ఏపీలో భగభగ మండే ఎండలు: పగిలిన బండరాయి

ఏప్రిల్ నెల ఆరంభంలోనే రాష్ట్రంలో భానుడు భగభగ మండుతున్నాడు. రోజురోజుకు ఎండా తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి దెబ్బకు మంచు కరిగిపోతోంది, కొండ చరియలు విరిగి పడుతున్నాయి. అంతే కాకుండా ఏకంగా రాళ్లు కూడా పగిలి పోతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం కదా? తాజాజా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామ సమీపంలోని ఓ పెద్ద రాయి పగుళ్లు  గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. గ్రామంలోని ఇళ్ల మధ్య ఎత్తైన ప్రదేశంలో వేసవి […]

Share:

ఏప్రిల్ నెల ఆరంభంలోనే రాష్ట్రంలో భానుడు భగభగ మండుతున్నాడు. రోజురోజుకు ఎండా తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి దెబ్బకు మంచు కరిగిపోతోంది, కొండ చరియలు విరిగి పడుతున్నాయి. అంతే కాకుండా ఏకంగా రాళ్లు కూడా పగిలి పోతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం కదా?

తాజాజా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామ సమీపంలోని ఓ పెద్ద రాయి పగుళ్లు  గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. గ్రామంలోని ఇళ్ల మధ్య ఎత్తైన ప్రదేశంలో వేసవి తాపానికి ఆ రాయి చీలిపోయింది. ఈ ఘటనపై కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన గుమ్మళ్ల మాట్లాడుతూ ఆదోని సబ్ డివిజన్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ బండ చుట్టుపక్కల ఉన్న 150 కుటుంబాలను తరలించామని తెలిపారు.

“రాతిలో పగుళ్లు ఉన్నాయి, కానీ మంగళవారం నుండి పగుళ్లు ఆగిపోయినట్టు కనిపిస్తున్నాయి. అది ఎక్కడ పగిలి పేలిపోతుందోనని భయంగా ఉంది. మేము స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలను మోహరించాము, అని కలెక్టర్ చెప్పారు.

జిల్లా యంత్రాంగం, సమీపంలోని సిమెంట్ కంపెనీలు మరియు పునరుత్పాదక ఇంధన సంస్థ గ్రీన్‌కో వారిని పగిలిన రాళ్ల (శిలలను)ను తొలిగించడానికి సహాయం కోరామని ఆమె తెలిపింది.

ఇక నిర్వాసితుల భద్రత కోసం.. 

ఒకవేళ పరిస్థితి విషమిస్తే శిలల శకలాలు వారి ఇళ్లపైకి పడే అవకాశం ఉన్నందున వారిని సమీపంలోని పాఠశాలలో ఉంచినట్లు సృజన తెలిపారు. పాఠశాల రాక్ యొక్క స్థానం వెనుక వాలుకు వ్యతిరేకంగా ఉంది. నిర్వాసితులను రక్షించేందుకు సమీపంలోని పాఠశాలకు తరలించినట్లు సృజన తెలిపారు. పరిస్థితి మరింత దిగజారితే, పాఠశాల కూడా కూలిపోవచ్చు, ఎందుకంటే అది ఆ పగిలిన రాయి యొక్క వెనుక భాగంలోనే ఉందని ఆమె అన్నారు.

అయితే సంఘటనా స్థలంలో క్వారీయింగ్ జరగలేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్.. రాక్ సైట్‌లో ఇతర అనుమానాస్పద కార్య కలాపాలు కూడా జరగలేదని తెలిపారు. వేసవి తాపమే ఈ పగుళ్లు ఏర్పడటానికి కారణమయి ఉండవచ్చని కలెక్టర్ సృజన అనుమానం వ్యక్తం చేశారు.

అయితే, మంగళవారం కర్నూలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని వాతావరణ అధికారి అన్నారు. అదే రోజు గోనెగండ్లలో గరిష్ట ఉష్ణోగ్రత 38.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA)  అధికారి ఒకరు తెలిపారు.

ఇదిలా ఉండగా సబ్ కలెక్టర్, తహసీల్ధార్, పోలీసు అధికారులు గ్రామంలో పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా  కూనవరంలో 46 డిగ్రీల సెల్సియస్‌, అనకాపల్లి జిల్లా గొలుగొండలో 42.6 డిగ్రీల సెల్సియస్‌, నాతవరంలో 42 డిగ్రీల సెల్సియస్‌, కాకినాడ జిల్లాలోని కోటనందూరులో 41 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయింది. అయితే ఈ  నాలుగు మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ అధికారులు అంచనా వేశారు.

అదే విధంగా, రాష్ట్ర వ్యాప్తంగా మరో 126 మండలాల్లో వేడిగాలులు వీస్తున్నాయని తెలిపిన విపత్తు నిర్వహణ అధికారులు.. అన్ని చోట్లా 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు.