భారత్: పేరు మార్చుకున్న బ్లూ డార్ట్

కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇండియా అని ఉన్న పేరును భారత్ గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. కేవలం అది మాత్రమే కాకుండా జీ-20 సమావేశాలకు హాజరయ్యే దేశాధినేతలకు కూడా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అంటూ ఆహ్వానాలు పంపించింది. దీంతో విపక్షాలు కేంద్రం మీద ఫైర్ అయ్యాయి. తమ విపక్షాల కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టడంతోనే అధికార బీజేపీ ఇలా చేసిందని ఆరోపించాయి. కానీ ప్రభుత్వం మాత్రం అదేమీ లేదని చెబుతోంది. ఇండియా అనేది […]

Share:

కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇండియా అని ఉన్న పేరును భారత్ గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. కేవలం అది మాత్రమే కాకుండా జీ-20 సమావేశాలకు హాజరయ్యే దేశాధినేతలకు కూడా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అంటూ ఆహ్వానాలు పంపించింది. దీంతో విపక్షాలు కేంద్రం మీద ఫైర్ అయ్యాయి. తమ విపక్షాల కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టడంతోనే అధికార బీజేపీ ఇలా చేసిందని ఆరోపించాయి. కానీ ప్రభుత్వం మాత్రం అదేమీ లేదని చెబుతోంది. ఇండియా అనేది వలసదారులు పెట్టిన పేరని అందుకే భారత్ అని మార్చినట్లు వివరణ ఇచ్చింది. ఈ పేరు మార్పు ఇంకా అధికారింగా ఆమోదం పొందకపోయినా కానీ చాలా కంపెనీలు తమ కంపెనీలో ఇండియా అనే పేరు ఉన్నా లేక తమ సేవల్లో ఇండియా అని వచ్చినా కానీ వాటిని భారత్ గా నామకరణం చేస్తున్నాయి. 

బ్లూ డార్ట్ ఇక భారత్ డార్ట్ 

ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ అయిన బ్లూ డార్ట్ గురించి అందరికీ తెలుసు. ఈ కంపెనీ తన వ్యాపార కార్యకలాపాలను కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా అనేక దేశాలలో నిర్వహిస్తోంది. అటువంటి బ్లూ డార్ట్ తన ప్రీమియం సేవలైన డార్ట్ ప్లస్ సేవలను భారత్ డార్ట్ గా మార్చేసింది. తాము ఇండియా వ్యాప్తంగా సేవలు అందిస్తున్నామని  అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బ్లూ డార్ట్ కంపెనీ తాను తీసుకున్న నిర్ణయాన్ని వివరిస్తూ.. తన సేవలో ఒకదాని పేరును భారత్ డార్ట్‌గా మార్చడం విస్తృతమైన ఆవిష్కరణ మరియు పరిశోధన ప్రక్రియ నుంచి ఉద్భవించిందని తెలిపింది. బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ భారత్‌ ను ప్రపంచానికి మరియు ప్రపంచాన్ని భారత్‌ కు అనుసంధానం చేస్తూనే ఉన్నందున ఈ పరివర్తన ప్రయాణంలో చేరాలని అందరు వాటాదారులను ఆహ్వానించింది. బ్లూ డార్ట్ మేనేజింగ్ డైరెక్టర్.. బాల్ఫోర్ మాన్యుయెల్ మాట్లాడుతూ… ఈ రీబ్రాండింగ్ దేశం అనేది మాకు ఉత్తేజకరమైన వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు. కొత్త ఉత్సాహంతో మరింత మందికి సేవలు అందించేందుకు తాము ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాలకు తాము సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. 

అక్కడే మొదలైన రచ్చ

ఇండియా అనే పేరును భారత్ గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జీ-20 సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఆహ్వాన పత్రికల్లో బయటపడింది. అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పదం లేకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పదం కనిపించింది. దీంతో ప్రతిపక్షాలు ఈ వివాదం పై దుమ్మెత్తిపోస్తున్నాయి. తమ కూటమిని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని అందుకోసమే దేశానికి భారత్ అనే నామకరణం చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ప్రభుత్వం మాత్రం తన పనిని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తోంది. ఇక ఇప్పుడు ఈ పేరును అధికారికం చేయనుందనే వార్తలు కూడా వినవస్తున్నాయి. 

ప్రత్యేక సమావేశాలు అందుకేనా??

ప్రభుత్వం ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ సారి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబరు 18 నుంచి ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ నూతన భవనంలో ఈ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే కేంద్రం ఇండియా అనే పేరును భారత్ గా మారుస్తుందని అంతటా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కేవలం రాష్ట్రపతి పంపిన ఆహ్వానాల్లోనే కాకుండా… జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలో కూడా ఆయన ముందు ఉన్న నేమ్‌ ప్లేట్‌లో భారత్‌ అని రాశారు. ఈ చర్యపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించి భారతదేశాన్ని విభజించిందని వారు ఆరోపిస్తున్నారు. తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఇండియాగా ఉన్న దేశం పేరును మారుస్తారా అంటూ కూటమి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు దేశం పేరు మారడంతో పాటు దేశంలో ఉన్న సంస్థలు కూడా తమ పేరును మార్చుకోవడం మొదలుపెట్టేశాయి.