ఎయిర్ హోస్టెస్ మర్డ‌ర్ కేసులో కీల‌క మ‌లుపు

గత వారం రూపాల్ అనే ఎయిర్ హోస్టెస్ మర్డ‌ర్ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు, అందేరి పోలీస్స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు వెల్లడించారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.  ఎయిర్ హోస్టర్ హత్య కేసు:  వారం రోజుల క్రితం రూపాల్ అనే యువతిని హత్య చేసి, అరస్టయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడు విక్రమ్. అయితే ఏమైందో తెలియదు, సెప్టెంబర్ 8న తెల్లవారుజామున చూసాససరికి, నిందితుడిని ఉంచిన సెల్లులో, ప్యాంట్ ఉపయోగించి […]

Share:

గత వారం రూపాల్ అనే ఎయిర్ హోస్టెస్ మర్డ‌ర్ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు, అందేరి పోలీస్స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు వెల్లడించారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఎయిర్ హోస్టర్ హత్య కేసు: 

వారం రోజుల క్రితం రూపాల్ అనే యువతిని హత్య చేసి, అరస్టయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడు విక్రమ్. అయితే ఏమైందో తెలియదు, సెప్టెంబర్ 8న తెల్లవారుజామున చూసాససరికి, నిందితుడిని ఉంచిన సెల్లులో, ప్యాంట్ ఉపయోగించి ఉరి వేసుకొని చనిపోయినట్లు గుర్తించారు పోలీసులు. 

పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం, రూపల్ ఓగ్రే వృత్తి రీత్యా హెయిర్ హాస్టల్స్. తాను ట్రైనింగ్ కోసం తన ఊరు చండీగర్ నుంచి ముంబైకి రావడం జరిగింది. సబర్బన్ అంధేరిలోని మరోల్ ప్రాంతంలో ఒక ఫ్లాట్ లో రెంట్ తీసుకొని ఉంటుంది. అయితే రూపాల్ నివసిస్తున్న రెసిడెన్షియల్ సొసైటీలోనే సంవత్సరం పాటుగా  విక్రమ్ అనే 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి హౌస్ కీపింగ్ పని చేస్తున్నాడు. గత వారం ఆదివారం రోజున ఎప్పటిలాగే ఫ్లాట్ క్లీన్ చేసేందుకు, రూపాల్ ఫ్లాట్ కి వెళ్లిన విక్రమ్, అమానుషంగా ఆ అమ్మాయి గొంతు కోసి హత్య చేశాడు. 

స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం, విక్రం అదేవిధంగా ఎయిర్ హోస్టస్ ట్రైనింగ్ కోసం ముంబై వచ్చిన రూపాల్ కు చిన్న చిన్న విషయాల గురించి గొడవ జరిగేదని, బహుశా ఈ క్రమంలోనే విక్రమ్ ఇంత ఘోరానికి పాల్పడి ఉండొచ్చు అని పోలీస్ వారికి చెప్పారు రూపాల్ ఫ్లాట్ చుట్టుపక్కల ఉండే జనం. హత్య జరిగిన సమయంలో విక్రమ్ ఉపయోగించిన కత్తిని, అదేవిధంగా విక్రమ్ వేసుకున్న బట్టలను హ్యాండోవర్ చేసుకున్నారు పోలీసులు. విక్రమ్ అనే వ్యక్తి ఆ రెసిడెన్షియల్ ఏరియాలో సంవత్సరం పాటుగా ఉంటున్నట్లు, విక్రమ్ కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే పోలీస్ స్టేషన్ కు తరలించిన విక్రంని సెప్టెంబర్ 8 వరకు పోలీస్ కస్టడీలో రిమాండ్కు ఉంచాలనే లోకల్ కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది. 

తప్పుదారి పడుతున్న మనిషి ఆలోచన: 

రోజు రోజుకి మనిషి ఆలోచన తప్పు దారి పడుతుందని ఇలాంటి సంఘటనలు వెంటనే తెలుస్తుంది. ఒక మనిషిని మరొక మనిషి చంపే అంత క్రూరమైన ఆలోచనలు ఎందుకు పుడుతున్నాయి? ఈ మధ్యకాలంలో ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయి .ముఖ్యంగా యువతలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం కుటుంబం మీద, దేశ భవిష్యత్తు మీద దృష్టి ఉంచే యువత ముఖ్యంగా ఇప్పుడు, కేవలం మాదకద్రవ్యాలు మీద కుట్రలు, హత్యలు మీద దృష్ట పెడుతున్నారు. ఒకరకంగా వీటన్నిటికీ కారణం యువతని ప్రేరేపించే వ్యసనాలు అందుబాటులోకి రావడం. అంతే కాకుండా, కుట్రలు కుతంత్రాలతో కూడిన సినిమాలకు యువత ఎక్కువగా ఆకర్షితం అవడం. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను గమనించుకోకపోవడం వల్ల పిల్లలు పక్కదారి పట్టే అవకాశం ఉంది. కేవలం చిన్నతనం నుంచి అలవాటు చేసే కొన్ని విలువలు, యువతని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా చెడు స్నేహం, పతనానికి మొదటి మెట్టు. అందుకే యువత మంచి స్నేహాన్ని మాత్రమే వెతకాలి. చెడు స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ మీద మీ కుటుంబం ఆధారపడి ఉందని గుర్తుంచుకోండి. 

ఇప్పుడు జరిగిన హత్య కేసులో, చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ ఒకరిని మరొకరు తిట్టుకున్నప్పటికీ, హత్య చేసే అంత అమానుషంగా అయితే మనిషి ప్రవర్తించకూడదని గుర్తుంచుకోవాలి. సానుభూతి, మానవత్వం, మంచితనం, ఆలోచనతత్వం ఉండాలి తప్పిస్తే, మనిషికి ఆవేశం, ఆక్రోషం, కుట్ర వంటివి ఉండకూడదని మరొకసారి గుర్తుంచుకోవాలి.