విద్యార్థులకు మరో అవకాశం ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు..

ఏపీ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 26న విడుదలయ్యాయి. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. అయితే ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్న వారికి మరో అవకాశాన్ని తీసుకొచ్చింది. ఇంటర్ ఫలితాలపై ఏవైనా సందేహాలు ఉంటే ఇంటర్ బోర్డు కు అభ్యంతరాలు తెలపవచ్చు. ఇంటర్ విద్యార్థులు తమ సందేహాలను నేటి నుంచి మే 6 వరకు బోర్డుకి తెలియజేయవచ్చు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం […]

Share:

ఏపీ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 26న విడుదలయ్యాయి. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. అయితే ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్న వారికి మరో అవకాశాన్ని తీసుకొచ్చింది. ఇంటర్ ఫలితాలపై ఏవైనా సందేహాలు ఉంటే ఇంటర్ బోర్డు కు అభ్యంతరాలు తెలపవచ్చు. ఇంటర్ విద్యార్థులు తమ సందేహాలను నేటి నుంచి మే 6 వరకు బోర్డుకి తెలియజేయవచ్చు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రికార్డింగ్ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు త్వరలో ప్రకటిస్తుందని తెలిపారు. అదేవిధంగా జూన్ 5 నుంచి జూన్ 9 వరకు సప్లమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ కి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వెరిఫికేషన్ లో ఫలితం ఆలస్యమైనా, మొదటి ఫలితాలే వచ్చినా అడ్వాన్స్డ్ సప్లమెంటరీ రాసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్నామని ఆశతో అడ్వాన్స్ సప్లమెంటరీ దరఖాస్తులు ఎవరు ఉపేక్షించకూడదని ఆయన అన్నారు. 

అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఫీజు చెల్లింపు ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో పూర్తి వివరాలను ఇంటర్ బోర్డు విడుదల చేయనుంది. ఇంటర్ బోర్డు కూడా ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం ఇస్తోంది. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొదటి సంవత్సరం 61 శాతం, సెకండ్ ఇయర్ లో 72 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి బొత్స తెలిపారు. ప్రథమ సంవత్సరంలో బాలికలదే పైచేయి కాగా, ద్వితీయ సంవత్సరంలో అబ్బాయిలదే పైచేయని వెల్లడించారు. ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ రెండవ సంవత్సరంలో బాలురు 68 శాతం, బాలికలు 75 శాతం ఉత్తీర్ణులయ్యారు.  ఈ సారి ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో మొత్తం 61 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో బాలురు 58 శాతం బాలికలు 65 శాతం ఉత్తీర్ణులయ్యారు.  ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షల్లో అబ్బాయిల కంటే బాలికలే సత్తా చాటారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కృష్ణాజిల్లా 77 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలువగా, పశ్చిమగోదావరి జిల్లా 77 శాతం ఉత్తీర్ణతతో రెండవ స్థానంలో, గుంటూరు జిల్లా 68 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలకు 10,03,990 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 1489 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. 4. 84 లక్షల మంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా, 5.19 విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరిలో 9,20,552 మంది రెగ్యులర్ విద్యార్థులు, 83,749 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు.