సమ్మె‌ని కొనసాగిస్తున్న ఎయిర్ ఇండియా పైలెట్స్‌ – కొత్త శాలరీ ప్యాకేజ్‌పై అసంతృప్తి

కొనసాగుతున్న ఎయిర్ ఇండియా పైలెట్స్‌ సమ్మె – పట్టించుకోని ఎయిర్ ఇండియా అధినేత  గత కొంత కాలం నుండి పైలెట్స్‌ తమ శాలరీ ప్యాకేజీని పెంచాలి అంటూ సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎయిర్ లైన్స్ ని ప్రభుత్వం నుండి టాటా గ్రూప్స్ సంస్థ 2022 వ సంవత్సరంలో కొనుగోలు చేసింది. అప్పటి నుండి టాటా గ్రూప్స్ పైలెట్స్‌ కోసం ప్రవేశపెట్టిన సరికొత్త శాలరీ ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే శాలరీ ప్యాకేజ్‌మార్చాల్సిందిగా విన్నవించుకున్నా […]

Share:

కొనసాగుతున్న ఎయిర్ ఇండియా పైలెట్స్‌ సమ్మె – పట్టించుకోని ఎయిర్ ఇండియా అధినేత 

గత కొంత కాలం నుండి పైలెట్స్‌ తమ శాలరీ ప్యాకేజీని పెంచాలి అంటూ సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎయిర్ లైన్స్ ని ప్రభుత్వం నుండి టాటా గ్రూప్స్ సంస్థ 2022 వ సంవత్సరంలో కొనుగోలు చేసింది. అప్పటి నుండి టాటా గ్రూప్స్ పైలెట్స్‌ కోసం ప్రవేశపెట్టిన సరికొత్త శాలరీ ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే శాలరీ ప్యాకేజ్‌మార్చాల్సిందిగా విన్నవించుకున్నా ఏ మాత్రం కనికరం చూపలేదు టాటా గ్రూప్స్. దీనితో పైలెట్స్‌ అందరూ నిరసనకు దిగారు, శాలరీ ప్యాకేజ్‌మార్చేంత వరకు మా విధులను నిర్వహించబోమని సమ్మెకు దిగారు. దీని వల్ల టాటా గ్రూప్స్ ఎయిర్ లైన్స్ మీద చాలా నష్టపోయింది. దీనితో సారించిన కొత్త ప్యాకేజ్‌తో పైలెట్స్‌ ముందుకు వచ్చింది. ఈ ప్యాకేజికి అధికశాతం మంది పైలెట్స్‌ సంతృప్తి చెంది మద్దతు తెలుపగా కొంతమంది మాత్రం ఇప్పటికీ తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు.

ఎయిర్ లైన్స్ అధినేత క్యాంప్ బెల్ గత వారం కొత్త ప్రాకేజీ ప్రకటించడంతో పాటుగా వర్క్ ప్లేస్ టెక్నాలజీ మీద పెట్టుబడి పెట్టి ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పుకొచ్చాడు. ఇది ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని, దయచేసి మద్దతు తెలపాల్సిందిగా క్యాంప్ బెల్ కోరాడు. ఈ సందర్భంగా క్యాంప్ బెల్ మీడియాతో మాట్లాడుతూ ‘నిరసన వ్యక్తం చేస్తున్న పైలెట్స్‌ లో 90 శాతం మంది మేము ప్రవేశ పెట్టిన కొత్త శాలరీ ప్యాకేజ్‌ మరియు సరికొత్త పథకాలకు తమ ఆమోదం తెలిపారు, ఇప్పుడు వాళ్లంతా తిరిగి పనిలో చేరారు’ అని చెప్పుకొచ్చాడు. అయితే మిగిలిన పది శాతం మంది మాత్రం కొత్తగా ప్రవేశ పెట్టిన ప్యాకేజ్‌కి మద్దతు ప్రకటించలేదు, వాళ్ళు తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో ఎయిర్ ఇండియాలో రెండు పైలట్ యూనియన్స్ ఉండేవి. ఒకటి ఇండియన్ కమర్షియల్ పైలట్ అసోసియేషన్ కాగా, మరొకటి ఇండియన్ పైలెట్స్‌ గైడ్. ఈ రెండు అప్పట్లో క్యాంప్ బెల్ ప్రపోజ్ చేసిన శాలరీ ప్యాకేజ్‌ని వ్యతిరేకించాయి.
ఈ రెండు యూనియన్స్ తరుపున అక్షరాలా 1800 మంది పైలెట్స్‌ ఉండేవాళ్ళు, వీళ్ళ పోరాట పటిమ వల్లే నేడు వాళ్లకి కావాల్సిన శాలరీ ప్యాకేజ్‌ని దక్కించుకోగలిగారు.ఇది ఇలా ఉండగా ఎయిర్ ఇండియా సంస్థ మరో వెయ్యి మంది పైలెట్స్‌కి ఉద్యోగ అవకాశాలు ఇవ్వనుంది. ఈ సందర్భంగా అధినేత క్యాంప్ బెల్ మాట్లాడుతూ ‘ఔత్సాహికులకు మా ఎయిర్ ఇండియా సంస్థ రాబోయే సంవత్సరాలలో సరికొత్త ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతున్నాము. A320, B777, B787 మరియు B737 బ్లాక్స్ కి కెప్టెన్సీ, ఫస్ట్ ఆఫీసర్స్ మరియు ట్రైనర్స్ అవసరం ఉంది’ అంటూ ఈ గురువారం రోజు క్యాంప్ బెల్ చెప్పుకొచ్చాడు. ఎయిర్ లైన్ బిజినెస్ ని ఇంకా పెంచడానికి త్వరలోనే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ మరియు AIX కనెక్ట్ ని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తోంది ఎయిర్ ఇండియా సంస్థ, ఇదే కానుకగా జరిగితే ఎయిర్ ఇండియా ఆదాయం ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకోబోతుంది అనే చెప్పాలి. అలా జరిగితే ఎయిర్ ఇండియా కాస్త సురక్షితమైన స్థితికి చేరుకొని, ఉద్యోగుల కోరికలు తీర్చగలగవచ్చు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం సమ్మె చేస్తున్న కొంతమంది పైలెట్స్‌ ని ఎయిర్ ఇండియా పట్టించుకుంటుందా, లేదా 90 శాతం మద్దతు ఉంది కదా అని వదిలిస్తారో  చూడాలి.