Namo Bharat Train: తొలి సెమీ హైస్పీడ్ రైలును ప్రారంభించిన ప్ర‌ధాని..

దేశంలో మొట్ట మొదటి నమో భారత్‌ రైలు(Namo Bharat Train)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendramodi) శుక్రవారం పచ్చ జెండా ఊపారు. ఢిల్లీ- ఘజియాబాద్‌ -మీరట్‌ మార్గంలో నిర్మిస్తున్న రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌(RapidX)లో 17 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. ఈ 17 కిలో మీటర్ల కారిడార్‌తో పాటు ఇదే మార్గంలో ‘నమో భారత్‌’ రైలును మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్‌(Sahibabad) నుంచి దుహాయి(Duhayi) డిపో వరకు ఆయన నమో భారత్‌ రైలులో ప్రయాణించారు. రైలులో పాఠశాల […]

Share:

దేశంలో మొట్ట మొదటి నమో భారత్‌ రైలు(Namo Bharat Train)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendramodi) శుక్రవారం పచ్చ జెండా ఊపారు. ఢిల్లీ- ఘజియాబాద్‌ -మీరట్‌ మార్గంలో నిర్మిస్తున్న రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌(RapidX)లో 17 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. ఈ 17 కిలో మీటర్ల కారిడార్‌తో పాటు ఇదే మార్గంలో ‘నమో భారత్‌’ రైలును మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్‌(Sahibabad) నుంచి దుహాయి(Duhayi) డిపో వరకు ఆయన నమో భారత్‌ రైలులో ప్రయాణించారు. రైలులో పాఠశాల విద్యార్థులు, రైల్వే సిబ్బందితో మాట్లాడారు. 

వందే భారత్ రైళ్ల తరహాలోనే ఆధునిక టెక్నాలతో రూపొందించి దేశంలో తొలిసారి ప్రవేశపెడుతున్న సెమీ-హైస్పీడ్ రైళ్లకు పేరు మార్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైళ్లను ప్రారంభించడానికి ఒక్క రోజు ముందు అంటే గురువారం నాడు రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(RapidX) పేరును ‘నమో భారత్(Namo Bharat) ‘గా నామకరణం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మొదట 17 కి.మీల పరిధిలో ఐదు స్టేషన్ల మధ్య అక్టోబర్ 21 నుంచి ఈ రైళ్లు సేవలందించనున్నాయి. 

కాగా, ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌లోని 17-కిమీ ప్రాధాన్యత విభాగంలో సాహిబాబాద్ నుంచి దుహై డిపో స్టేషన్ వరకు వన్-వేలో ప్రయాణించే ధర రూ. 50, అదే రూట్‌లో ప్రీమియం-క్లాస్ కోచ్ ఎంపిక రూ. 100కి అందుబాటులో ఉంటుంది.

ఢిల్లీ- ఘజియాబాద్‌ -మీరట్‌ ఆర్‌ఆర్‌టీఎస్‌ మొత్తం పొడవు 82.15 కిలోమీటర్లు. రూ. 30 వేల కోట్లతో చేపట్టిన 85.2 కి.మీల ఢిల్లీ-ఘజియాబాద్-మీరఠ్ ఆర్ఆర్టీఎస్ కారిడార్ కు ప్రధాని నరేంద్ర మోడీ 2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు. దీన్ని 2025 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.  మిగిలిన మార్గం మరో ఏడాదిన్నరలో పూర్తవుతుందని, దాన్ని తానే ప్రారంభిస్తానని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు హరియాణా, రాజస్తాన్‌లో నగరాలు, పట్టణాలను అనుసంధానించేలా మరికొన్ని నమో భారత్‌ (Namo Bharat)ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈస్ట్‌–వెస్ట్‌ కారిడార్, బెంగళూరు మెట్రో రైలును కూడా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.    

ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తాయి. ప్రారంభంలో, ప్రతి 15 నిమిషాలకు రైళ్లు అందుబాటులో ఉంటాయి, అయితే భవిష్యత్తులో అవసరం ప్రాతిపదిక ఫ్రీక్వెన్సీని పెంచవచ్చు’ అని మీడియాకు ఓ అధికారి వెల్లడించారు. సాహిబాబాద్, దుహాయి డిపోల మధ్య 17 కిలోమీటర్ల దూరానికి ప్రజలు దాదాపు రూ. 100-150 ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. అలాగే, ప్రజలు ఘజియాబాద్ నుంచి సాహిబాబాద్ వరకు సుమారు రూ. 75-90 వసూలు చేయవచ్చు. ఈ రెండు పాయింట్ల మధ్య మెట్రో సేవలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. 

 రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(RRTS) రైళ్లలో పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ సౌకర్యం కలిగిన నమో భారత్ రైళ్లలో ఇరువైపులా 2×2 లేఅవుట్లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్ ర్యాక్లు ఉంటాయి.  సీసీటీవీ (CCTV) కెమెరాలు, వైఫై( Wi-Fi), మొబైల్ ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్‌లకు ఛార్జింగ్ మరియు మహిళలు, రోగులు మరియు మరిన్నింటి కోసం ప్రత్యేక కోచ్‌లు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన వ్యక్తులకు వేగవంతమైన మరియు నమ్మదగిన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో రైళ్లు తరచుగా నడుస్తాయి.

ఇది ఇలావుంటే, ర్యాపిడ్ఎక్స్ రైళ్లకు ‘నమో భారత్’గా పేరు మార్పు చేసినట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమో స్టేడియం తర్వాత.. ఇప్పుడు నమో రైళ్లు. స్వీయ ప్రచారానికి హద్దు లేకుండా పోయింది అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్(Jairam Ramesh) ట్విట్టర్ వేదికగా విమర్శించారు.