బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్‌కు జరిమానా

పండుగ సీజన్‌ వచ్చిందంటే చాలు ఆన్‌లైన్‌ రిటైల్‌ పోర్టల్స్ అన్నీ భారీ ఆఫర్స్ ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ప్రముఖ ఆన్లైన్ రెటైల్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 8 నుండి 15 వరకు ఈ బిగ్‌ బిలియన్‌ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ పెట్టనుంది. ఇక ఈ భారీ సేల్ కు సంబంధించి […]

Share:

పండుగ సీజన్‌ వచ్చిందంటే చాలు ఆన్‌లైన్‌ రిటైల్‌ పోర్టల్స్ అన్నీ భారీ ఆఫర్స్ ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ప్రముఖ ఆన్లైన్ రెటైల్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 8 నుండి 15 వరకు ఈ బిగ్‌ బిలియన్‌ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ పెట్టనుంది.

ఇక ఈ భారీ సేల్ కు సంబంధించి ప్రకటనను బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ తో చేయించింది ఫ్లిప్‌కార్ట్‌. అయితే.. ఈ ప్రకటనపై ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. అమితాబ్ బచ్చన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆన్‌ స్క్రీన్‌ అయినా , ఆఫ్ స్క్రీన్‌పైనా క్లీన్ ఇమేజ్‌ తెచ్చుకున్న బిగ్‌బీ అబద్ధాలు చెబుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అవును, నటుడు అమితాబ్ బచ్చన్ ఒక ప్రకటనలో అబద్ధం చెప్పారని, వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, చిన్న, మధ్య తరహా హోల్‌సేల్ వ్యాపారులకు నష్టం కలిగించే ప్రకటన చేశారని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్ అంబాసిడర్‌గా ఉన్న నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల ఫ్లిప్‌కార్ట్ ప్రకటనలో కనిపించారు. ప్రకటన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే గురించి.

నాణ్యమైన, ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరకే అందిస్తామంటూ ఈ ప్రకటనలో తెలిపారు. అయితే ఇందులో తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా అమితాబ్ బచ్చన్ వినియోగదారులను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. యాడ్ వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉందని, తప్పుడు సమాచారం ఉందని, ఆ యాడ్ ఇచ్చిన కంపెనీకి జరిమానా విధించడమే కాకుండా, ఆ యాడ్‌లో నటించి తప్పుడు సమాచారం అందించిన నటుడు అమితాబ్ బచ్చన్‌కు రూ.10 లక్షల జరిమానా విధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఫ్లిప్‌కార్ట్‌ను డిమాండ్‌ చేశారు.

ఇక యాడ్‌ విషయానికొస్తే.. ఓ ఆఫీస్‌లో సంభాషణ జరుగుతుంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సందర్భంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపుతో గొప్ప ఆఫర్లు ఉన్నాయని ఒకరు చెబుతుండగా.. పక్కనే ఉన్న మరొకరు షాప్ కూడా ఆ ఆఫర్లు ఇస్తున్నాయంటాడు. అయితే వెంటనే అక్కడ ప్రత్యక్షమైన అమితాబ్ బచ్చన్.. ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఆఫర్‌లను స్టోర్ ఇవ్వలేదని, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే రోజున మాత్రమే అలాంటి ఆఫర్‌లు లభిస్తాయంటారు. ఈ ప్రకటన టోకు వ్యాపారులను దెబ్బతీసే విధంగా ఉందటూ బచ్చన్‌పై వ్యాపారులు ఫిర్యాదు చేశారు. ఆఫ్‌లైన్ స్టోర్‌లు కూడా ఆన్‌లైన్ స్టోర్ల మాదిరిగానే ఆఫర్‌లను అందిస్తున్నాయని ఆల్ ఇండియా మర్చంట్స్ యూనియన్ తెలిపింది. కాగా సోషల్ మీడియాలో బచ్చన్ ప్రకటనపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇక, అక్టోబర్ 8వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుండగా.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 7వ తేదీ నుంచే ఈ ఆఫర్లను, డిస్కౌంట్లను పొందొచ్చు. ప్రతి సంవత్సరం పండుగ సీజన్లో ప్రారంభమయ్యే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ వాచెస్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై గొప్ప తగ్గింపు లభిస్తుంది. ఈ ఏడాది గూగుల్ పిక్సెల్7, నథింగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. అంతేకాదు వీటికి కొన్ని బ్యాంకుల కార్డుల ద్వారా కొనడం ద్వారా అదనపు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. వీటితో పాటు మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు లభించనున్నాయి.