విద్యార్థుల‌కు ఐసిస్‌తో లింక్స్

ఈ మధ్యకాలంలో భారత దేశంలో ఉగ్రవాదుల ఛాయలు మళ్లీ కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఐసిస్‌ వారితో సంబంధాలు ఉన్నట్లు NIA నివేదికలో పేర్కొంది. పోలీసులు చెప్పిన ప్రకారం:  భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన ఫైజాన్ అన్సారీని పోలీసులు అరెస్టు చేసి బిర్సా ముండా జైలుకు తరలించారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కి చెందిన 19 […]

Share:

ఈ మధ్యకాలంలో భారత దేశంలో ఉగ్రవాదుల ఛాయలు మళ్లీ కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఐసిస్‌ వారితో సంబంధాలు ఉన్నట్లు NIA నివేదికలో పేర్కొంది.

పోలీసులు చెప్పిన ప్రకారం: 

భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన ఫైజాన్ అన్సారీని పోలీసులు అరెస్టు చేసి బిర్సా ముండా జైలుకు తరలించారు. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కి చెందిన 19 ఏళ్ల విద్యార్థిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసినట్లు పిటిఐ నివేదించింది. ఫైజాన్ అన్సారీ అలియాస్ ‘ఫైజ్’ను రాంచీ NIA ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన తర్వాత బిర్సా ముండా జైలుకు తరలించారు.

దేశంలో పనిచేస్తున్న ఐఎస్‌ఐఎస్ మాడ్యూల్స్‌పై ఎన్‌ఐఏ పథకం ప్రకారం పట్టుకునే పనిలో పడిన నేపథ్యంలో అన్సారీని అరెస్టు చేసినట్లు ఏజెన్సీ ప్రతినిధి పిటిఐకి తెలిపారు. అన్సారీ మరియు అతని సహచరులు ఇస్లామిక్ స్టేట్‌కు తమ సేవలు అందజేస్తామని, దీనికి సంబంధించి అన్నింటికీ కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేసినట్లు దర్యాప్తులో తేలిందని NIA అధికారి తెలిపారు. ఐఎస్‌ఐఎస్ తరపున భారత్‌లో హింసాత్మక ఉగ్రదాడులు జరిపేందుకు ఉద్దేశించిన కుట్రలో అన్సారీ భాగమని ఎన్‌ఐఏ పేర్కొంది.

దొరికిపోయిన అన్సారి: 

జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో అన్సారీ ఇంట్లో, అదేవిధంగా అలీఘర్‌లోని అద్దె ఇంట్లోలో సోదాల జరిపిన అనంతరం, NIA అనేక ఎలక్ట్రానిక్ డివైసెస్ అలాగే కొన్ని ఆయుధాలు అనేవి స్వాధీనం చేసుకుంది. జూలై 16, 17 తేదీల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

అన్సారీ తన సహచరులుతో అంతేకాకుండా కొంతమంది వ్యక్తులతో కలిసి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భారతదేశంలో ISIS కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి, అదే విధంగా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆ సంస్థ ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి నేరపూరిత కుట్రను పన్నుతున్నట్లు సమాచారం. ISIS తరపున భారతదేశంలో హింసాత్మకమైన ఉగ్రదాడులు చేయడమే ఈ కుట్ర లక్ష్యం అని అధికార ప్రతినిధి తెలిపారు.

అన్సారీపై భారతీయ సెక్షన్ల ప్రకారం, కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు నమోదు చేశారు పోలీసులు. భారత్‌లో ఐఎస్‌ఐఎస్‌ క్యాడర్‌ స్థావరాన్ని పెంచుకునేందుకు అన్సారీ యువకులను కూడా రాడికలైజ్‌ చేస్తున్నాడని ఆ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా భారత యువతను ఉగ్రవాదుల వైపు ఆకర్షించే పనిలో కూడా అన్సారీ చురుకుగా ఉన్నాడు. వారి సంస్థకు రిక్రూట్‌మెంట్‌లపై అతనికి మార్గనిర్దేశం చేస్తున్న విదేశీ ఆధారిత ఐఎస్‌ఐఎస్ హ్యాండ్లర్‌లతో అతను సంప్రదింపులు జరుపుతున్నాడు అని ఎన్‌ఐఎ అధికార ప్రతినిధి నివేదించారు. ఈ కేసుకు సంబంధించి అంతర్జాతీయ కుట్ర ఏదైనా ఉన్నదేమో అని ఎన్‌ఐఏ కూడా దర్యాప్తు చేస్తుంది. 

సీమా కూడా ఒక ఏజెంట్ ఆ: 

అయితే ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమా అనే ముస్లిం మహిళ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తుంది. అయితే ఈమె కూడా పాకిస్తాన్ నుంచి పక్క ప్లాన్ ప్రకారమే వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా సీమ మళ్లీ పాకిస్తాన్ తిరిగి వెళ్లేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో సీమా కుటుంబ సభ్యులు ఆమెని పాకిస్తాన్కు తిరిగి వచ్చేందుకు నిరాకరించారని, తేలింది. అయితే ఇది ఎంతవరకు సరైన సమాచారం అనే దాని మీద దర్యాప్తు జరుగుతుంది. మరోపక్క సినిమా మాత్రం భారతదేశం నుంచి వెళ్లేది లేదని తేల్చి చెప్తుంది. సీమానీ పక్క ప్లాన్ ప్రకారం పాకిస్తాన్ వాళ్ళు పంపించారని, అంతేకాకుండా ఆమెకు మంచి ట్రైనింగ్ కూడా ఇచ్చారని, భారతీయ సాంప్రదాయ ప్రకారంగా ఎలా నడుచుకోవాలో అన్ని నేర్పించి పాకిస్థాన్ వారు పంపారని పోలీసు వారు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చిన గూడచారా? లేకపోతే ఎవరు? అనేది తేలాల్సి ఉంది.