Kajol Video: మొన్న రష్మిక నేడు కాజోల్.. వైరల్‌గా మారిన వీడియో

ఫేక్ వీడియోల కలకలం..

Courtesy: Twitter

Share:

Kajol Video: మొన్నటికి మొన్న రష్మిక(Rashmika) ఫేక్ వీడియో(Fake video) ఒకటి వైరల్ (viral) అయ్యింది. మోడల్ జారా పటేల్(Zara Patel) క్లీవేజ్ షో వీడియోను మార్ఫింగ్ చేసి.. రష్మిక ఫేస్ పెట్టారు. ఆ వీడియో అభ్యంతరకరంగా ఉండటంతో వైరల్ అయ్యింది. అయితే అది ఫేక్ వీడియో అని తేలింది. కాగా ఇప్పుడు రష్మిక, కత్రినా కైఫ్ బాటలో మరో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్‌కి(Kajol Video) ఇలాంటి అనుభవం ఎదురైంది.

AI ఏఐ టెక్నాలజీ(AI technology) వచ్చిన దగ్గర నుంచి సాధారణ ప్రజలకు కూడా ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. ఈ టెక్నాలజీ(Technology) ఉపయోగించి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే, మరికొంతమంది మాత్రం.. దానిని తప్పుడు పద్ధతిలో ఉపయోగించి ఇతరులకు సమస్యలు తెచ్చి పెడుతున్నారు. ఈక్రమంలోనే ఇటీవల హీరోయిన్ రష్మిక డీప్‌ఫేక్ వీడియో(Deep Fake Video) సమస్యని ఎదుర్కొన్నారు. ఎవరో ఒక అమ్మాయి వీడియోకి రష్మిక(Rashmika) పేస్ పెట్టి మార్ఫ్ చేశారు. ఆ వీడియో దేశంలో పెద్ద చర్చినీయాంశంగా మారింది. మార్ఫింగ్(Morphing) వంటి ఆగడాలు వల్ల ఆడవారికి సమస్య పొంచి ఉంది, అలాంటి వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖుల సైతం గవర్నమెంట్ కోరుతూ వచ్చారు. దీంతో భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని(New Rules and Regulations) తీసుకొచ్చింది. వాటిని అతిక్రమిస్తే జైలు శిక్ష (Imprisonment) మరియు జరిమానా విధించబడుతుందంటూ ప్రకటించినప్పటికీ.. ఆ ఆగడాలు తగ్గడం లేదు.

యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియోపై(Deep FakeVideo) దేశ వ్యాప్తంగా చర్చ నడిచింది. అయితే ఆ ఘటన మరువక ముందే.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, అజయ్ దేవగన్(Ajay Devgan) భార్య కాజోల్(Kajol) డీప్ ఫేక్ వీడియో(Deep FakeVideo) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాజోల్ బట్టలు మార్చుకుంటూ ఉన్న అభ్యంతరకర వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

 

కాజోల్ న్యూడ్ వీడియో పేరుతో 11 సెకన్ల వీడియో వైరల్ కావడంతో.. ఇది కాజోల్‌దేనంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. అయితే ఇది డీప్ ఫేక్ వీడియో. గతంలో రష్మిక ముఖాన్ని ఏవిధంగా అయితే మార్చి వీడియో వదిలారో.. సేమ్ ఇప్పుడు కూడా కాజోల్ ఫేస్ మార్చి కాజోల్ న్యూడ్ వీడియో(Nude video) పేరుతో వైరల్ చేస్తున్నారు.

అయితే కాజోల్ ఫేస్‌తో మార్ఫింగ్ చేసిన ఈ వీడియో టిక్ టాక్ స్టార్ రోసీబీరీన్స్ (Roy Beerens)గా గుర్తించారు. ఇండియాలో టిక్ టాక్ (TikTok) నిషేదించడంతో.. VPN టెక్నాలజీ సాయంతో ఆమె టిక్ టాక్ ఖాతాను గుర్తించారు. జూన్ 5న రోసీబీరీన్స్ వేసవిలో అనుకూలంగా ఎలాంటి వస్త్రాలను ధరించాలనే దానిపై ఈ వీడియోను చేసింది. ఆ వీడియోను ఇప్పుడు ఫేస్ మార్చి కాజోల్ న్యూడ్ వీడియో పేరుతో సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోను ఎవరు మార్ఫింగ్ చేశారనే విషయం తెలియాల్సి ఉంది.

 

కాగా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సెలబ్రిటీలు కోరుతున్నారు. రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి(Rakshit Shetty) రియాక్ట్ అయ్యారు. "ఇలాంటి మార్ఫింగ్(Morphing) సాఫ్ట్‌వేర్స్ అని ప్రస్తుతం అందరికి అందుబాటులో ఉంటున్నాయి. ముందు వాటిని అరికట్టాలి. లైసెన్స్ ఉన్న సాఫ్ట్‌వేర్స్ ఉపయోగించేలా రూల్ తీసుకు రావాలని" రక్షిత్ చెప్పుకొచ్చారు. రష్మిక ఫేక్ వీడియో వైరల్(Viral) అయినప్పుడు.. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఘటనను ఖండించారు. తాజాగా కాజోల్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో.. కాజోల్ అభిమానులతో పాటు.. అజయ్ దేవగన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని.. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.