లడఖ్ ఎన్నికల ఫలితాలలో వెనుకబడిన బిజెపి

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రతి ఒక్క పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ధోరణి మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా పార్టీలు కూడా ఇతర పార్టీలతో పొత్తు పొద్దున్నే వైనం కూడా కనిపిస్తోంది. మరి ఇప్పుడు లదక్ ఎన్నికలు, బిజెపి, ఇండియా బ్లాక్ కి కలిసి వస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.  లడఖ్ ఎన్నికలు:  ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు తర్వాత జరిగిన మొదటి కీలక ఓటుగా […]

Share:

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రతి ఒక్క పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ధోరణి మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా పార్టీలు కూడా ఇతర పార్టీలతో పొత్తు పొద్దున్నే వైనం కూడా కనిపిస్తోంది. మరి ఇప్పుడు లదక్ ఎన్నికలు, బిజెపి, ఇండియా బ్లాక్ కి కలిసి వస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 

లడఖ్ ఎన్నికలు: 

ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు తర్వాత జరిగిన మొదటి కీలక ఓటుగా ఈ ఎన్నికలు మరింత ముఖ్యమైనవి. కేంద్రం నిర్ణయానికి రెఫరెండంగా ఈ ఎన్నికలను ఎన్‌సి నిర్వహించడం జరిగింది. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్-కార్గిల్‌కు జరిగిన ఎన్నికలలో ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ కూటమి 26 స్థానాలకు గాను 22 స్థానాలను గెలుచుకుని మొదటి ప్రధాన విజయాన్ని సాధించింది. నేషనల్ కాన్ఫరెన్స్ 12 సీట్లు సాధించగా, దాని కూటమి భాగస్వామ్య పక్షం కాంగ్రెస్ 10 కైవసం చేసుకుంది. BJP కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాలను గెలుచుకోగలిగింది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019లో లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా నియమించిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన మొదటి ఎన్నికలు ఇది.

లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లో 30 స్థానాలు ఉండగా, 26 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ హక్కులు కలిగిన నలుగురు కౌన్సిలర్లను సెంటర్ నామినేట్ చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు స్థానాల్లో పోటీ చేసింది. మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) పోటీ చేయలేదు. కాంగ్రెస్ మరియు ఎన్‌సి ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ 22 మంది అభ్యర్థులను నిలబెట్టగా, ఎన్‌సి 17 స్థానాల్లో పోటీ చేసింది. రెండు పార్టీలకు, బిజెపికి గట్టి పోటీ ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఏర్పాట్లు పరిమితం చేయబడ్డాయి. ఈ ఫలితాలను చూసి బిజెపి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని NC నాయకుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

ఫలితాలలో వెనుకబడిన బిజెపి: 

2018లో ఎన్నికల తర్వాత, మునుపటి కౌన్సిల్‌లో బిజెపిలో ముగ్గురు సభ్యులు ఉన్నారు, అందులో ఇద్దరు పిడిపి నుండి వచ్చిన వాళ్ళు. గత ఎన్నికల్లో భాజపా తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి స్టాంజిన్ లప్కా చా నియోజకవర్గం నుంచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. బి.జె.పికి ఆదరణ తక్కిన చిక్కాన్ ప్రాంతంలో కూడా అభ్యర్థి పద్మా దోర్జీ కాంగ్రెస్ నుండి స్తాక్‌చాయ్ ఖంగ్రాల్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఏమి చేస్తున్నారో అదే తరహాలో లడఖ్‌కు వాగ్దానం చేసిన అభివృద్ధి ఎజెండాపై బిజెపి ఎన్నికల్లో పోరాడింది. కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌ను పెంచుతామని కూడా మేనిఫెస్టో ప్రకారం పార్టీ హామీ ఇచ్చింది. 

ఫలించిన రాహుల్ గాంధీ యాత్ర!: 

రాహుల్ గాంధీ లడఖ్ పర్యటన, ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా స్థానిక సమాజంతో ఆయన సంప్రదింపులు కాంగ్రెస్ స్థానిక సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవడానికి సహాయపడింది. ఈ భావాన్ని పసిగట్టిన కాంగ్రెస్, రాజ్యాధికారం మరియు లడఖ్ సంస్కృతి, భూమి, ఉద్యోగాలు మరియు పర్యావరణాన్ని పరిరక్షించే ప్రత్యేక హామీల ప్రాతిపదికన ఏర్పడిన స్థానిక సంఘం కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు తెలివిగా తన మద్దతును అందించింది. ఇలా కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సంపాదించుకోవడానికి ఒక వైపు రాహుల్ గాంధీ యాత్ర కూడా ప్లస్ పాయింట్ అయింది.