అట్ట‌హాసంగా బోనాల పండుగ‌

ఈ ఆదివారం హైదరాబాద్లోని హరి బౌలి, షాహ్ అలీ బండ వద్ద అక్కన్న మదన్న గుడిలో  75- వార్షిక ఉత్సవాలు జరిగాయి. అంతేకాకుండా ప్రస్తుతానికి గుడికి వేల సంఖ్యలో భక్తులు రానున్నారు. ఈ పండుగ ప్రతి ఆషాడంలో జరుగుతుంది. 5 ఆషాడ శుక్రవారాలలో మహిళలు కుంకుమ అర్చన జరుపుకుంటారు.  బోనాల సంబరాలు:  గౌలిపురానికి చెందిన జి. ప్రత్యూష మాట్లాడుతూ.. ఈ ఏడాది బోనాలు ఎంతో ఆకర్షణీయంగా జరుపుకోవాలని, ‘కుంకుమార్చన’కు హాజరవుతున్నామని, రెండు రోజుల బోనాలు అంటే కుటుంబ […]

Share:

ఈ ఆదివారం హైదరాబాద్లోని హరి బౌలి, షాహ్ అలీ బండ వద్ద అక్కన్న మదన్న గుడిలో  75- వార్షిక ఉత్సవాలు జరిగాయి. అంతేకాకుండా ప్రస్తుతానికి గుడికి వేల సంఖ్యలో భక్తులు రానున్నారు. ఈ పండుగ ప్రతి ఆషాడంలో జరుగుతుంది. 5 ఆషాడ శుక్రవారాలలో మహిళలు కుంకుమ అర్చన జరుపుకుంటారు. 

బోనాల సంబరాలు: 

గౌలిపురానికి చెందిన జి. ప్రత్యూష మాట్లాడుతూ.. ఈ ఏడాది బోనాలు ఎంతో ఆకర్షణీయంగా జరుపుకోవాలని, ‘కుంకుమార్చన’కు హాజరవుతున్నామని, రెండు రోజుల బోనాలు అంటే కుటుంబ సమేతంగా ఉత్సాహంగా ఉంటుందని అన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ S.P. క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక దేవాలయం హైదరాబాద్ యొక్క గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది అన్నారు. అయితే బోనాల సందర్భంగా గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఆలయ మూలాలు మరియు పరిణామాన్ని తెలియజేస్తుంది.

గుడి చరిత్ర తెలుసుకుందాం: 

ఈ గుడి చరిత్ర గురించి చెప్పాలంటే,17 దశాబ్దంలో నిజాం సర్కార్ లో ఇద్దరు సోదరులు అక్కన్న మరియు మదన్న ఉండేవాళ్లు. అక్కన్న సెనాధిపతిగా, మదన్న ముఖ్య మంత్రిగా ఉండేవాళ్లు. వాళ్లు రోజు ఇంటి నుంచి గోల్కొండ కు వెళ్లేటప్పుడు దేవి కి పూజలు చేసి దేవడి లో కాసేపు విశ్రాంతి కూడా తీసుకునేవారు.  అక్కడ ఒక మహంకాళి గుడి ఉండేది, కానీ ఎవరికి తెలియదు. సెప్టెంబర్ 1948 లో పోలీస్ ఆక్షన్ జరిగినప్పుడు దేవడి గోడ విరిగిన తర్వాత గుడి గురించి తెలిసింది.

ఆ దేవడి  యజమాని మిర్ మొహమ్మద్ అన్వర్ అలీ భక్తుల కోసం గుడి తలుపులు తెరిచారు. మూర్తులు, పూజా సామాగ్రి లభ్యం అవ్వడం జరిగింది. ఖజీ బల్డ మహంకాళి గుడి కట్టడానికి స్థలం మరియు నగదు ఇచ్చారు. అప్పటినుండి ప్రతి ఆషాడంలో ఈ పండుగ జరుగుతుంది. అప్పటినుంచి ఆషాడ మాసంలో మహంకాళి బోనాలు జరుపుకోవడం ఆచారంగా మారింది. 

న్యూజిలాండ్ లో కూడా బోనాల సంబరాలు: 

తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే ఈ బోనాలు పండుగలు కేవలం భారతదేశంలోనే కాకుండా, ప్రపంచంలో అనేక ప్రాంతాలలో జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణయంగా మారింది. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న తెలంగాణ ప్రజలు బోనాల సంబరాలు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అంతేకాకుండా న్యూజిలాండ్ లో జరిగిన తెలంగాణ బోనాల సంబరాలలో, ప్రియాంక రాధాకృష్ణన్, పార్లమెంట్ సభ్యులు హెలెన్ మరియు మరి కొంతమంది ప్రముఖ నాయకులూ కూడా హాజరు కావడం ఇక్కడ మరింత ఉత్సాహానికి దారితీస్తుంది.

బోనాలకు పోలీసుల సహకరణ: 

ఆలయానికి వెళ్లే అన్ని రహదారుల్లో ట్రాఫిక్ మరియు ఊరేగింపు వెళ్లే రహదారులు దారి మళ్లించడం జరిగింది లేదంటే ట్రాఫిక్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా, మదీనా క్రాస్‌రోడ్ నుండి ఇంజిన్ బౌలి వరకు, గుల్జార్ హౌజ్, చార్మినార్, చార్మినార్ బస్ టెర్మినల్, హిమ్మత్‌పురా, నాగుల్చింత, మరియు అలియాబాద్ మీదుగా బోనాలు ఊరేగింపు ముగిసే వరకు వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు అని పోలీసు వారు ముందుగానే హెచ్చరించారు. 

అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఆలయానికి వెళ్లే రహదారులలో మరియు ఊరేగింపు ప్రయాణించాల్సిన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం జరిగింది.