వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి బదిలీ

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్ఏఏపీ) వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఎండీ ప్రభాకర్ రెడ్డి బదిలీ స్పోర్ట్స్ మెటీరియల్ సేకరణ మరియు ఆటగాళ్లకు సర్టిఫికెట్ల జారీ వంటి ఇతర పరిపాలనా కార్యకలాపాలకు సబంధించి.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్ఏఏపీ)పై ఆరోపణలు రావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బదిలీ ఉత్తర్వులు జారీ […]

Share:

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్ఏఏపీ) వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ చేయమని ఆదేశించారు.

ఎండీ ప్రభాకర్ రెడ్డి బదిలీ

స్పోర్ట్స్ మెటీరియల్ సేకరణ మరియు ఆటగాళ్లకు సర్టిఫికెట్ల జారీ వంటి ఇతర పరిపాలనా కార్యకలాపాలకు సబంధించి.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్ఏఏపీ)పై ఆరోపణలు రావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె హర్షవర్ధన్‌కు వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

శాప్‌లో అవినీతి, అక్రమాలు

శాప్‌లో అవినీతి, అక్రమాలపై శాప్‌కు చెందిన ముగ్గురు పాలకమండలి సభ్యులు కె నరసింహులు, డేనియల్ ప్రదీప్, కె వరలక్ష్మి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం కప్ టోర్నమెంట్ కూడా ఆలస్యమవుతోందని, క్రీడాకారులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్ల జారీలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. గతంలో ప్రభాకర్ రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఏపీ మహిళా కమిషన్ కూడా అప్పట్లో విచారణకు ఆదేశించింది.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (ఎస్ఏఏపీ) అభ్యర్థన మేరకు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) ఆంధ్రప్రదేశ్‌లో మరో 12 ఖేలో ఇండియా శిక్షణా కేంద్రాలను (కేఐసీ) ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. అదనంగా మంజూరైన 12 కేఐసీలతో, రాష్ట్రంలో మొత్తం ఖేలో ఇండియా శిక్షణా కేంద్రాల సంఖ్య 25కి చేరుకుంటుంది.

ఈ మేరకు గురువారం విజయవాడలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ.. బాపట్ల, రాయచోటి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో నాలుగు ఫెన్సింగ్ సెంటర్లు, గుంటూరు మరియు పుట్టపర్తి జిల్లాల్లో రెండు జూడో ఖేలో ఇండియా శిక్షణా కేంద్రాలు, పార్వతీపురం (మన్యం) జిల్లాలో ఒక వెయిట్ లిఫ్టింగ్ కేంద్రం, పాడేరులో కుస్తీ కేంద్రం, అనకాపల్లిలో బాక్సింగ్ సెంటర్, రాజమహేంద్రవరంలో ఫుట్‌బాల్ సెంటర్, భీమవరంలో రైఫిల్ షూటింగ్ కేంద్రం, నంద్యాలలో హాకీ సెంటర్ మరియు కృష్ణా జిల్లా (మచిలీపట్నం) లో ఈత కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. జిల్లా క్రీడా ప్రతిభ ఆధారంగా.. ప్రతి జిల్లాకు ఒక్కో క్రీడా విభాగంలో ఒక్కో కేంద్రాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మంజూరు చేసిందని ఎండీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

మంగళవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండీ ప్రభాకర్ రెడ్డి తీరుపై చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, డైరెక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఎండీ ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఎస్‌ఏఏపీ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎండీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… క్రీడాకారుల శిక్షణ కోసం మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేసుకోమని ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. తనపై బురద జల్లే ప్రక్రియ కింద ఆరోపణలు చేశారని ప్రభాకర్ రెడ్డి అన్నారు.