వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు

కరెంటు కొరతతో కరెంటు కోతల సమస్య తలెత్త కూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు అన్ని విధాలుగా సిద్ధం కావాలని సీఎం జగన్‌ సూచించారు. శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఇంధన శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించి, బొగ్గు నిల్వల విషయంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో విద్యుత్‌ కొరత ‘‘కొరత పేరుతో కరెంటు కోతలు ఉండకూడదు. థర్మల్ పవర్ స్టేషన్ల పనితీరులో ఎటువంటి అంతరాయాలు […]

Share:

కరెంటు కొరతతో కరెంటు కోతల సమస్య తలెత్త కూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు అన్ని విధాలుగా సిద్ధం కావాలని సీఎం జగన్‌ సూచించారు. శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఇంధన శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించి, బొగ్గు నిల్వల విషయంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వేసవిలో విద్యుత్‌ కొరత

‘‘కొరత పేరుతో కరెంటు కోతలు ఉండకూడదు. థర్మల్ పవర్ స్టేషన్ల పనితీరులో ఎటువంటి అంతరాయాలు ఉండకూడదు. అవసరమైనంత బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలి.”అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారని ప్రభుత్వం వెల్లడించిన ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు.

రైతులకు మీటర్ కనెక్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం, ఆ కనెక్షన్లను నిర్ణీత గడువులోగా అందించాలని అధికారులను ఆదేశించారు. 

వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో జాప్యం చేయొద్దని సీఎం సూచించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, మార్చి నెలాఖరులోగా మరో 20 వేల కనెక్షన్లు ఇస్తామని అధికారులు తెలిపారు.

వేసవిలో విద్యుత్తు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు

విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచేందుకు సీఎం ఆదేశాల మేరకు పలు చర్యలు తీసుకున్నామని, నెలాఖరులోగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

ఫిబ్రవరి రెండో వారం నుంచి రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉందని, ప్రస్తుత అంచనాల ప్రకారం మార్చి, ఏప్రిల్‌లో సగటున రోజుకు 250 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని అధికారులు ఆయనకు వివరించారు.

కరెంటు డిమాండ్‌ను ముందు గానే పవర్‌ ఎక్స్ఛేంజీకి తెలియ జేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.

పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీయగా.. దరఖాస్తులు స్వీకరించిన నెలలోనే కనెక్షన్లు ఇచ్చేలా ఉత్తర్వులు పకడ్బందీగా అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

రాబోయే నెలల్లో కరెంటు డిమాండ్‌ ఎంత ఉంటోందో అనే విషయాన్ని ముందుగానే పవర్ ఎక్స్ఛేంజ్ ఇండియాకు తెలియజేస్తున్నామని, వేసవిలో విద్యుత్తు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.

వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో అస్సలు జాప్యం చేయవద్దని సూచించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే దాదాపు 1.06 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, మార్చి చివరి నాటికి మరో 20 వేల కనెక్షన్లు ఇస్తామని అధికారులు సమాధానమిచ్చారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతోపాటు 100 కొత్త సబ్‌ స్టేషన్లు మార్చి చివరి నాటికి పనిచేయడం ప్రారంభిస్తామన్నారు.

అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తి చేస్తున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 2.18 లక్షలకు పైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని అధికారులు వెల్లడించారు. ఇళ్లు పూర్తవుతున్నందున శరవేగంగా కనెక్షన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్, అటవీ పర్యావరణ, గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌కే విజయానంద్‌, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్‌, ట్రాన్స్‌కో జేఎండీ పృథ్వీ తేజ్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.