NCERT పాఠ్య పుస్తకాల్లో మార్పులపై కేరళ ప్రభుత్వపు నిర్ణయం సడలలేదు..

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT ఇటీవల  సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసింది.. వాటిని విద్యార్థులకు బోధించాలని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SCERT కట్టుదిట్టంగా తెలిపింది. చరిత్రను వక్రీకరించే చర్యలను కేరళ ప్రభుత్వం ఒప్పుకోలేదు.. పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయడాన్ని కేరళ ప్రభుత్వం అంగీకరించలేదు.  NCERT 2002లో సిలబస్ను ‌హేతుబద్ధీకరించడం మొదలు పెట్టింది. ఆ తరువాత 2002 గుజరాత్ అల్లర్లు, మొగల్ కాలం నాటి […]

Share:

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT ఇటీవల  సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసింది.. వాటిని విద్యార్థులకు బోధించాలని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SCERT కట్టుదిట్టంగా తెలిపింది. చరిత్రను వక్రీకరించే చర్యలను కేరళ ప్రభుత్వం ఒప్పుకోలేదు.. పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయడాన్ని కేరళ ప్రభుత్వం అంగీకరించలేదు. 

NCERT 2002లో సిలబస్ను ‌హేతుబద్ధీకరించడం మొదలు పెట్టింది. ఆ తరువాత 2002 గుజరాత్ అల్లర్లు, మొగల్ కాలం నాటి భాగాలను 12వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి తొలగించారు. కోవిడ్ 19 వల్ల కలిగిన అంతరాయాల నేపథ్యంలో జాతీయ విద్యా విధానానికి  అనుగుణంగా హేతుబద్దీకరణ చేశారు. కొన్ని సబ్జెక్టులకు కంటెంట్ హేతుబద్ధీకరణను, అవలంబించాలని రాష్ట్రం నిర్ణయించింది. అయితే హిస్టరీ, పాలిటిక్స్ సైన్స్ వంటి హ్యుమానిటీస్ సబ్జెక్టుల కోసం మొగల్ సామ్రాజ్యం , 2002 గుజరాత్ అల్లర్లు వంటి భాగాలు విద్యార్థులకు బోధించాలని.. ఫైనల్ ఎగ్జామ్స్‌లో  వాటి ప్రశ్నలను కూడా జోడించాలని తెలిపారు.  

అంతేకాకుండా వీటితోపాటు గాంధీపై హిందూ తీవ్రవాదులకు గల అయిష్టత, ఆయన హత్య తరువాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై నిషేధం వంటి తొలగింపులు ముందుగా బహిరంగంగా ప్రకటించకుండానే పాఠ్యాంశ పుస్తకాలలో జోడించారు. ఈ విషయంపై కేరళ విద్యాశాఖ మంత్రి వి.శ్రవణ్ కుట్టి ఇవి రాజకీయ ప్రేరేపితమని.. వాటిని సమర్థించలేమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ చరిత్ర తిరస్కరణ రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. 

కేరళలో SCERT వారు అనుకున్న ప్రకారమే ఆరు నుండి పదో తరగతి పాఠ్యపుస్తకాలను తీసుకువచ్చారు. అలాగే 11, 12 తరగతులకు పాఠ్యపుస్తకాలను  చరిత్ర, రాజకీయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భౌగోళికం, సైన్స్ వంటి అంశాలకు ఉపయోగించారు. వాటిని కూడా ఇవి NCERT అనుమతితో పునరుద్ధరించారు. 

మొగల్ సామ్రాజ్యం అనే పాఠాన్ని తొలగించారు. ఇది ఒక్కటే కాకుండా సిలబస్‌లో చేసిన ఇతర మార్పులు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. 12వ తరగతి చరిత్ర పుస్తకాల్లో థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనే పేరుతో మూడు భాగాలుగా ప్రచురించింది. ఇందులో రెండో భాగంలోని తొమ్మిదో అధ్యాయంగా ఉన్న కింగ్ అండ్ హిస్టరీ మొగల్ దర్బార్ అనే పాఠ్యాంశాన్ని పుస్తకం నుంచి తొలగించింది. కొత్త చరిత్ర పుస్తకాలలో మొగల్ పాలకులకు సంబంధించిన 28వ పేజీల అధ్యాయం ఇప్పుడు లేదు. కొత్త చరిత్ర పుస్తకాలు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న సిలబస్ నుంచి మొగల్ పాఠాలను తొలగిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత చరిత్ర నుండి మొగలులను చెరిపి వేసే విధంగా ఉందన్నట్టు పరిగణిస్తున్నారు. విద్యార్థులపై సిలబస్ భారాన్ని తగ్గించేందుకు ఇలా చేశామని కేంద్రం చెబుతోంది. అయితే 12వ తరగతి పుస్తకాలలో మొగల్ ప్రస్తావన కనిపించే అధ్యాయాలు ఇంకా ఉన్నాయి. ఐదో అధ్యాయంలో యాత్రికుల దృక్పథం నుంచి భారత చరిత్ర చెప్పారు‌. ఈ అధ్యాయంలో పది నుంచి 17వ శతాబ్దం నాటి భారత స్థితిగతుల గురించి ప్రస్తావించారు. ఆరో అధ్యాయం భక్తి , సూఫీ సంప్రదాయాలపై దృష్టి సారించింది. ఈ అధ్యాయంలో కూడా మొగల్ కాలం నాటి సంగ్రహావలోకనం ఉంది.

SCERT రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలను మార్చగలరని చరిత్రకారుడు కేఎన్ గణేష్ తెలిపారు సొంత కంటెంట్‌తో సహా రాష్ట్రాలకు 20 శాతం అవకాశం ఇస్తారు. NEP తో సహా ఇందులో ఎలాంటి మార్పూ లేదు. ఇంతకు ముందు కూడా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం హయాంలో కూడా కేంద్రం పాఠ్యపుస్తకాలలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది.  SCERT మాత్రం వారి పాఠ్యపుస్తకాలలో వారు తీసుకున్న కంటెంటే ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇప్పుడు కూడా అలాగే జరిగింది..