Uttarkashi Tunnel: మ్యానువల్‌ డ్రిల్లింగ్ కోసం రంగంలోకి భారత ఆర్మీ..

మరో 4 రోజుల్లో వర్టికల్ డ్రిల్లింగ్ పూర్తి

Courtesy: Twitter

Share:

Uttarkashi Tunnel: ఉత్తరకాశీలోని(Uttarkashi ) సిల్క్యారా టన్నెల్ ప్రమాదం(Silkyara Tunnel Accident) జరిగి నేటికి 15 రోజులు. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రిల్లింగ్ సమయంలో ఆగర్ యంత్రం విచ్ఛిన్నమైన సంగతి తెలిసిందే. దీంతో ఒకేసారి రెండురకాల పనులను ఆదివారం ప్రారంభించారు. నిలువుగా డ్రిల్లింగ్(Drilling) చేసి లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీయాలనేది మొదటి ప్రణాళిక. రెండవ ప్రణాళిక మ్యానువల్‌ డ్రిల్లింగ్ (Manual drilling) చేయడం. ముక్కలైన భాగాలు పూర్తిగా బయటకు వచ్చేస్తే సిబ్బంది ద్వారా 10-12 మీటర్ల మేర తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. స్టీలు గొట్టం నుంచి వెళ్లి ఒకరు తవ్వుతుంటే మరొకరు ఆ వ్యర్థాలను బయటకు చేరవేయాలి. ఇది సమయం తీసుకునే ప్రక్రియ. 

మరోవైపు ఆదివారం నుంచి కొండపై నుంచి నిలువు డ్రిల్లింగ్(Vertical Drilling) పనులు ప్రారంభమయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో(Rescue operation) నిమగ్నమైన ఏజెన్సీలు నిలువుగా డ్రిల్లింగ్ చేసి సొరంగం లోపల నుంచి 41 మంది కూలీలను వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటి వరకు 19.2 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్(Vertical Drilling) పూర్తయింది. లోపల చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి 86 నుంచి 87 మీటర్లు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రెస్క్యూ ఆపరేషన్‌లో(Rescue operation) నిమగ్నమైన ఏజెన్సీలు 100 గంటల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అంటే నవంబర్ 30 నాటికి నిలువు డ్రిల్ పూర్తయ్యే అవకాశం ఉంది. డ్రిల్లింగ్‌ జరిగినంతమేర 700 మి.మీ. వెడల్పైన పైపుల్ని ప్రవేశపెడుతున్నారు. కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ టీమ్(Rescue operation Team) పగలు రాత్రి శ్రమిస్తున్నారని ‘జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ’ (NHIDCL) ఎండీ మహమూద్‌ అహ్మద్‌ చెబుతున్నారు. 

మరోవైపు ప్లాస్మా కట్టర్‌తో ఆగర్‌ మిషన్‌(Auger Mission) బ్లేడ్‌లను కత్తిరించే పనులు కొనసాగుతున్నాయి. పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందనే దానికి సంబంధించి అధికారులు ఖచ్చితమైన సమయం చెప్పలేకపోతున్నారు.  టన్నెలింగ్‌లో నైపుణ్యం కలిగిన ఆర్నాల్డ్ డిక్స్(Arnold Dix) అనే నిపుణుడు, క్రిస్మస్ నాటికి విపత్తు ప్రదేశంలో ఉన్న కార్మికులు రక్షించబడతారని మరియు పరిస్థితి నుండి బయటపడతారని హామీ ఇచ్చారు. అంటే రెస్క్యూ ఆపరేషన్‌ను((Rescue operation)) క్రిస్మస్ సెలవుదినం కంటే ముందే పూర్తి చేయాలని భావిస్తున్నారు. మాన్యువల్ డ్రిల్లింగ్(Manual Drilling) కోసం భారత సైన్యం రంగంలోకి దిగింది. నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు భారత సైన్యం బాధ్యతలు స్వీకరించింది. మాన్యువల్ డ్రిల్లింగ్ పనిలో ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లు సహాయం చేయనున్నారు. ఆర్మీ ఇంజనీరింగ్ రెజిమెంట్ మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ బృందం నిర్మాణంలో ఉన్న సొరంగం వద్దకు చేరుకుంది. మాన్యువల్ డ్రిల్లింగ్ (Manual Drilling) పనులు ఆర్మీ బృందం చేపడుతోంది.

15 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడేందుకు స్మార్ట్‌ఫోన్లు పంపించారు. అలాగే వారు ఆందోళన చెందకుండా ఉండేందుకు ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వీడియో గేమ్‌లు(Video Game) డౌన్‌లోడ్ చేసి పంపించారు. వీటిలో లూడో, స్నేక్‌ వంటి గేమ్స్‌ ఉన్నాయి. లోపల చిక్కుకున్న కార్మికులు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ గేమ్స్‌ ఆడే విధంగా ఏర్పాట్లు చేశారు. లోపల చిక్కుకున్న కార్మికులు మొదట్లో వాకీటాకీల ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ కార్మికులు తమ కుటుంబాలతో ల్యాండ్‌లైన్ ఫోన్‌లతో మాట్లాడగలుగుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ నెల దీపావళి అమావాస్య నాడు సిల్‌క్యారా సొరంగం(Silkyara Tunnel Accident) మధ్యలో 41 మంది కూలీలు చిక్కుకుపోయి సరిగ్గా రెండు వారాలు పూర్తయింది.

ఇప్పటివరకు కార్మికులు ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే మరో నెలరోజుల పాటు ఇదే మానసిక స్థైర్యాన్ని కొనసాగించగలగాలి. అయితే ఎక్కువ రోజులు సొరంగంలో ఉండడం వల్ల కార్మికుల శారీరక, మానసిక ఆరోగ్యం(Mental Health) దెబ్బతినే ప్రమాదముంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. కార్మికులు తెలియని ఒత్తిడికి గురవుతారు. సహాయక చర్యలు ఆలస్యమవుతుండడం వారిలో ఆందోళనకు, గందరగోళానికి దారితీస్తాయి. బయటకు వెళ్లాలనే ఆరాటానికి, వెళ్లలేని నిస్సహాయత తోడై కార్మికులు మానసిక సమస్యల బారిన పడే ప్రమాదముంది.

బయటి వాతావరణ స్థితికి, సొరంగం లోపలి పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. విపత్కర పరిస్థితులు, ఎప్పుడు బయటికెళ్తామో తెలియని అనిశ్చితి కార్మికులను కలవరపెడతాయి. కార్మికుల్లో మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఎక్కువరోజులు సొరంగంలో ఉంటే.. ఏవో శబ్దాలు వింటున్నట్టుగా, కుటుంబ సభ్యులు పిలుస్తున్నట్టుగా భ్రాంతికి లోనవుతారని, ఆలోచనలపై నియంత్రణ కోల్పోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కార్మికులను బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా కొన్నిరోజులు పాటు వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచిస్తున్నారు. NDRF, SDRF, BROతోపాటు DRDO సామాగ్రితో భారత వాయుసేన కూడా సహాయక చర్యల్లో భాగమయింది. కార్మికులను బయటకు తెచ్చేందుకు అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేస్తున్నాయి.