ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఓడరేవులకు హైవే ద్వారా కనెక్టివిటీ

మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి 975 కిలోమీటర్ల తీరప్రాంతం, 240 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యంతో ఆరు పోర్టులు ఉన్నాయి. ఇప్పటికే నాలుగు కొత్త ఓడరేవులు అభివృద్ధిలో ఉన్నాయి. రాష్ట్రంలో మూడు పోర్టుల నేతృత్వంలోని కారిడార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకమైంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, “మేజర్ పోర్ట్, స్టేట్ పోర్ట్, ప్రైవేట్ పోర్ట్ అని అన్ని ఓడరేవులను ఈ రోజు […]

Share:

మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి 975 కిలోమీటర్ల తీరప్రాంతం, 240 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యంతో ఆరు పోర్టులు ఉన్నాయి. ఇప్పటికే నాలుగు కొత్త ఓడరేవులు అభివృద్ధిలో ఉన్నాయి. రాష్ట్రంలో మూడు పోర్టుల నేతృత్వంలోని కారిడార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకమైంది.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన

మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, “మేజర్ పోర్ట్, స్టేట్ పోర్ట్, ప్రైవేట్ పోర్ట్ అని అన్ని ఓడరేవులను ఈ రోజు నేను ప్రకటించబోతున్నానని, పోర్ట్‌ను 4-లేన్ల జాతీయ రహదారితో అనుసంధానించాలని మా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది” అని గడ్కరీ అన్నారు.

రాష్ట్రంలో 3 పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్‌లు ఉన్నాయని కూడా మాకు తెలుసు. కాబట్టే ఒకటి విశాఖపట్నం-చెన్నై, ఆ రోడ్డులో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, అనంతపురంలోని హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అని ఇప్పటికే నిర్ణయించామని, ఇప్పటికే మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కును ప్లాన్ చేసామని కూడా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రోడ్ నెట్‌వర్క్ 1,34,280 కి.మీ. 2014కి ముందు ఇక్కడ జాతీయ రహదారుల పొడవు 4,193 కి.మీ. మాత్రమే. తాను రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అది.. 109 శాతం పెరిగి, ఇప్పుడు 8,745 కి.మీ.గా ఉందని గడ్కరీ తెలిపారు.

“పారిశ్రామిక అభివృద్ధికి చాలా ముఖ్యమైన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను తయారు చేస్తున్నామని, అది లేకుండా ఎవరూ పెట్టుబడి పెట్టరని, మొత్తం 5 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలని మేము అభివృద్ధి చేయబోతున్నామని, మరియు గ్రీన్ ఫీల్డ్ మొత్తం పొడవు వచ్చేసి 662 కిలోమీటర్లు,మేము దీనికి రూ. 30,000 కోట్లు ఖర్చు చేస్తున్నాము” అని గడ్కరీ తెలిపారు. మరోవైపు నాగ్‌పూర్‌-విజయవాడలను కలుపుతూ 430 కిలోమీటర్ల పొడవైన రోడ్డు ప్రాజెక్టును కూడా చేపట్టనున్నట్లు గడ్కరీ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రోడ్లు

2007 నాటికి.. ఆంధ్రప్రదేశ్ గుండా వెళుతున్న జాతీయ రహదారుల పొడవు 4,647 కి.మీ మరియు రాష్ట్ర రహదారుల పొడవు 63,863 కి.మీ, వీటిలో 10,412 కి.మీ రాష్ట్ర రహదారులు. విస్తృతమైన రహదారి వ్యవస్థలో మూడు జాతీయ రహదారులు ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు కలుపుతాయి. రోడ్ల నిర్వహణ రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల చేతుల్లో ఉంది.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు రైలు వ్యవస్థ ఉంది. ఇది భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 5,107 కి.మీ రైలు మార్గాలలో.. 4,633 కి.మీ బ్రాడ్ గేజ్, 437 కి.మీ మీటర్ గేజ్ మరియు 37 కి.మీ నారో గేజ్ ఉంది.

విశాఖపట్నం ప్రధాన అంతర్జాతీయ ఓడరేవు. రాష్ట్రంలో నాలుగు ప్రధాన విమానాశ్రయాలు ఉన్నాయి – హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మరియు విశాఖపట్నం. తీరప్రాంతాల్లోని కాలువలు.. ముఖ్యంగా కొమ్మమూరు కాలువ, కృష్ణానది నుండి చెన్నై వరకు తీరానికి సమాంతరంగా సాగే ఈ ఉప్పునీటి కాలువ సరుకు రవాణాకు ఉపయోగపడుతుంది.