ఒక్క ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.10,135 కోట్ల సబ్సిడీని భరిస్తోంది.. పెద్దిరెడ్డి..!

రైతులు దేశానికి వెన్నెముక అని చెబుతూ ఉంటారు. అందుకే రైతుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి వ్యవసాయ పనులకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తూ కొంతవరకు ఊరట కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.10,135 కోట్ల సబ్సిడీని భరిస్తోందంటూ ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం చేసే రైతులకు బలహీనవర్గాల వారికి ఇతరులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం […]

Share:

రైతులు దేశానికి వెన్నెముక అని చెబుతూ ఉంటారు. అందుకే రైతుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి వ్యవసాయ పనులకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తూ కొంతవరకు ఊరట కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.10,135 కోట్ల సబ్సిడీని భరిస్తోందంటూ ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం చేసే రైతులకు బలహీనవర్గాల వారికి ఇతరులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిందని ఆయన స్పష్టం చేశారు. 

9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ..

రాష్ట్రంలోని లక్షలాది మంది కుటుంబాలకు నవరత్నాల పథకం కింద లబ్ధి పొందే విధంగా ఏపీ విద్యుత్ శాఖలో ప్రజా సంక్షేమం కోసం..  రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేస్తోందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా తెలిపారు. మన రాష్ట్రంలో వ్యవసాయ వినియోగదారులకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తోందని.. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ వర్గాల వారికి అలాగే ఆక్వా రైతులకు రాయితీలు అలాగే గృహ వినియోగదారులకు సబ్సిడీని అందించడానికి సబ్సిడీ కింద 2023 – 2024 కోసం సుమారుగా రూ.10,135.22 కోట్ల రూపాయలను కేటాయించడానికి ప్రభుత్వం అంగీకరించిందని ఆయన తెలిపారు.

ఇంధన చార్జీలు..

ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 2023 – 2024 కోసం నిర్ణయించిన మొత్తం రాబడి అంతరాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన ఇంటెన్సీ పరిశ్రమలకు మినహా మరే వర్గం వినియోగదారులకు వడ్డీ పెంపు ఉండదు అని స్పష్టం చేశారు.  అంతేకాదు అన్ని తరగతుల వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచడం లేదు అని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువగా విద్యుత్తు ఉపయోగించే ఫెరో పరిశ్రమలకు సాధారణ పరిశ్రమలతో సమానంగా ఒక్కో కేవీఏకు రూ.475 డిమాండ్ చార్జీలు విధిస్తారు. ఈ ఫెల్లో అల్లాయి పరిశ్రమలకు ఇప్పటివరకు డిమాండ్ చార్జీలు లేవు.  అయితే సాంప్రదాయ పరిశ్రమలతో పోలిస్తే ఇంధన చార్జీలు యూనిట్కు 50 పైసలు తక్కువగా ఉంటాయి. అలాగే పీక్ డిమాండ్ చార్జీలు కూడా లేవని పెద్దిరెడ్డి తెలిపారు.

ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని విద్యుత్ రంగంలో కూడా నవరత్నాల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.  వ్యవసాయం, బలహీన వర్గాలకు,  ఇతరులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.  విద్యుత్ శాఖలో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో దాదాపు 100% తమ ప్రభుత్వం విజయం సాధించిందని అన్నారు. తాజాగా రాష్ట్రంలో స్థితిస్థాపకమైన సేవలను,  నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించాలని వినియోగదారులు ఆశిస్తున్నారు.  అందుకు తగ్గట్టుగానే విద్యుత్ రంగంలో వినియోగదారుల రక్షణ , సామాజిక బాధ్యత కు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అన్నారు.

ఇక ఇదే విషయాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ మాట్లాడుతూ.. 24*7 నాణ్యమైన మరియు నమ్మదగిన విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రంగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని..  పవర్ యుటిలిటీలు అన్ని విధాలుగా కృషి చేస్తాయని కూడా ఆయన తెలిపారు . అయితే వేసవిలో విద్యుత్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా కోరారు.