BJP: ఉదయపూర్ టైలర్ హత్యలో బిజెపి హస్తం!

అశోక్ గెహ్లాట్ మాటల్లో..

Courtesy: Pexels

Share:

BJP: ఇటీవల ఉదయపూర్ (Udaipur) లోని ఒక టైలర్ కన్హయ్య లాల్ (Kanhaiya Lal) హత్య కేసు (Case)లో బిజెపి (BJP) హస్తం ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావాలనే కన్నయ్యను హత్య చేసి ఉంటారని అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) బల్లగుద్ది చెప్తున్నారు. సస్పెండ్ అయిన బిజెపి (BJP) నాయకుడు నుపుర్ శర్మకు మద్దతుగా కంటెంట్‌ను పోస్ట్ చేశారనే ఆరోపణపై కన్హయ్య లాల్ (Kanhaiya Lal) అనే టైలర్‌ను గత ఏడాది జూన్ 28న ఉదయ్‌పూర్‌లోని తన దుకాణంలో తల నరికి చంపారు. 

 

ఉదయపూర్ టైలర్ హత్యలో బిజెపి హస్తం!: 

 

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ (Kanhaiya Lal) నువ్వు చంపిన హంతకులకు బిజెపి (BJP)తో సంబంధం ఉంది అంటూ ఆరోపించారు, రాష్ట్రంలో నవంబర్ 25 న అసెంబ్లీ ఎన్నికలకు (Elections) ముందు బిజెపి (BJP) పార్టీ కావాలనే మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. జోధ్‌పూర్‌కు ప్రచార యాత్రలో విలేకరులతో మాట్లాడిన రాజస్థాన్ ముఖ్యమంత్రి, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కి బదులుగా రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజి) ఈ కేసు (Case)ను నిర్వహించి ఉంటే, విచారణలో తప్పకుండా పూరోగతి లభిస్తుందని అన్నారు.

 

సస్పెండ్ అయిన బిజెపి (BJP) నాయకుడు నుపుర్ శర్మకు మద్దతుగా కంటెంట్‌ను పోస్ట్ చేశారనే ఆరోపణపై, గత ఏడాది జూన్ 28న పట్టపగలు ఇద్దరు దుండగులు ఉదయ్‌పూర్‌లోని, టైలరింగ్ షాప్ నడుపుకుంటున్న కన్హయ్య లాల్ (Kanhaiya Lal) అనే టైలర్‌ను నరికి చంపారు. ఆరోపణ చేసినందుకు శ్రీమతి శర్మను బిజెపి (BJP) నుండి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయ్‌పూర్ టైలర్‌ని నరికి చంపన సంఘటన నిజానికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మరియు ప్రజల నిరసనను రేకెత్తించింది.

 

ఈ కేసు (Case) మొదట ఉదయపూర్ (Udaipur)‌లోని ధన్మండి పోలీస్ స్టేషన్‌లో నమోదైంది, అయితే తరువాత జూన్ 29, 2022న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఈ కేసు (Case) విషయంలో దర్యాప్తు మొదలుపెట్టింది. ఉదయపూర్ (Udaipur) లోని ఒక టైలర్ చనిపోయిన దురదృష్టకర సంఘటన విన్న తర్వాత తాను నిజానికి షెడ్యూల్ చేసిన ఈవెంట్‌లను రద్దు చేసుకొని ఉదయ్‌పూర్‌కు బయలుదేరానని.. అయితే, ఉదయ్‌పూర్ సంఘటన గురించి తెలిసిన తర్వాత కూడా బిజెపి (BJP)కి చెందిన పలువురు అగ్రనేతలు హైదరాబాద్‌లో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎంచుకున్నారు అని గెహ్లాట్ (Ashok Gehlot) చెప్పారు. .

 

ఘటన జరిగిన రోజే ఎన్ఐఏ ఈ కేసు (Case)ను టేకప్ చేసిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని చెప్పారు. ఎన్‌ఐఏ ఎలాంటి చర్యలు తీసుకుందో ఎవరికీ తెలియదని.. ఎస్‌ఓజి ఈ కేసు (Case)ను కొనసాగించినట్లయితే, ఈలోగా దోషులకు న్యాయం జరిగేది అని సిఎం గెహ్లాట్ (Ashok Gehlot) ఆదివారం అన్నారు.

 

జూన్ 28న ఉదయ్‌పూర్‌లోని మాల్దాస్ ప్రాంతంలో ఈ దారుణ హత్య జరిగింది. నేరం చేసిన వెంటనే, ఇద్దరు నిందితులు "తల నరికి" ఆ తరువాత దాని గురించి సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు, అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా బెదిరించిన వైనం కనిపిస్తోందని పోలీసులు వివరించారు.ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దుండగులు వీడియోలో కనిపించిన రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్‌గా గుర్తించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు, మరొక కేసు (Case)లో దుండగులను పోలీసులు అరెస్టు చేశారని, వారిని విడుదల చేయడానికి బిజెపి (BJP) నాయకులు పోలీసు స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. నేరస్థులకు బిజెపి (BJP)తో సంబంధాలు ఉన్నాయని.. సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు, పోలీసులు ఈ నిందితులను వేరే కేసు (Case)లో అరెస్టు చేసినప్పుడు.. కొంతమంది బిజెపి (BJP) నాయకులు వారిని విడుదల చేయడానికి పోలీసు స్టేషన్‌ కు వెళ్లరని అని గెహ్లాట్ (Ashok Gehlot) చెప్పారు.

 

ఎన్నికల్లో (Elections) ఓటమిని పసిగట్టిన బీజేపీ.. అందుకే విచిత్రమైన వాదనలు వినిపిస్తోందని.. నిజానికి తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, తీసుకొచ్చిన చట్టాల గురించి వారు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని.. ఎన్నికలలో (Elections) ప్రజలే తగిన సమాధానం చెబుతారని ముఖ్యమంత్రి అశోకు డెహలాట మరొకసారి గుర్తు చేశారు.