బీజేపీతో పొత్తు ఉండదు.. !

తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి చీలిపోతూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలంతా అన్నాడీఎంకేకి వరుస కడుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య వివాదం ముదిరింది. పొత్తు ధర్మాన్ని మరిచిపోయి ఏఐడీఎమ్‌కే కుట్ర చేస్తోందంటూ బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. పళని స్వామి దిష్టిబొమ్మల్ని తగల బెడుతూ నిరసన వ్యక్తం చేస్తోంది. గత వారం ఐదుగురు బీజేపీ నేతలు అన్నా డీఎంకేలో చేరడంతో మొదలైన వివాదం ముదురుతూ వస్తోంది.  వచ్చే ఏడాది […]

Share:

తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి చీలిపోతూ వస్తోంది. రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలంతా అన్నాడీఎంకేకి వరుస కడుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య వివాదం ముదిరింది. పొత్తు ధర్మాన్ని మరిచిపోయి ఏఐడీఎమ్‌కే కుట్ర చేస్తోందంటూ బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. పళని స్వామి దిష్టిబొమ్మల్ని తగల బెడుతూ నిరసన వ్యక్తం చేస్తోంది. గత వారం ఐదుగురు బీజేపీ నేతలు అన్నా డీఎంకేలో చేరడంతో మొదలైన వివాదం ముదురుతూ వస్తోంది. 

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు.. తమ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇండియా అనే పేరుతో విపక్షాలు కూటమి కట్టడంతో బీజేపీ సైతం తన ఎన్డీయే కూటమిని బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీకి పెద్ద షాక్ ఎదురైంది. ఎన్డీయేలో ప్రధాన భాగస్వామి అయిన తమిళనాడు పార్టీ అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం బాంబ్ పేల్చింది. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తో పొత్తు ఉండదని అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత కుండబద్దలు కొట్టి చెప్పారు. కొద్ది రోజులుగా ఇరు పార్టీల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ ప్రకటన రావడం గమనార్హం.

ద్రావిడ నాయకుడు సి.ఎన్. అన్నాదురైని విమర్శిస్తూ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి.జయకుమార్ మండిపడ్డారు. తమిళనాడులో బీజేపీతో పొత్తు ఉండదని అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్ సోమవారం అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలోపు రాజకీయ పొత్తు గురించి ఆలోచిస్తాం అని డి. జయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు తమిళనాడులో బీజేపీతో మాకు ఎలాంటి స్నేహం లేదని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి అన్నాదొరైపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై చేసిన విమర్శలపై మాజీ మంత్రి జయకుమార్ స్పందించారు. దివంగత ముఖ్యమంత్రిని అవమానిస్తే తమ పార్టీ కార్యకర్తలు సహించరని అన్నాడీఎంకే పార్టీ నాయకుడు డి. జయకుమార్ అన్నారు. దివంగత జయలలిత సహా ఏఐఏడీఎంకే నేతలను బీజేపీ నాయకుడు అన్నామలై విమర్శించారు.

ఇది సరైన పద్దతి కాదు. సంయమనం పాటించాలని అన్నామలైని అన్నాడీఎంకే పార్టీ కోరినట్లు జయకుమార్ తెలిపారు. బీజేపీ నాయకుడు అన్నామలై ఏఐఏడీఎంకేతో పొత్తు కోరుకోవడం లేదని, అయితే మా పార్టీతో పొత్తు ఉండాలని బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నారని జయకుమార్ అన్నారు. 

మన పార్టీ నాయకులపై ఈ విమర్శలన్నీ సహించాలా? అంటూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ నాయకుడు జయకుమార్ ప్రశ్నించారు. మీ భారాన్ని మేము ఎందుకు మోయాలి? బీజేపీ తమిళనాడులో బోణి కొట్టదని, మీ ఓటు బ్యాంకు గురించి మాకు తెలుసు అంటూ అన్నామలైపై మాజీ మంత్రి జయకుమార్ మండిపడ్డారు. దీనితో మేము ఇక సహించలేమని, బీజేపీతో అన్నాడీఎంకేకి పొత్తు ఉండబోదని, పొత్తు విషయంలో ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు అని. ఇదే మా స్టాండ్ అని జయకుమార్ అన్నారు. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పోరు తుది దశకు చేరుకుందని మాజీ మంత్రి జయకుమార్ చెప్పారు.

కర్ణాటకలో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. తమిళనాడు సంస్కృతి, వారసత్వం, భాష గురించి ప్రధాని నరేంద్ర మోదీ చాలాసార్లు బహిరంగంగానే ప్రస్తావించారు. దీని ద్వారా తమిళనాడులో బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకోవాలని నిర్ణయించుకుంది. డీఎంకే చీఫ్ స్టాలిన్ నేతృత్వంలోని ఆపార్టీ తమిళనాడులో బీజేపీని నిలబడకుండా చేస్తోంది. హిందీ ప్రయోగాలు, సనాతన ధర్మం వంటి అంశాలను ముందుకు తెచ్చి డీఎంకే బీజేపీపై యుద్ధం ప్రకటించింది. ఎన్డీయే కూటమిలో భాగమైన ఏఐఏడీఎం వైదొలగితే బీజేపీకి తమిళనాడులో నష్టమేనని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.