రాఘ‌వ్ చ‌ద్దా అనే నేను.. స‌స్పెండ్ అయిన ఎంపీని..

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా.. రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నారు. సభ నిబంధనల ఉల్లంఘన, దుష్ప్రవర్తన, ధిక్కరిస్తూ మాట్లాడే వైఖరి, ధిక్కరించే ప్రవర్తన చూపిస్తున్నందుకు రాఘవ్ చద్దాను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ స్పీకర్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ ప్రకటించారు. దీంతో రాఘవ్ చద్దా తన X(Twitter) బయోను మార్చుకున్నారు. గతంలో మెంబర్ ఆఫ్ […]

Share:

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా.. రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నారు. సభ నిబంధనల ఉల్లంఘన, దుష్ప్రవర్తన, ధిక్కరిస్తూ మాట్లాడే వైఖరి, ధిక్కరించే ప్రవర్తన చూపిస్తున్నందుకు రాఘవ్ చద్దాను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ స్పీకర్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ ప్రకటించారు. దీంతో రాఘవ్ చద్దా తన X(Twitter) బయోను మార్చుకున్నారు. గతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని ఉండగా.. దానిని సస్పెండెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్(బహిష్కృత పార్లమెంట్ సభ్యుడిని) అని చేంజ్ చేసుకున్నారు. 

సస్పెండ్ చేయడానికి గల కారణాలు

ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ బిల్లు-2023 కోసం ఏర్పాటు చేసిన ప్రతిపాదిత సెలక్షన్ కమిటీలో రాఘవ్ చద్దా కొంతమంది రాజ్యసభ ఎంపీల పేర్లను చేర్చారు. ఆ సభ్యుల జాబితాలో నరహరి అమీన్, ఎస్ ఫాంగ్నోన్ కొన్యాక్, సస్మిత్ పాత్ర, ఎం తంబిదురై మరియు సుధాన్షు త్రివేదితో సహా 19 మంది సభ్యులు ఉన్నారు. అయితే వారందరినీ వారి అనుమతి లేకుండా, రాఘవ్ చద్దా ఇష్టానుసారమే సెలక్షన్ కమిటీలో చేర్చారని, ఆ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దాపై చర్యలు తీసుకోవాలని సభా నాయకుడు పీయూష్ గోయల్ స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ జగ్‌దీప్ ధన్‌కర్.. రాఘవ్ చద్దాను సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

Raghav chadda(రాఘవ్ చద్దా) ప్రకటన:

దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన రాఘవ్ చద్దా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నా సస్పెన్షన్, బీజేపీ ప్రభుత్వం ఎలాంటిదో నేటి యువతకు ఒక స్పష్టమైన సందేశం లాంటిది. మీకు ప్రశ్నించే ధైర్యం ఉంటె, మీకు గొంతెత్తి ప్రశ్నిస్తే దానిని వారు(BJP) నలిపేస్తారు. బీజేపీ తీసుకొచ్చిన బిల్లుపై తాను కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగినందుకు నన్ను సస్పెండ్ చేశారు. నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, తప్పించుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. ఢిల్లీ రాష్ట్ర హోదాపై బీజేపీ అవలంబించిన ద్వంద్వ వైఖరి బయటపెట్టడంతో పాటు, ‘అద్వానీ-వాద్’, ‘వాజ్‌పేయి-వాద్’లను అనుసరించామని వాళ్లకు చెప్పడం నా నేరం. 34 ఏళ్ల ఎంపీకి సమాధానం ఇవ్వకుండా తనను సభ నుంచి సస్పెండ్ చేసిన ఘనత, ఆ మచ్చ బీజేపీపైనే ఉంటుంది. పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీని సస్పెండ్ చేసిన విధంగానే తమను ప్రశ్నించిన వారిని, లేదా AAP ఎంపీలను సస్పెండ్ చేసేందుకు అవలంబిస్తున్నారు’’ అని ఓ లేఖలో పేర్కొన్నారు. 

కాగా వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ నుంచి సస్పెండ్ అయినా రెండో ఎంపీగా రాఘవ్ చద్దా నిలిచారు. ఆయనకంటే ముందు APP సీనియర్ లీడర్, కీలక నేత సంజయ్ సింగ్ జులై 24న సస్పెండ్ అయ్యారు.

వాడీవేడిగా..

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఈసారి వాడి వేడిగా కొనసాగుతున్నాయి. మణిపూర్ ఘటనపై ప్రతిపక్షాలు బీజేపీని టార్గెట్‌గా చేసుకుంటూ ప్రశ్నల వర్షం కురిపించాయి. దీంతోపాటు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడమే కాకుండా, దానిని పాస్ చేయడంపై మండిపడ్డాయి. రాష్ట్రాల హక్కును బీజేపీ హరిస్తుందని, ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే ప్రశ్నించిన ఎంపీలను ఉభయ సభల స్పీకర్లు స్పస్పెన్డ్ చేశారు. ఓ పక్క నేతలను సస్పెండ్ చేసినా కానీ సమావేశాల వేడి మాత్రం తగ్గడం లేదు. దీంతో అధికార బీజేపీ పార్టీకి ఏం చేయాలో పాలుపోవడం లేదని అంతా చర్చించుకుంటున్నారు. ఎవరెన్ని అల్లర్లు చేసినా కానీ బలం ఉన్న బీజేపీ పార్టీ తాను అనుకున్న బిల్లులను నెగ్గించుకుంది.