అంబేద్కర్ జయంతి ప్రాముఖ్యత, ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలు

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భీమ్ రావు డాక్టర్ అంబేద్కర్ జయంతి ని ప్రతిఏటా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1881 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించారు. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేద్కర్ ను అంటరానివాడిగా చూసేవారు. స్కూల్ కి వెళ్లిన వేరుగా కూర్చోవాలిసిన దుస్థితి ఆనాడు ఎదుర్కొన్నాడు ఆ మహనీయుడు. ఒక్కోసారి తరగతి బయటే కూర్చుని ఎన్నో కష్టాలను అనుభవించి అంచెలంచెలుగా […]

Share:

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భీమ్ రావు డాక్టర్ అంబేద్కర్ జయంతి ని ప్రతిఏటా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1881 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించారు. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేద్కర్ ను అంటరానివాడిగా చూసేవారు. స్కూల్ కి వెళ్లిన వేరుగా కూర్చోవాలిసిన దుస్థితి ఆనాడు ఎదుర్కొన్నాడు ఆ మహనీయుడు. ఒక్కోసారి తరగతి బయటే కూర్చుని ఎన్నో కష్టాలను అనుభవించి అంచెలంచెలుగా ఎదిగిన అంబేద్కర్ ఓ గొప్ప ఎకనామిస్ట్ గా, జూరిస్ట్ గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేద్కర్ సొంతం. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించి గొప్ప విషయాల గురించి మనం తెలుసుకుందాం. 

అంబేద్కర్ తన తల్లిదండ్రులకు 14వ సంతానం. ఆయన పూర్తి పేరు భీమ్ రావు రాంజీ అంబేద్కర్ బీ ఆర్ అంబేద్కర్. అసలు ఇంటి పేరు అంబా వాడేకర్. ఆ పేరును అంబేద్కర్ గా మార్చారు. ఆయన టీచర్ మహదేవ్ అంబేద్కర్ గా మార్చారు.  త్రివర్ణ పథకాన్ని రూపొందించి పింగళి వెంకయ్య అన్న విషయం తెలిసిందే.  అయితే జెండాలోకి అశోక చక్ర బిఆర్ అంబేద్కర్ వల్లే వచ్చిందనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. నోబెల్ బహుమతి సాధించిన ప్రొఫెసర్ అమర్త్యసేన్ అంబేద్కర్ ను ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ గా సంబోధించారు.

 అంబేద్కర్ కు 64 సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉంది. హిందీ, పాలి, సంస్కృతం, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, ఇంగ్లీష్, పర్షియన్ , గుజరాతి వంటి భాషల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. వీటితోపాటు సుమారు 21 ఏళ్ల పాటు ప్రపంచంలోని అన్ని మతాల గురించి చదివి తెలుసుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో 8 ఏళ్ల కోర్సును కేవలం రెండు సంవత్సరాల మూడు నెలలలోనే పూర్తి చేశారు. ఇందుకోసం ఆయన రోజుకు 21 గంటలు చదివేవారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఈతరం బుద్ధుడిగా అభివర్ణించేవారు. బౌద్ధ సన్యాసి మహంతి చంద్రమణి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ పీహెచ్డీ పొందిన మొదటి ఏకైక వ్యక్తి అంబేద్కర్. 

దేశంలోని వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక అన్యాయాలను ఆయన నిరసించాడు. దళితులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన తన ప్రముఖ వ్యాసంలో ప్యూన్ లో వాటర్ లో ఎత్తి చూపారు. అంబేద్కర్ కు తాగునీరు నిరాకరించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. దళిత హక్కుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం మార్చి 31, 1995న అట్రాసిటీ నిరోధక చట్టాన్ని రూపొందించింది.

ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ ప్రధాన రూప జయంతిని పురస్కరించుకొని మహారాష్ట్రలోని లాతూర్ నగరంలోని ఒక పార్కులో 18 మంది కళాకారులు మోజాయిక్ ఆర్ట్ స్టైల్లో 18000 నోట్ బుక్కులను ఉపయోగించి తయారు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క భారీ చిత్రపటాన్ని ప్రదర్శించారు.

11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 100×110 అడుగుల విస్తీర్ణంలో పోర్ట్రెయిట్ తయారు చేయడానికి ఉపయోగించిన నోట్‌బుక్‌లను సామాజిక నిబద్ధతతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యపై అవగాహన కల్పించడానికి పంపిణీ చేస్తామని లాతూర్ బీజేపీ లోక్‌సభ సభ్యుడు సుధాకర్ శృంగారే చెప్పారు. పోర్ట్రెయిట్ తయారు చేయడం కోసం ఉపయోగించిన ఈ పుస్తకా లను పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.