ఊపిరి పీల్చుకున్న యూపీ.. మెస్ట్ వాంటెడ్ క్రిమనల్ హతం

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కార్ అధికారంలో ఉన్న విషయం తెలిసింద. ఇప్పటికే  ఆయన ఇలాకాలో ఎన్నో చర్చనీయాంశమైన ఎన్ కౌంటర్లు జరిగాయి. వీటిని కొంతమంది రాజకీమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నాప్పటికీ కొందరికైతే మంచే జరిగిందనడంలో సందేహం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ర్ట వ్యాప్తంగా ఓ ఎన్ కౌంటర్ గురించే మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆనందంతో సంబురాలు కూడా చేసుకుంటున్నారు.  పోలీసులు ఎంతో చాకచక్యంగా ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను హతం చేశారు. పథకం ప్రకారం […]

Share:

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కార్ అధికారంలో ఉన్న విషయం తెలిసింద. ఇప్పటికే  ఆయన ఇలాకాలో ఎన్నో చర్చనీయాంశమైన ఎన్ కౌంటర్లు జరిగాయి. వీటిని కొంతమంది రాజకీమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నాప్పటికీ కొందరికైతే మంచే జరిగిందనడంలో సందేహం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ర్ట వ్యాప్తంగా ఓ ఎన్ కౌంటర్ గురించే మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆనందంతో సంబురాలు కూడా చేసుకుంటున్నారు.  పోలీసులు ఎంతో చాకచక్యంగా ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను హతం చేశారు. పథకం ప్రకారం ప్రణాళిక వేసుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారు జామున కౌశాంబి జిల్లాలో ఎన్ కౌంటర్ నిర్వహించారు. దీంతో ఓ క్రిమినల్ హతం అయ్యాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లో మోస్ట్ వాంటెడ్ గా పేరున్న క్రిమినల్ గుఫ్రాన్. ఇతడు కౌశాంబి జిల్లా మంఝూన్ పూర్కు సమీపంలో తిరుగుతూ పోలీసుల కంటపడ్డాడు. పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా గుఫ్రాన్ ఆ సమయంలో పోలీసులపై ఎదురుదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కాల్పలు జరిపారు. ఈ కాల్పుల్లో గుఫ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే గుఫ్రాన్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు ద్రువీకరించిన అనంతరం పోలీసులు గుఫ్రాన్ ఎన్ కౌంటర్ జరిగినట్లు వెల్లడించారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్ పోలీసులు మంగళవారం ఉదయం తెలిపారు. పోలీసులు గుఫ్రాన్ ను సమ్దా సమీపంలో ఆపడానికి ప్రయత్నించారు. కానీ అతను పోలీసులపై కాలుపులు జరిపాడు. ప్రతీకార కాల్పుల్లో అతడు గాయపడిన తరువాత మరణించాడు. ఈరోజు ఉదయం లక్నో ఎస్ టి ఎఫ్ తో జరిగిన ఎన్కౌంటర్లో మహమ్మద్ గుర్ఫాన్ హతమయ్యాడు. అతను ఎన్కౌంటర్లో గాయపడిన తర్వాత పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించామని తెలిపారు కాగా అతను చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.  అతని వద్ద నుంచి పోలీసులు 32 బోర్ పిస్టల్, 9 ఎంఎం కార్బన్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అతని వద్ద నుండి ఆయుధాలు మందు గుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాది గుర్తింపు అనుబంధం గురించి ఆరా తీస్తున్నారు. అతనిపై సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది . ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే గుఫ్రాన్ ఎన్ కౌంటర్ గురించి కౌశాంబి ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ‘ఎన్ కౌంటర్ లో హతమైన వ్యక్తిపేరు గుఫ్రాన్ గా గుర్తించాం. అతడిపై సుమారు.1,25,000 రివార్డు కూడా ఉంది’ అని తెలిపారు. మరోవైపు చివరిసారి ఈ క్రిమినల్ ఏప్రిల్ 24న దోపిడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం చాలా రోజుల నుంచి ముమ్మరంగా గాలిస్తున్నామన్న ఎస్పీ ఇన్ని రోజులకు చిక్కినట్లు వెల్లడించారు. ఇక గుఫ్రాన్ గతంలో ఎన్నో నేరాలకు పాల్పడినట్లు అతడి చరిత్ర చూస్తే అర్థమవుతుంది. మొత్తం 13 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఎన్నో రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న ఇతడి కోసం పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ తీవ్రంగా గాలించింది. ఇదిలా ఉండగా ఈ ఎన్ కౌంటర్ పై యోగి సర్కార్పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు మొత్తం 10,900 ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. వాటిల్లో 185 మందికి పైగా నేరస్థులు మరణించారు.