విజయానికి దగ్గరగా ఆదిత్య L1 మిషన్

సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి ఆదిత్య L1 లాంచ్ జరిగింది. ఇది అంతరిక్షంలో భారతదేశం యొక్క మొట్టమొదటి సౌర అబ్జర్వేటరీ. 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థలోని మొదటి ‘లాగ్రాంజ్ పాయింట్’ (L1) చుట్టూ హాలో ఆర్బిట్ లో తిరగబోతోంది ఆదిత్య L1. ఇప్పుడు మరో ముందు అడుగు వేసింది ఆదిత్య L1, మూడో ఆర్బిట్(కక్ష్య)లోకి ప్రవేశించి మరో విజయాన్ని సొంతం చేస్తుంది ఇస్రో మిషన్.  కొత్త ఆర్బిట్(కక్ష్య)లోకి […]

Share:

సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి ఆదిత్య L1 లాంచ్ జరిగింది. ఇది అంతరిక్షంలో భారతదేశం యొక్క మొట్టమొదటి సౌర అబ్జర్వేటరీ. 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థలోని మొదటి ‘లాగ్రాంజ్ పాయింట్’ (L1) చుట్టూ హాలో ఆర్బిట్ లో తిరగబోతోంది ఆదిత్య L1. ఇప్పుడు మరో ముందు అడుగు వేసింది ఆదిత్య L1, మూడో ఆర్బిట్(కక్ష్య)లోకి ప్రవేశించి మరో విజయాన్ని సొంతం చేస్తుంది ఇస్రో మిషన్. 

కొత్త ఆర్బిట్(కక్ష్య)లోకి ప్రవేశించిన ఆదిత్య L1 మిషన్:

సూర్యుడు మీద పరిశోధన చేయడానికి నింగిలోకి ఎగిరిన ఆదిత్య L1 మిషన్, ఇప్పుడు మరో విజయాన్ని చేదిక్కించుకుంది. మెల్లగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ, ఇప్పటివరకు 2 ఆర్బిట్లను దాటి, మూడో ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ ఆపరేషన్ సమయంలో మారిషస్, బెంగళూరు, సుదాస్సీ-షేర్ మరియు పోర్ట్ బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌లను ట్రాక్ చేశారు. ఇక సెప్టెంబర్ 15 తెల్లవారుజామున 2 గంటలకు, నాలుగో ఆర్బిట్ లోకి ఆదిత్య మిషన్ చేరుకునే అవకాశం ఉంది అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. 

మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి?: 

L1 పాయింట్ అంటే ఎల్ వన్ చుట్టూ ఉండే హాలో ఆర్బిట్ మీదగా తిరిగే ఆదిత్య L1 అంతరిక్ష నౌక ద్వారా మనం సూర్యుని యొక్క అధిక-రిజల్యూషన్ ఫొటోస్ అదేవిధంగా సూర్యుడు చుట్టూ ఉండే మరిన్ని లేయర్స్ గురించి రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సూర్యుడు భూమి నుండి 150 మిలియన్ కి.మీ దూరంలో ఉన్నప్పటికీ మరియు L1 పాయింట్ కేవలం 1.5 మిలియన్ కి.మీ దూరం. అంతరిక్ష నౌక సూర్యుడిని అత్యంత దగ్గర నుంచి అదే విధంగా 24 గంటలు రీసెర్చ్ చేయడానికి సరిగ్గా సరిపోతుంది. మొదటిది, తెల్లవారుజామున నుండి సాయంత్రం వరకు మాత్రమే సూర్యుని చూసి అవకాశం ఉంటుందని.. రెండవది, సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మాత్రమే మనం సూర్యుని బయటి పొర =లేకుండా చూడగలమని.. కానీ ఇప్పుడు ఆదిత్య మిషన్ ద్వారా 24 గంటలు సూర్యుడి మీద పరిశోధన జరిపే అవకాశం ఉంటుందని విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, ఆదిత్య-ఎల్1లో ప్రైమరీ పేలోడ్ అయిన VELCకి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అయిన రమేష్ అన్నారు. 

చివరి కక్ష్య (ఆర్బిట్) చేరుకోవడానికి 100 రోజులు: 

శ్రీహరికోట నుంచి రాకెట్‌ బయల్దేరిన తర్వాత దానిని భూమి చుట్టూ ఉన్న భూమి కక్ష్య (LEO)లో ఉంచుతారు. తర్వాత, వేరే ఆర్బిట్ కు మెల్లమెల్లగా పంపించుకుంటూ వెళ్తారు. అయితే ముఖ్యంగా ఇక్కడ గ్రావిటేషనల్ ఫుల్ అనే ప్రిన్సిపల్ ఉపయోగించే, భూమికి సంబంధించిన ఆర్బిట్ నుంచి దూరంగా L1 పాయింట్ వైపుకు ముందుకు పంపడం జరుగుతుంది. ఆదిత్య-ఎల్1 అది కచ్చితంగా చేరుకోవలసిన ఆర్బిట్ ను చేరుకోవడానికి దాదాపు నాలుగు నెలల సమయం పడుతుంది. ఇస్రో నిర్వహించే ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (ఐడీఎస్‌ఎన్) ద్వారా డేటాను అందజేస్తామని సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు. 

ఆదిత్య-ఎల్1, ఇస్రోతో సన్నిహిత సహకారంతో IIA చే అభివృద్ధి చేయబడిన VELCతో సహా ఏడు పేలోడ్‌లను తీసుకువెళుతుంది. ఇతర పేలోడ్‌లు సూర్యుని చుట్టూ ఉండే కొన్ని లేయర్స్ ను చిత్రించడానికి ప్రయత్నిస్తాయి – ఫోటోస్పియర్ మరియు క్రోమోస్పియర్, సోలార్ స్టోర్మ్స్ వంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడతాయి. సూర్యుడు నుంచి వచ్చే వేడి గాల్పులు కారణంగా సాటిలైట్లు మీద అధిక ప్రభావం ఉంటుందా? భూమి యొక్క అత్యంత ముఖ్యమైన నక్షత్రం గురించి రహస్యాలను బయట పెట్టేందుకు జరుగుతున్న అనేక పరిశోధనలు తగ్గాయని చెప్పుకోవాలి. కానీ భూమండలం మీద ఉండే అన్ని జీవరాసులకు సూర్యుడు ముఖ్య ఆధారం. అందుకే సూర్యుడు మీద ఎన్నో రకాలైన పరిశోధనలు అనేక దేశాల ద్వారా జరుగుతూనే ఉన్నాయి.