సూడాన్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఆఫ్రికా దేశం సూడాన్ అంతర్యుద్దంలో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు ఏపి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సూడాన్ లో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు చిక్కుకున్నారని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. సూడాన్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు సీఎం జగన్. బాధితులను స్వదేశానికి రప్పించి వారిని స్వస్థలాలకు చేరేంత వరకూ అండగా నిలావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో వ్యవహరించిన తీరుగానే […]

Share:

ఆఫ్రికా దేశం సూడాన్ అంతర్యుద్దంలో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు ఏపి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సూడాన్ లో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు చిక్కుకున్నారని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. సూడాన్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు సీఎం జగన్. బాధితులను స్వదేశానికి రప్పించి వారిని స్వస్థలాలకు చేరేంత వరకూ అండగా నిలావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో వ్యవహరించిన తీరుగానే సుడాన్ లో చిక్కుకున్న వారికి విమాన టికెట్లు, ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు సీఎం జగన్. ఎయిర్ పోర్టులో వారిని రిసీవ్ చేసుకున్నప్పటి నుండి స్వస్థలాలకు చేరే వరకూ వారికి అండగా ఉండాలని సీఎం ఆదేశించారు. సూడాన్ లో ఇప్పటి వరకూ సుమారు 56 మంది తెలుగు వారు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. సూడాన్ లో చిక్కుకుపోయిన వారిని కాపాడాలని వారి బంధువులు ప్రభుత్వన్ని కొద్ది రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంత సమన్వయం చేసుకుని వారిని స్వదేశాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. 

సూడాన్ లో అంతర్యుద్దం కారణంగా వాయు మార్గాలను (ఎయిర్ పోర్టులను) మూసివేశారు. ప్రభుత్వ దళాలకు, తిరుగుబాటుదారుల మధ్య భీకర యుద్దం జరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో అక్కడ చిక్కుకుపోయిన విదేశాయులను వాయుమార్గం ద్వారా తరలించడం కష్టమవుతోంది. మరో పక్క కాల్పుల విరమణ కోసం ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సూడాన్ పొరుగున ఉన్న దేశాలకు రోడ్డు మార్గంలో అక్కడ చిక్కుకున్న వారిని తరలించి అక్కడ నుండి విమానాల్లో స్వదేశాలకు తరలిస్తున్నారు. భారత్ కు చెందిన వారిని జలమార్గంలో కూడా స్వదేశాలకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పది రోజులుగా జరుగుతున్న యుద్దంలో ఇప్పటి వకూ 500 మంది పౌరులు చనిపోయారు. దాదాపు నాలుగు వేల మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో కొందరు భారతీయులు కూడా ఉన్నరు. 

సంక్షోభంలో ఉన్న సూడాన్ లో సుమారు 4వేల మంది భారతీయులు చిక్కకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని సురక్షితంగా భారత్ కు తరలించేందుకు ఆపరేషన్ కావేరీ మిషన్ కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగం బుధవారం రెండవ ఐఎఎఫ్ సీ – 130 జే విమానలో మరో 135 మంది భారతీయులను తరలించారు. అంతకు ముందు 148 మందితో కూడిన మరో విమానం జెడ్డాకు చేరుకుంది. నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ సుమేధ ద్వారా 278 మంది ప్రయాణీకులు సౌదీకి చేరుకున్నారు. సమారు 500 మంది భారతీయులను ఐఎన్ఎస్ సుమేధ, ఐఏఎఫ్ విమనాల ద్వారా భారత్ కు తరలించే ప్రక్రియ జరుగుతోంది. సౌదీ అరేబియాకు చేరుకున్న భారతీయులను అక్కడి స్కూల్ లో ఉంచారు. 

మరో పక్క భారతీయులను సుడాన్ నుండి తప్పించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వానికి విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ  మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతర్యుద్దంతో సతమతమవుతున్న సూడాన్ నుండి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ కావేరా ముమ్మరంగా సాగుతోంది. భారతీయులను సూడాన్ నుండి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించి అక్కడ నుండి భారత్ కు తీసుకొస్తున్నారు.  ఇది ఇలా ఉంటే యూఎస్, సౌదీ అరేబియా మద్యవర్తిత్వం వహించిన తర్వాత 72 గంటల కాల్పుల విరమణకు సుడానీ, సాయుధ దళాలు, ర్యాపిడ్ సపోర్టు ఫోర్సెస్ అంగీకరించాయి.