ఉద్యోగులకు ఓ ఇండియన్ కంపెనీ బంపర్ ఆఫర్

టైం అవ్వగానే ఇంటికి వెళ్లిపోవాల్సిందే.. ఇంతకీ ఏంటీ ఆఫర్ షిఫ్ట్ అయిపోగానే ఉద్యోగుల కంప్యూటర్ లాక్ ప్రైవేటు ఉద్యోగులయినా.. ప్రభుత్వ ఉద్యోగులయినా ఇద్దరికీ వృత్తి, వ్యక్తిగత జీవితం రెండూ ఉంటాయి. జీవితంలో రెండు కూడా ముఖ్యమైనవే. కానీ చాలా మంది ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితానికి సమాన ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నారు. కారణం వర్క్ లైఫ్. అవును ఎంప్లాయిల్లో చాలామంది వృత్తి జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక ఆర్గనైజేషన్ కోసం పని చేయడం మంచిదే. అలాగని చెప్పి […]

Share:

టైం అవ్వగానే ఇంటికి వెళ్లిపోవాల్సిందే.. ఇంతకీ ఏంటీ ఆఫర్

షిఫ్ట్ అయిపోగానే ఉద్యోగుల కంప్యూటర్ లాక్

ప్రైవేటు ఉద్యోగులయినా.. ప్రభుత్వ ఉద్యోగులయినా ఇద్దరికీ వృత్తి, వ్యక్తిగత జీవితం రెండూ ఉంటాయి. జీవితంలో రెండు కూడా ముఖ్యమైనవే. కానీ చాలా మంది ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితానికి సమాన ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నారు. కారణం వర్క్ లైఫ్. అవును ఎంప్లాయిల్లో చాలామంది వృత్తి జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక ఆర్గనైజేషన్ కోసం పని చేయడం మంచిదే. అలాగని చెప్పి మన సరదా, సంతోషాలను వదులుకోలేం కదా. ప్రతి ఉద్యోగి జీవితంలో ఎక్కువ భాగం ఆఫీసులోనే గడుపుతారు. పని ఎక్కువగా ఉంటే ఓవర్ టైం కూడా అవసరం కావచ్చు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు వ్యక్తిగత జీవితం కోల్పోక తప్పదు. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆఫీస్ వాళ్లకి సమస్య చెప్పినా ఎక్కువ సార్లు ప్రతికూల సమాధానమే వస్తుంది. ఏ మేనేజ్‌‌మెంట్ అయినా పని విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్ అనే ఐటీ కంపెనీ తన ఉద్యోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల షిఫ్ట్ సమయం ముగియగానే వారి కంప్యూటర్లు పనిచేయడం మానేస్తాయి. దీంతో ఉద్యోగులు కంప్యూటర్లు వదిలేసి ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఓవర్ టైం చేద్దామనుకున్నా సిస్టం ఆన్ అవ్వదు. ఈ కంపెనీ నియమం ప్రకారం ఉద్యోగి తన పనిని కార్యాలయ సమయానికి ముందే పూర్తి చేయాలి. సమయం ముగిసిన పది నిమిషాల తర్వాత షిఫ్ట్ సమయం ముగిసినట్లు కంప్యూటర్ స్క్రీన్‌‌పై చూపిస్తుంది. తర్వాత కంప్యూటర్ ఆటోమాటిక్‌గా ఆగిపోతుంది. ఈ విషయాలను కంపెనీ హెచ్‌ఆర్ విభాగం లింక్డ్‌ఇన్‌లో కూడా పోస్ట్ చేయడం గమనార్హం.

ఇది ప్రమోషన్ కోసం చేసిన ప్రకటన కాదని, తమ ఉద్యోగుల వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో కంపెనీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమ కంపెనీకి కూడా ఇలాంటి రూల్ ఉంటే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో కంపెనీలు వర్కర్స్​ (ఎంప్లాయిస్) తో ఎలా ఎక్కువ గంటలు పని చేపించుకుందామా అని చూస్తుంటే ఈ కంపెనీ మాత్రం ఇలా షిఫ్ట్ అయిపోగానే వెళ్లిపోమనడం చాలా బాగుందని అంటున్నారు. ఇలా వర్క్​ లైఫ్​ను పర్సనల్ లైఫ్​ ను మేనేజ్ చేసుకోవడం వలన ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పని చేసే అవకాశం ఉందని.. పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామమని, ఇండియాలో ఉన్న మిగతా కంపెనీలు కూడా ఇక ఈ కంపెనీని అనుసరించితే బాగుంటుందని అంటున్నారు. ఇక ఇప్పుడు అందరూ ఆ కంపెనీ గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆ కంపెనీ పేరు మార్మోగిపోతుంది.