లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడిన అల‌హాబాద్ హైకోర్టు 

అలహాబాద్ హైకోర్టులో ఒక ప్రత్యేకమైన కేసుకు సంబంధించి ప్రత్యేకించి మాట్లాడటం జరిగింది కోర్టు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది యువత లివ్ ఇన్ రిలేషన్షిప్ కు ఆకర్షితులవుతున్నారని, ఇటువంటి బంధాలు భారత దేశంలో ఉన్న పెళ్లి బంధాన్ని పక్కన పెట్టే విధంగా ఉన్నదని మరొక్కసారి గుర్తు చేసింది అల్హాబాద్ హైకోర్టు.  లివ్ ఇన్ రిలేషన్షిప్కి, పెళ్లి బంధానికి ఇదే తేడా:  నిజానికి యువత లివ్ ఇన్ రిలేషన్షిప్ కు ఎక్కువ ఆకర్షితులవుతూ తమ బంగారు భవిష్యత్తుని […]

Share:

అలహాబాద్ హైకోర్టులో ఒక ప్రత్యేకమైన కేసుకు సంబంధించి ప్రత్యేకించి మాట్లాడటం జరిగింది కోర్టు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది యువత లివ్ ఇన్ రిలేషన్షిప్ కు ఆకర్షితులవుతున్నారని, ఇటువంటి బంధాలు భారత దేశంలో ఉన్న పెళ్లి బంధాన్ని పక్కన పెట్టే విధంగా ఉన్నదని మరొక్కసారి గుర్తు చేసింది అల్హాబాద్ హైకోర్టు. 

లివ్ ఇన్ రిలేషన్షిప్కి, పెళ్లి బంధానికి ఇదే తేడా: 

నిజానికి యువత లివ్ ఇన్ రిలేషన్షిప్ కు ఎక్కువ ఆకర్షితులవుతూ తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని ప్రస్తావించింది అలహాబాద్ హైకోర్టు. అయితే ఇటువంటి బంధాలు కేవలం కొంతకాలం మాత్రమే అని, ముఖ్యంగా యువత ఇటువంటి బంధాల వైపు మక్కువ చూపుతూ, ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్నట్లు మండిపడింది హైకోర్టు. అయితే ఇటువంటి బంధాలలో ప్రత్యేకించి భద్రత, సామాజిక అంగీకారం మరియు స్థిరత్వం వంటివి కనిపించవని కేవలం అవి పెళ్లి బంధం లోనే ఉంటాయని తేల్చి చెప్పింది బెంచ్. 

మరి ముఖ్యంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ వంటివి ఎక్కువ అవ్వడం అనేది సొసైటీకి మంచిది కాదని, ఒక ఆరోగ్యమైన సొసైటీ పొందాలి అనుకుంటే ఇటువంటి బంధాలకు దూరంగా ఉండడం మంచిదని హైకోర్టు సలహా ఇచ్చింది. అయితే ఇటువంటి బంధాలు అనేవి, ఇతర దేశాలలో ఉన్నప్పటికీ ఆ దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని, లివ్ ఇన్ రిలేషన్షిప్ వంటివి ఎక్కువ కావడం వల్ల, వాటిల్లే సమస్యల కారణంగా యువత తమ జీవితాలను స్వయంగా నాశనం చేసుకుంటున్నారని, అందుకే అటువంటి బంధాలు వైపు ఆకర్షితుల అవ్వకుండా చూసుకోవాలని చెప్పింది అలహాబాద్ హైకోర్టు. 

దేశంలో ఇదే విధమైన ధోరణితో, భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. వివాహ బంధంలో భాగస్వామి విశ్వాసం మరియు స్వేచ్ఛగా జీవించడం ప్రగతిశీల సమాజానికి చిహ్నాలుగా మారతాయని.. యువత మాత్రం తాత్కాలికంగా ఉండే ఆనందం కోసం చూస్తుందని, దీర్ఘకాలంలో ఏర్పడే సమస్యలను పట్టించుకోకపోవడం మరో సమస్యగా మారుతుందని, హైకోర్టు తేల్చి చెప్పింది. 

హైకోర్టులో కేసు: 

అయితే ఒక కేసుకు సంబంధించి హైకోర్టు తన నిర్ణయాన్ని చెప్పడమే కాకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ వంటి వాటి మీద మాట్లాడుతూ ఇటువంటి బంధాల వల్ల ఏర్పడే దుష్ప్రభావాలు గురించి స్పష్టం చేస్తుంది. లివ్-ఇన్ పార్టనర్‌పై అత్యాచారం చేసిన నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంకా కేసు విషయానికి వస్తే, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న యువతి తన పార్టనర్ గా ఉన్న యువకుడు మీద ఫిర్యాదు చేసింది. తాము ఒక సంవత్సరం నుంచి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నట్లు, అయితే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిన ఆ యువకుడు మీద నమ్మకంతో తాను శరరీకంగా దగ్గరయందని, తాను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని, అయితే ఇప్పుడు ఆ యువకుడుని పెళ్లి చేసుకో అని అడగగా, తను నిరాకరించాడని తనకి న్యాయం జరిగేలా చూడాలని కోర్టుకి ఎక్కింది లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన యువతి. 

ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్న యువత పెద్దగా చదువుకుని మంచి స్థానాల్లోకి వెళ్తున్నప్పటికీ, ఇటువంటి లివ్-ఇన్ రిలేషన్షిప్ వైపు ఆకర్షితులవుతూ తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని చెప్పుకోవాలి. ఇటువంటి బంధాలు అనేవి సమాజంలో గౌరవప్రదంగా ఉండవని కూడా యువత అర్థం చేసుకోవాలని కోర్టు కోరింది.