Chandrababu Naidu: బాబుకు భారీ ఊరటనిచ్చిన కోర్టు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు (Chandrababu Naidu) స్కిల్ డెవలప్ మెంట్ (Skill Scam) కేసులో అరెస్ట్ అయి.. దాదాపు నెల రోజుల నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబుకు జైలులో ఆరోగ్యం చెడిపోయిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతడికి (Chandrababu Naidu) చర్మ సంబంధిత వ్యాధులు వచ్చినట్లు వైద్యులకు చెప్పినట్లు సమాచారం. కానీ అతడికి (Chandrababu) ఎటువంటి చర్మ సమస్యలు (Skin Problemes) లేవని పోలీసులు మీడియాకు తెలిపారు. కానీ ఈ విషయం […]

Share:

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు (Chandrababu Naidu) స్కిల్ డెవలప్ మెంట్ (Skill Scam) కేసులో అరెస్ట్ అయి.. దాదాపు నెల రోజుల నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబుకు జైలులో ఆరోగ్యం చెడిపోయిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతడికి (Chandrababu Naidu) చర్మ సంబంధిత వ్యాధులు వచ్చినట్లు వైద్యులకు చెప్పినట్లు సమాచారం. కానీ అతడికి (Chandrababu) ఎటువంటి చర్మ సమస్యలు (Skin Problemes) లేవని పోలీసులు మీడియాకు తెలిపారు. కానీ ఈ విషయం గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో అంతా కంగారుపడ్డారు. ఆయన తరఫు లాయర్లు కోర్టులో (Court)  పిటిషన్ వేయడంతో కోర్టు ఆయనకు (Chandrababu Naidu) భారీ ఊరటనిస్తూ తీర్పునిచ్చింది. దీంతో టీడీపీ శ్రేణులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. 

ఇంతకీ కోర్టు ఏం చెప్పిందంటే.. 

ఆయనకు చర్మ సమస్యలు వచ్చాయని మీడియాలో (Media) పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఈ టాపిక్ పెద్ద హాట్ టాపిక్ అయింది. దీని మీద చంద్రబాబు తరఫు లాయర్లు కోర్టును ఆశ్రయించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు (Chandrababu Naidu) జైలులో ఏసీ ఫిట్ చేయాలన్నారు. అంతకు ముందు లాయర్లు (Lawyers) ఇదే విషయాన్నిపోలీసులకు విన్నవించగా.. వారు అందుకు ఒప్పుకోలేదు. దీంతో చేసేదేం లేక లాయర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు (ACB Court) కీలక ఆదేశాలు ఇచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు చంద్రబాబుకు (Chandrababu Naidu) ఎయిర్ కండీషనర్ అందించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇక ఆయన ఆరోగ్య స్థితి గురించి ఫుల్ టెన్షన్ పడ్డ టీడీపీ శ్రేణులు కోర్టు తీర్పుతో ఫుల్  ఖుషీ అయ్యారు. చాలా రోజుల నుంచి వరుస బ్యాడ్ న్యూస్ వింటున్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా గుడ్ న్యూస్ వినడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గురు, శనివారాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ను వైద్యుల బృందం పరీక్షించి.. పలు సూచనలు చేసింది. ఈ సూచనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు వెంటనే చంద్రబాబు (Chandrababu Naidu) కు జైలులో (Jail) ఏసీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. 

Read More: Chandrababu Naidu: టిడిపిని తప్పుడు ప్రచారం చేయకండి అంటున్న సజ్జల

ఏసీ అందుకోసమే.. 

జైలు మాన్యువల్ (Manual) లో ఏసీ అనేది ఉండదని పలువురు పోలీసులు తెలిపారు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కోసం అటువంటి ఏర్పాటు చేయలేమని వారు తెలిపారు. కానీ కోర్టు మాత్రం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు జైలులో ఏసీ ఏర్పాటు చేయాలని తెలిపింది. ఏసీ వల్ల దద్దుర్లు తగ్గే అవకాశం ఉంటుందన్న వైద్యుల (Doctors) సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోర్టు నిర్ణయం నిజాయతీకి నిలువుటద్దంలా ఉందని పలువురు చెబుతున్నారు. 

స్నేహ బ్లాక్ లో ఏసీ.. 

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బస చేస్తున్న స్నేహ బ్లాక్ (Sneha Block) లో ఈ ఏసీని ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఇంచార్జి సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. తమకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదని చెప్పారు. తాము నిబంధనల ప్రకారమే అన్ని ఏర్పాట్లను చేశామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చెందిన జనరల్‌ మెడిసిన్‌, డెర్మటాలజీ, అనస్థీషియాలజీ, పాథాలజీ, సర్జరీ విభాగాల్లో ఐదుగురు వైద్యుల బృందం చంద్రబాబునాయుడును (Chandrababu Naidu) పరీక్షించింది. పరీక్షల అనంతరం వారు ఒక నివేదిక అందజేశారు. జనరల్‌ మెడిసిన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మార్కండేయులు విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ను పరీక్షించినప్పుడు ప్రశాంతంగా కనిపించారని పేర్కొన్నారు. అతని (Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్నాడు. అతని దీర్ఘకాలికంగా చర్మ వ్యాధి ఉందని వారు తెలిపారు. అందుకోసమే ఈ ఎలర్జీ రావచ్చని పేర్కొన్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వైద్యుల బృందం మాజీ సీఎం (Chandrababu Naidu) కు చల్లని వాతావరణం కల్పించాలని సూచించారు.

బరువు పెరిగారు.. 

చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన తర్వాత ఘోరంగా బరువు (Weight) తగ్గారని వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయింది.  ఆయన 5 కేజీల (5 Kgs) వరకు బరువు తగ్గినట్లు ఆయన సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఆయన (Chandrababu Naidu) తో ములాఖత్ (Mulakhat) అయిన తర్వాత  భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ వ్యాఖ్యలను అధికారులు ఖండించారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జైలుకు వచ్చినపుడు కేవలం 66 కేజీల బరువు ఉండేవారని, కానీ ప్రస్తుతం ఆయన (Chandrababu Naidu) 67 కేజీల బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయన బరువు తగ్గారన్ని వార్తల్లో ఎటువంటి నిజం లేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.