ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా నియమితులైన అబ్దుల్ నజీర్

ఇక్కడి రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా జస్టిస్‌ నజీర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నూతన గవర్నర్‌ ప్రమాణస్వీకారం అనంతరం నాయకులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 12న నజీర్‌ను గవర్నర్‌గా నియమించారు. ఛత్తీస్‌గఢ్ రాజ్ భవన్‌కు బదిలీ […]

Share:

ఇక్కడి రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా జస్టిస్‌ నజీర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నూతన గవర్నర్‌ ప్రమాణస్వీకారం అనంతరం నాయకులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 12న నజీర్‌ను గవర్నర్‌గా నియమించారు. ఛత్తీస్‌గఢ్ రాజ్ భవన్‌కు బదిలీ అయిన బిశ్వ భూషణ్ హరిచందన్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత హరిచందన్ 2019 జూలైలో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. కర్ణాటకకు చెందిన జస్టిస్ నజీర్ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు. ట్రిపుల్ తలాక్ వివాదంపై తీర్పు వెలువరించిన ఫుల్ బెంచ్‌లో జస్టిస్ నజీర్ కూడా ఉన్నారు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ మెజారిటీ తీర్పును వ్యతిరేకించిన ఇద్దరు న్యాయమూర్తుల్లో అబ్దుల్ నజీర్ ఒకరు.

ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు స్వాగతం పలికిన సీఎం జగన్ 

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం స్వాగతం పలికారు. “అందమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసిన గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం పలకడం నా అదృష్టం. ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని గుర్తించడంలో మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. స్వాగతం సార్!”, అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

ఇక బదిలీపై వెళ్లిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు జగన్ ధన్యవాదాలు తెలిపారు మరియు ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా కొత్త పాత్రలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్‌గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్

జస్టిస్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు నుండి పదవీ విరమణ చేసిన ఒక నెల తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అయోధ్య కేసులో తీర్పు వెలువరించి, రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసిన బెంచ్‌లోని ఏకైక మైనారిటీ న్యాయమూర్తి ఆయనే. రామ జన్మభూమి ఆలయం రెండు వర్గాల మధ్య చాలా కాలంగా వివాదం నడిచింది. దీనిపై సుప్రీంకోర్టు చివరకు నవంబర్ 9, 2019 న తీర్పు ఇచ్చింది.

కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని బెలువాయిలో జనవరి 5, 1958న జన్మించిన జస్టిస్ నజీర్, మంగళూరులోని ఎస్డీఎమ్ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తి చేసారు. ఆ తర్వాత ఫిబ్రవరి 18, 1983 న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.

అబ్దుల్ నజీర్ కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు మరియు మే 12, 2003న అదనపు న్యాయమూర్తిగా నియమితుడయ్యారు. అబ్దుల్ నజీర్ సెప్టెంబర్ 24, 2004న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. ఇక ఫిబ్రవరి 17, 2017 న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందాడు.

జస్టిస్ నజీర్ ట్రిపుల్ తలాక్, గోప్యత హక్కు, అయోధ్య కేసు మరియు ఇటీవల నోట్ల రద్దు మరియు పార్లమెంటేరియన్ల వాక్ స్వాతంత్య్రంపై కేంద్రం తీసుకున్న 2016 నిర్ణయంతో సహా అనేక మైలు రాయిలలో పాలుపంచుకున్న.. ధర్మాసనం బెంచ్ తీర్పులలో భాగం అయ్యారు.