లపై ప్రజాభిప్రాయణా సేకరణ తీసుకుంటున్నామని తెలిపారు. టారిఫ్‌పై నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు, ఆక్వారంగం నాయీ బ్రాహ్మణులకు ఇస్తున్న విద్యుత్ రాయితీల ఖర్చులు ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని డిస్కమ్‌కు చెల్లించనున్నట్లు తెలిపారు. సాధారణ పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల కేటగిరీలో కూడా ఎవరిపైనా ఛార్జీల భారం మోపడం లేదని నాగార్జున రెడ్డి తెలిపారు. ఎనర్జీ ఇన్సెంటివ్ ఇండస్ట్రీ కంపెనీలకు హెచ్టి వినియోగదారులకు మాత్రం కిలోవాటుకు 475 రూపాయలు అదనంగా డిమాండ్ ఛార్జీల ప్రతిపాదనను అంగీకరించామని జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు. ఇతర ప్రతిపాదనలు మాత్రం తిరస్కరించామని చెప్పుకొచ్చారు. 

వేసవిలో విద్యుత్ కోత ఉండకూడదు..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్యుత్ కొరత ఉండకూడదని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ రైతుల మోటార్లకు, మీటర్లు నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ఫిబ్రవరి నెలలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అప్పుడే వేసవిలో సగటున ఎవరు విద్యుత్ కోత వలన ఇబ్బంది పడకూడదని అధికారులను ఆదేశించారు.

ఫిబ్రవరి 2న వాతావరణంలో మార్పులు జరిగాయి. దాంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కాగా మార్చి ఏప్రిల్ నెలలో సగటున రోజుకు 240 మిలియన్ల యూనిట్లు ఏప్రిల్ లో 25 యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని.. కోతలు లేకుండా చూసేందుకు ఎప్పటికీ పవర్ ఎక్స్చేంజ్‌లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్ చేసుకున్నామని ముఖ్యమంత్రికి తెలిపారు. విద్యుత్ కోత కారణంగా సమస్య రాకుండా చూసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఈ మేరకు అధికారులు కూడా అన్ని రకాలుగా సిద్ధం కావాలని తెలిపారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరు చేయాలని, ముఖ్యమంత్రి దానికి తగిన ఆదేశాలను అధికారులకు సూచించారు. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి ఆలస్యం జరగకూడదని.. ఇంతకుముందే దరఖాస్తు చేసుకున్న వారిలో లక్షకు పైగా కలెక్షన్లను ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక అందించారు.