ఎయిర్ ఇండియాలో భారీ సంఖ్యలో పైలెట్ల నియామకానికి నోటిఫికేషన్

భారతదేశ విమానయాన చరిత్రలో ఎయిర్ ఇండియా పాత్ర చాలా కీలకమైనది.  మొదటగా దీనిని టాటాలు ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత భారత ప్రభుత్వం చేతికి వచ్చింది. వరుస నష్టాలతో దానిని నడపలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేయడంతో రతన్ టాటా తన మహారాజాను తిరిగి కొనుగోలు చేశారు.  టాటాల చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. కస్టమర్లు మెచ్చే ప్రపంచ స్థాయి సేవలను అందించేందుకు టాటా గ్రూప్ కార్యాచరణ చేపట్టింది. దీనికి తోడు వందల […]

Share:

భారతదేశ విమానయాన చరిత్రలో ఎయిర్ ఇండియా పాత్ర చాలా కీలకమైనది.  మొదటగా దీనిని టాటాలు ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత భారత ప్రభుత్వం చేతికి వచ్చింది. వరుస నష్టాలతో దానిని నడపలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేయడంతో రతన్ టాటా తన మహారాజాను తిరిగి కొనుగోలు చేశారు.  టాటాల చేతికి ఎయిర్ ఇండియా పగ్గాలు వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. కస్టమర్లు మెచ్చే ప్రపంచ స్థాయి సేవలను అందించేందుకు టాటా గ్రూప్ కార్యాచరణ చేపట్టింది. దీనికి తోడు వందల సంఖ్యలో విమానాల కొనుగోలుకు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా 1000 ఉద్యోగాలను కూడా ప్రకటించింది.

నిరుద్యోగులకు శుభవార్త. టాటా గ్రూప్ కి చెందిన విమానయాల సంస్థ ఎయిర్ ఇండియా భారీగా పైలెట్లను నియమించుకోనుంది. కెప్టెన్లు ట్రైనర్లు కలుపుకొని మొత్తం వెయ్య మందికి పైగా పైలట్ల నియామకానికి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉద్యోగాల భారతికి ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ ఇండియా తన విమానాల సంఖ్యను నెట్వర్క్ ను భారీగా విస్తరించాలని నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ గత ఏడాది కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక సంస్థను లాభాల్లోకి తీసుకురావడంతో పాటు నెట్వర్క్ ను విస్తరించాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల పెద్ద సంఖ్యలో విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. ఎయిర్ బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220, విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మరి కొన్నేళ్లలో ఈ విమానాలు అందుబాటులోకి రానున్న ఈ నేపథ్యంలో పైలెట్ల నియామకానికి ఎయిర్ ఇండియా సిద్దమయింది.

 భవిష్యత్తులో 500 విమానాలు అందుబాటులోకి రానున్నాయని, ఏ 320, బి 777, బి787, బి737 విమానాల కోసం కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్లు నియమించుకోవాలని ఎయిర్ ఇండియా తన ప్రకటనలో తెలిపింది. మరోవైపు పైలెట్లకు సంబంధించి వేతన విధానాన్ని సర్వీసు కండిషన్లను మారుస్తూ ఇటీవల ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయం పై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తోంది. పైలట్లతో పాటు కేబిన్ సిబ్బందికి సంబంధించి వేతన విధానంలో ఏప్రిల్ 17న ఏరియా మార్పులు చేసింది. ఈ నిర్ణయాన్ని ఇండియన్ కమర్షియల్ పైలెట్ అసోసియేషన్ ఇండియన్ పైలెట్ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఎయిర్ ఇండియా పైలెట్లు తమ జీవితాల నిర్మాణం సేవా పరిస్థితులను పునరుద్ధరించడానికి ఎయిర్ లైన్ తాజా నిర్ణయం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 17న ఎయిర్ ఇండియా తన పైలెట్లు క్యాబిన్ సిబ్బందికి పునరుద్ధరించబడిన  నష్టపరిహార నిర్మాణాన్ని రూపొందించింది. ఆ తర్వాత రెండు పైలట్ యూనియన్లు, ఇండియన్ కమర్షియల్ పైలెట్ పైలెట్ అసోసియేషన్, ఇండియన్ పైలెట్ తిరస్కరించాయి. కార్మిక పద్ధతుల ఉల్లంఘన ఆరోపణలతో కొత్త ఒప్పందాలను ఖరారు చేసే ముందు వారిని సంప్రదించలేదు. టాటా గ్రూప్ కు నాలుగు విమాన విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, AIX కనెక్ట్ , విస్తారా. ఇది సింగపూర్ ఎయిర్ లైన్స్ తో జాయింట్ వెంచర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, AIX కనెక్ట్ అలాగే విస్తారాను ఎయిర్ ఇండియా తో విలీనం చేసే ప్రక్రియలో టాటా గ్రూప్ ఉంది.

ఈ నేపథ్యంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఎయిర్ ఇండియా పై మాట్లాడుతూ.. ప్రపంచాన్ని తలపించే ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి మాకు సమయం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కంపెనీలో మానవ వనరుల పరివర్తన, సాంకేతిక పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ప్లీట్ మార్పులు జరుగుతున్నాయన్నారు. ఎయిర్ లైన్ లో పని చేయాలనుకుంటున్న వారు లేదా తమ విమానా ప్రయాణ అనుభవాన్ని పంచుకోవాలనుకునే వ్యక్తుల నుంచి ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా మెసేజ్లు వస్తున్నాయన్నారు.  ముంబైలో జరిగిన బిటి మైండ్ రష్ అండ్ బిటి బెస్ట్ సీఈఓ అవార్డుల కార్యక్రమంలో ఒక బిలియన్ ప్రజలు ఎయిర్ ఇండియా విజయవంతం కావాలని కోరుకుంటున్నారని చంద్రశేఖరన్ వెల్లడించారు.