మోదీపై అజిత్ ప‌వార్ ప‌రోక్ష విమ‌ర్శ‌లు

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీ అదే విధంగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీల మధ్య పోలికల గురించి మాట్లాడారు, గాంధీ మాదిరిగానే ఇప్పుడు ప్రధాని ‘మిస్టర్ క్లీన్’ ఇమేజ్‌ను పొందుతున్నారని అన్నారు. ఇటీవల ప్రధాని మోదీ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందుకున్న వేడుకకు హాజరైన అజిత్ పవార్, పుణె ప్రజలు ప్రధానికి సాదర స్వాగతం పలికారు. అజిత్ పవార్ మాటల్లో: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం మాట్లాడుతూ, మహారాష్ట్ర […]

Share:

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీ అదే విధంగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీల మధ్య పోలికల గురించి మాట్లాడారు, గాంధీ మాదిరిగానే ఇప్పుడు ప్రధాని ‘మిస్టర్ క్లీన్’ ఇమేజ్‌ను పొందుతున్నారని అన్నారు. ఇటీవల ప్రధాని మోదీ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందుకున్న వేడుకకు హాజరైన అజిత్ పవార్, పుణె ప్రజలు ప్రధానికి సాదర స్వాగతం పలికారు.

అజిత్ పవార్ మాటల్లో:

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం మాట్లాడుతూ, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీ అదే విధంగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీల మధ్య పోలికల గురించి మాట్లాడారు, గాంధీ మాదిరిగానే ఇప్పుడు ప్రధాని ‘మిస్టర్ క్లీన్’ ఇమేజ్‌ను పొందుతున్నారని అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ‘మిస్టర్ క్లీన్’ అని పిలుస్తూ ఉంటారని, అయితే ప్రస్తుతం ప్రధాని మోదీ కూడా అదే బాటలో నడుస్తూ మిస్టర్ క్లీన్ అనిపించుకుంటున్నారు అని ప్రస్తావించారు.

విదేశాల్లో, భారత ప్రధాని మోదీకి ఉన్న పాపులారిటీ గురించి చెబుతూ, ఆయన రాజీవ్ గాంధీ అలాగే నరేంద్ర మోదీ మధ్య ఉన్న పోలిక గురించి మాట్లాడారు. అంతర్జాతీయ పర్యటనల సమయంలో ఇందిరా గాంధీకి ఇలాంటి గౌరవం లభించేదని ఆయన అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ‘మిస్టర్ క్లీన్’ అని పిలుస్తూ ఉంటారని, అయితే ప్రస్తుతం ప్రధాని మోదీ కూడా అదే బాటలో నడుస్తూ మిస్టర్ క్లీన్ అనిపించుకుంటున్నారు అని ప్రస్తావించారు. మోదీ రూపంలో రాజీవ్ గాంధీన్ని మళ్లీ చూస్తున్నామని అన్నారు.

గత తొమ్మిదేళ్లుగా మోదీ చేసిన అన్ని కార్యక్రమాలను, ఆయన అత్యంత పని తీరుని చూశాం అని.. అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు అపూర్వమైన ప్రజాదరణ ఉంది అని.. అంతేకాకుండా ఇంతటి గౌరవం మరియు అభిమానం పొందిన నాయకుడు మరొకరు లేరని పవార్ అన్నారు.

ప్రధాని మోదీ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందుకున్న వేడుకకు హాజరైన పవార్, పుణె ప్రజలు ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల నిరసనల ఉనికిని ఆయన తోసిపుచ్చారు. కాన్వాయ్‌లో తన ప్రయాణంలో, తాను మరియు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎటువంటి నల్ల జెండాలను లేదా తమని వ్యతిరేకించే ప్రతిపక్షాలను చూడలేదని అన్నారు. ఊహించని విధంగా, రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి ప్రధానికి స్వాగతం పలుకుతూ, పలకరించడాన్ని మనం చూశాం అంటూ చెప్పుకొచ్చారు పవార్.

మణిపూర్ ఇష్యూ: 

మణిపూర్ లో కొన్ని నెలలుగా జరుగుతున్న హింస గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అక్కడ హింస మాత్రం ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. రోజుకు ఒక భయాందోళన కలిగించే విషయం బయట పడుతోంది. ఈ క్రమంలో, మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రకటనను డిమాండ్ చేశాయి. అంతేకాకుండా మణిపూర్ లో జరుగుతున్న ఇంతటి హింస గురించి, నరేంద్ర మోదీ కేవలం కొన్ని సెకండ్లు పాటు మాత్రమే ప్రస్తావించాడు అంటూ ప్రతిపక్షాలు ఎత్తి పొడిచారు. 

ఇన్ని నెలలు అవుతున్న ఎందుకు సరేనా యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ ప్రశ్నలు కురిపించారు. అయితే ఇది ఇలా ఉండగా, ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనను, పవార్, ప్రధానమంత్రితో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి ఖండించారు. దోషులకు తగిన శిక్ష పడేలా కేంద్రం మరియు మణిపూర్ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని పవార్ హామీ ఇచ్చారు.