హిందీలో MBBS ప్రవేశాలు చేస్తున్న మరో రాష్ట్రం

హిందీ భాషను చాలా రాష్ట్రాల్లో ప్రమోట్ చేస్తున్నారు. హిందీ భాషను తమ మీద రుద్దుతున్నారని కొన్ని రాష్ట్రాల నేతలు ఆరోపిస్తుంటే మరి కొంత మంది రాష్ట్ర నేతలు మాత్రం హిందీని ఇన్వైట్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు హిందీలో ఇప్పటికే బోధన చేస్తుండగా… కొన్ని రాష్ట్రాల్లో మాత్రం MBBS ప్రవేశాలను సైతం హిందీలో చేపడుతున్నారు.  రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్  ఇప్పటికే మధ్య ప్రదేశ్ రాష్ట్రం హిందీలో ఎంబీబీఎస్ ప్రవేశాలను చేపడుతోంది. ఇది మాత్రమే  కాకుండా ఇప్పుడు మరో రాష్ట్రం […]

Share:

హిందీ భాషను చాలా రాష్ట్రాల్లో ప్రమోట్ చేస్తున్నారు. హిందీ భాషను తమ మీద రుద్దుతున్నారని కొన్ని రాష్ట్రాల నేతలు ఆరోపిస్తుంటే మరి కొంత మంది రాష్ట్ర నేతలు మాత్రం హిందీని ఇన్వైట్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు హిందీలో ఇప్పటికే బోధన చేస్తుండగా… కొన్ని రాష్ట్రాల్లో మాత్రం MBBS ప్రవేశాలను సైతం హిందీలో చేపడుతున్నారు. 

రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ 

ఇప్పటికే మధ్య ప్రదేశ్ రాష్ట్రం హిందీలో ఎంబీబీఎస్ ప్రవేశాలను చేపడుతోంది. ఇది మాత్రమే  కాకుండా ఇప్పుడు మరో రాష్ట్రం కూడా.. హిందీలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు ఎస్ చెప్పింది. దీంతో అక్కడ ఎంబీబీఎస్ పాఠాలు కూడా హిందీలో చెప్పనున్నారు. ఈ నిర్ణయాన్ని కొంత మంది స్వాగతిస్తుంటే మాత్రం మరికొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఎవరు ఏమని అనుకున్నా కానీ హిందీని త్వరలోనే అమలు చేస్తామని అక్కడి విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. 

డిక్లేర్ చేసిన విద్యాశాఖ మంత్రి

రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాలల్లో ఈ నెలలోనే హిందీలో ఎంబీబీఎస్ ప్రవేశాలు చేపడతామని ఉత్తరాఖండ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ ప్రకటించారు. దేశంలో మధ్య ప్రదేశ్ రాష్ట్రం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుందని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో హిందీలో ఎంబీబీఎస్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా అంగీకరించారని రావత్ ప్రకటించారు. 

సిలబస్ కోసం కమిటీ

హిందీలో ఎంబీబీఎస్ కోర్సుల గురించి ఖరారు చేసేందుకు నిపుణులైన వైద్యులతో కమిటీ వేశామని రావత్ తెలిపారు. వారు చాలా బాగా అధ్యయనం చేశారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లో అధ్యయనం చేసి రాష్ట్రంలో హిందీలో చెప్పేందుకు అనువుగా ఉన్న కళాశాలలేవో అధ్యయనం చేశారని మంత్రి పేర్కొన్నారు. హిందీని విద్యాా మాధ్యమంగా ఎంచుకున్న చాలా మంది విద్యార్థులకు ఇది గొప్ప వరమని ఆయన తెలియజేశారు.   

భిన్న వాదనలు

హిందీ మాధ్యమంలో ఉన్నత విద్యను ప్రోత్సహించడం మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంత మంది విద్యా వేత్తులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరికొంత మంది విద్యావేత్తలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలా హిందీ వల్ల ఒరిగేది ఏమీ లేదని వారు అంటున్నారు. అందుకోసమే ఇలా హిందీని బలవంతంగా రుద్దడం సరికాదని తెలుపుతున్నారు. ఇలా హిందీ భాష వల్ల ఒరిగేది ఏమీ లేదని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే.. కొంత మంది మాత్రం ప్రతి దానికి రాద్దాంతం చేయడం ఎందుకని ఈ నిర్ణయం వల్ల ప్రజలకు మేలు జరుగుతోందని వారు అంటున్నారు. సాధారణ ప్రజలకే కాకుండా విద్యార్థులకు కూడా ఈ నిర్ణయం చాలా మేలు చేస్తుందని వారు తెలిపారు. 

మా మీద రుద్దకండి.. 

హిందీ నిర్ణయాన్ని మాత్రం కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మా మీద బలవంతంగా హిందీని రుద్దడం సరికాదని అంటున్నారు. ఈ నిర్ణయం తమ రాష్ట్రాల ఉనికిని దెబ్బతీస్తుందని విమర్శిస్తున్నారు. కేంద్రం ఈ నియంతృత్వ ధోరణిని మానేసుకోవాలని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో తమకు తమ రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలకు అప్లై చేయడం మానుకోవాలని చెబుతున్నారు. ఈ హిందీ అప్లై నిర్ణయం ఎలా ఉన్నా కానీ రాజకీయ నాయకులు మాత్రం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటున్నారు. ఈ విమర్శల పర్వం కొనసాగుతుండగానే  కొన్ని రాష్ట్రాలు మాత్రం హిందీని సైలెంట్ గా అమలు చేస్తున్నాయి. విద్యార్థులకు ఇది వరం అని చెబుతున్నాయి. ఉన్నత విద్యలో హిందీని అమలు చేస్తున్నాయి.