Pollution: ఎయిర్ క్లీనర్లు అనారోగ్యం నుంచి తప్పించలేవు

రీసర్చ్ ఏం చేయించబడుతుందంటే..

Courtesy: Twitter

Share:

Pollution: చాలామంది తమ ఇళ్లల్లో ఎయిర్ క్లీనర్లు (Air cleaners) పెట్టుకుంటూ ఉంటారు. ఎయిర్ క్లీనర్లు (Air cleaners) అనేవి ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న గాలిని శుభ్రపరుస్తుందని నమ్ముతూ ఉంటారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని రీసెర్చ్ (Research) ల ప్రకారం ఎయిర్ క్లీనర్లు (Air cleaners) మనిషిని అనారోగ్యాన్నించి తప్పించలేవు అంటూ వెల్లడించాయి. పెరుగుతున్న కాలుష్యం (Pollution) కారణంగా చాలామంది తమ ఇళ్లల్లో ఎయిర్ క్లీనర్లు (Air cleaners) వాడుతున్న సందర్భంలో ఇటువంటి వార్త నిజంగా బాధాకరమే. 

ఎయిర్ క్లీనర్లు అనారోగ్యం నుంచి తప్పించలేవు: 

యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా నుండి వచ్చిన కొత్త పరిశోధన  (Research) ప్రకారం, ఎయిర్ క్లీనర్లు (Air cleaners) వైరల్ అనారోగ్యాలను సంక్రమించే ప్రమాదాన్ని తగ్గించవని తేలింది. ఇండోర్ ప్రదేశాలలో సామాజిక పరస్పర చర్యలను సురక్షితంగా చేయడానికి రూపొందించిన ఎయిర్ క్లీనర్లు (Air cleaners) వాస్తవ ప్రపంచంలో ప్రభావవంతంగా లేవని కొత్త అధ్యయనం (Research) వెల్లడించింది. ఒక ప్రత్యేకమైన టీం, ఎయిర్ క్లీనర్లు (Air cleaners), జెర్మిసైడ్ లైట్లు మరియు ఐయోనైజర్‌లతో సహా సాంకేతికతలను అధ్యయనం (Research) చేసింది. వారు అందుబాటులో ఉన్న అన్ని సాక్ష్యాలను పరిశీలించారు, అయితే ఈ ఎయిర్ క్లీనర్లు (Air cleaners) శ్వాసకోశ, జీర్ణశయ ఇన్ఫెక్షన్ల నుండి మనిషిని కాపాడలేవని తేలిందని వెల్లడించారు. 

పెరుగుతున్న కాలుష్యం: 

ఢిల్లీ (New Delhi)లో పెరుగుతున్న కాలుష్యం (Pollution) కారణంగా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అంటూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో కాలుష్య కారకాల శాతం 140% అధికమైనట్లు వాతావరణ కాలుష్య అధికారులు వెల్లడించారు. దీపావళి (Diwali)కి ముందు ఉదయం సమయంలో ఎయిర్ క్వాలిటీ AQI 200 ఉండగా, దీపావళి (Diwali) తర్వాత ప్రస్తుతం 400 దాటి 500కు చేరుకున్నట్లు ఢిల్లీ (New Delhi) వాతావరణ కాలుష్య శాఖ అధికారులు వెల్లడించారు. 

ఊపిరితిత్తులను ప్రభావితం చేసే, ప్రధాన ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రధాన కాలుష్య కారకాల శాతం, గత ఉదయం నుండి 24 గంటల వ్యవధిలో 140% భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీపావళి (Diwali) తర్వాత ఢిల్లీ (New Delhi)లో గాలి నాణ్యత విషపూరిత స్థాయికి దిగజారింది. PM2.5, గాలిలో ఉన్న అన్ని కణాలలో అత్యంత హానికరమైనది, ఉదయం 7 గంటలకు గంటకు సగటున 200.8గా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) నమోదు చేసిన వివరాల ప్రకారం నిన్న ఇదే సమయానికి 83.5గా నమోదైంది. 

 

ఢిల్లీ (New Delhi)లో రోజురోజుకీ కాలుష్యం (Pollution) అధికంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ (New Delhi) కాలుష్యం (Pollution) కారణంగా అనారోగ్య సమస్యలు  (Problem) వాటిల్లుతాయి అంటూ కొన్ని విషయాలు పాటించవలసిందిగా కోరుతుంది ప్రభుత్వం. మరోవైపు ఇప్పటికే పాఠశాలలకు (School) సెలవులు ప్రకటించింది ఢిల్లీ (New Delhi). కాలుష్యం (Pollution) తారస్థాయికి చేరడంతో శ్వాసకోశ  (Respiratory) సమస్యలు  (Problem) ఎదురవుతాయి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు అంటూ ఢిల్లీ (New Delhi) ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. దీపావళి (Diwali) నాడు ఉదయం ఏడు గంటలకు, ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు కారణంగా ఢిల్లీ (New Delhi)లో కాలుష్యం (Pollution) కాస్త తగ్గినప్పటికీ, దీపావళి తర్వాత కాలుష్య శాతం అమాంతం పెరిగినట్లు ఢిల్లీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) అధికారులు ప్రకటించారు.

 

 ఆరోగ్యం జాగ్రత్త: 

కలుషితమైన (Pollution) గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ మరియు పర్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య కారకాలు అధికంగా ఉంటాయి, ఇవి ఊపిరితిత్తుల (Lungs) పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. వ్యాయామం (Exercise) చేసేటప్పుడు లేదా నడిచేటప్పుడు కలుషితమైన (Pollution) గాలిని ఎక్కువ మొత్తంలో పీల్చుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. మెల్లమెల్లగా, ఇది ఊపిరితిత్తుల (Lungs) పనితీరును తగ్గిస్తుంది. ఆస్తమా మరియు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది.