అమూల్ పాలకు ఎదురుదెబ్బ – నందిని పాలను మాత్రమే వాడాలని హోటల్స్ అస్సోసియేషన్స్ నిర్ణయం

గుజరాత్‌కు చెందిన డెయిరీ దిగ్గజం అమూల్‌కు షాక్ ఇచ్చింది బెంగళూరు. బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ “రాష్ట్ర (పాడి) రైతులకు మద్దతుగా” నందిని పాలను మాత్రమే ఉపయోగించాలని సంచల నిర్ణయం తీసుకుంది. కాగా.. బెంగళూరు డెయిరీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న అమూల్ ప్రకటనపై.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్) ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో.. అమూల్ అనే పేరు లేకుండా.. […]

Share:

గుజరాత్‌కు చెందిన డెయిరీ దిగ్గజం అమూల్‌కు షాక్ ఇచ్చింది బెంగళూరు. బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ “రాష్ట్ర (పాడి) రైతులకు మద్దతుగా” నందిని పాలను మాత్రమే ఉపయోగించాలని సంచల నిర్ణయం తీసుకుంది.

కాగా.. బెంగళూరు డెయిరీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న అమూల్ ప్రకటనపై.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్) ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో.. అమూల్ అనే పేరు లేకుండా.. కన్నడిగులు నందిని పాల ఉత్పత్తులను మాత్రమే ప్రోత్సహించాలని పేర్కొంది.

“మన రైతులు ఉత్పత్తి చేసే కర్ణాటక నందిని పాలను చూసి మనమందరం గర్విస్తున్నాము మరియు దానిని ప్రోత్సహించాలి. మన నగరంలో పరిశుభ్రమైన మరియు రుచికరమైన కాఫీ, చిరుతిళ్లకు పెట్టింది పేరు. మనం దానిని చాలా గర్వంగా ప్రోత్సహిస్తున్నాము. ఇతర రాష్ట్రాల నుండి మన దగ్గరికి పాలు అమ్మకానికి వస్తున్నట్టు సమాచారం అందింది. కాగా మనమంతా.. నందిని పాలకు మాత్రం ప్రోత్సాహకం అందిద్దాం” అని బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ నుండి ఒక ప్రకటన విడుదల చేయబడింది.

గతంలో.. రాష్ట్రంలోని బలీయమైన డెయిరీ బ్రాండ్ నందినిని పూర్తిగా తొలిగించడానికి బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

శుక్రవారం, కాంగ్రెస్ నాయకుడు మరియు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ “అమూల్ ఉత్పత్తులను కొనబోమని కన్నడిగులందరూ ప్రతిజ్ఞ చేయాలి” అన్నారు. కాగా.. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) మరియు గుజరాత్‌లోని ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (అమూల్) మధ్య విలీనానికి సంబంధించిన ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

దేశంలోని రైతుల సంక్షేమం కోసం నిర్మించిన కేఎంఎఫ్‌ను కన్నడిగులందరూ ఏకగ్రీవంగా ప్రతిఘటించాలని, అమూల్ ఉత్పత్తులను మాత్రం తాము కొనుగోలు చేయబోమని కనండి ప్రజలు అందరు ప్రతిజ్ఞ చేయాలని సిద్ధరామయ్య అన్నారు.

మన రాష్ట్ర సరిహద్దుల్లోకి చొరబడి హిందీ భాషా ద్రోహం, భూ ద్రోహంతో పాటు లక్షలాది మందికి జీవనాధారమైన కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్)ని మూసేసిన బీజేపీ.. ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం రైతులకు కూడా ద్రోహం చేయడానికి పూనుకుందని ఆయన ఆరోపించారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని, అమూల్‌ పాలు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఆపాలని సిద్ధరామయ్య కోరారు.

సహకార మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..  ఈ విషయంలో రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ మరియు షాపై విరుచుకుపడ్డారు ఈ మాజీ సీఎం. రాష్ట్రంలో బలహీనమైన బీజేపీ నాయకత్వమే KMF వ్యాపారంలో తిరోగమనానికి కారణమని ఆరోపించారు.

బుధవారం, కెంగేరి నుండి వైట్‌ఫీల్డ్ వరకు.. నగరం యొక్క పశ్చిమ చివర నుండి తూర్పు వరకు బెంగళూరుకు తాజాదనం యొక్క తరంగం వస్తోందని “లాంచ్‌అలర్ట్” అనే హ్యాష్‌ట్యాగ్‌తో అమూల్  ట్వీట్ చేసింది. పాలు మరియు పెరుగు డెలివరీని సులభతరం చేయడానికి శీఘ్ర వాణిజ్య ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తామని ట్వీట్‌లో తెలిపింది.