చంద్రయాన్-3 తదుపరి ఘట్టం ఏంటి?

చంద్రయాన్-3 ఈ ప్రయోగం కోసం కేవలం భారత్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అని అంతా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. చంద్రుడికి అతి దగ్గరగా వెళ్లిన చంద్రయాన్-3 మిషన్ మరికొద్ది రోజుల్లోనే జాబిల్లిపై తన అడుగును మోపనుంది. ఈ ఘట్టం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. వారి కష్టం వృథా కాకూడదని అనేక మంది దేవుడిని ప్రార్థిస్తున్నారు.  ముఖ్య మైలురాయి […]

Share:

చంద్రయాన్-3 ఈ ప్రయోగం కోసం కేవలం భారత్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అని అంతా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. చంద్రుడికి అతి దగ్గరగా వెళ్లిన చంద్రయాన్-3 మిషన్ మరికొద్ది రోజుల్లోనే జాబిల్లిపై తన అడుగును మోపనుంది. ఈ ఘట్టం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. వారి కష్టం వృథా కాకూడదని అనేక మంది దేవుడిని ప్రార్థిస్తున్నారు. 

ముఖ్య మైలురాయి

గురువారం రోజు చంద్రయాన్-3 తన ప్రయాణంలో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. అందులోని ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా చంద్రుని వద్దకు ల్యాండర్ మాడ్యూల్ నితీసుకెళ్లింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక తర్వాత  జరిగే ఘట్టం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇక అదే తరువాయి.. 

దాదాపు నెలకింద ఇస్రో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోట రాకెట్ సెంటర్ నుంచి చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. నెల రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రయాన్-3 జాబిల్లమ్మకు చాలా దగ్గరగా వెళ్లింది. గురువారం రోజు ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా ముగించిన మిషన్  మరో ముఖ్యమైన పని కోసం అంతా సిద్ధం చేసుకుంటుంది. ఆగస్టు 23వ తేదీన చంద్రుడి ఉపరితలంపై ఇది ల్యాండ్ అవుతుందని ఇస్రో కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 16న ప్రొపల్షన్ చంద్రుడి కక్ష్య చుట్టూ ఐదవ మరియు చివరి భ్రమణాన్ని పూర్తి చేసింది. ఇక క్రాఫ్ట్ ను చంద్రుని ఉపరితలానికి మరింత దగ్గరగా తీసుకెళ్లింది. 

ల్యాండర్ నుంచి విడిపోయిన తర్వాత

చంద్రయాన్-3లో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోనుంది. ఇది విడిపోయిన తర్వాత ఎటువంటి పనులు చేస్తుందని  అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ స్పెక్ట్రో పొలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) పే లోడ్ ను ఉపయోగించి మన సౌర వ్యవస్థకు అవతల ఉన్న గ్రహాంతర జీవులను ఇది చిత్రీకరిస్తుంది. ఈ పరిశోధన వల్ల భూమి మానవులు కాకుండా మరే ఇతర గ్రహాంతర వాసులైనా ఉన్నారా అని కనుగొనడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది ప్రస్తుత కక్ష్యలో నెలలు లేదా సంవత్సరాల పాటు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని ఇస్రో ప్రకటించింది. 

ధీమా వ్యక్తం చేసిన చైర్మన్ 

ఇస్రో చైర్మన్ స్వామినాథన్ ఈ ప్రాజెక్టు పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుపై ఆయన పూర్తి ధీమాను వ్యక్తం చేశారు. ప్రాజెక్టు తప్పనిసరిగా విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. ఆయన ధీమా వ్యక్తం చేసిన విధంగానే చంద్రయాన్-3  అన్ని మైలురాళ్లను దాటుకుని కీలకమైన ముందడుగు వేసింది. కేవలం చివరి మెట్టు మీద మాత్రమే ఉంది. దీంతో ఈ ప్రాజెక్టు తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తల బృందం మాత్రమే కాకుండా అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఆ దేశాల సరసన.. 

ఈ ప్రాజెక్టు కనుక సక్సెస్ ఫుల్ అయితే ఇండియా ప్రపంచంలో చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా నిలవనుంది. ఇప్పటి వరకు అక్కడికి రష్యా, చైనా, యూఎస్ మాత్రమే మిషన్లను పంపాయి. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో ఇండియా కూడా ఆ దేశాల సరసన చేరనుంది. అన్నింటా దూసుకపోతున్న మన ఇండియాకు ఇది అనుకోని పెద్ద విజయమనే చెప్పాలి. అందుకే 140+ కోట్ల ఇండియన్ ప్రజలు ఈ మిషన్ సక్సెస్ కావాలని మన మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడాలని కోరుకుంటున్నారు. మరి ఏమవుతుందో..