బిజెపి పాలనలో ఎప్పుడు ఇలా జరగలేదు: షెల్లీ ఒబెరాయ్

అయితే ప్రస్తుతం, మేయర్ షెల్లీ ఒబెరాయ్ వాక్యాలు పొలిటికల్ పార్టీల్లో వేడిని పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఆప్ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ మంగళవారం నాడు మాట్లాడిన మాటలకు మద్దతునిస్తూ మాట్లాడారు మేయర్, షెల్లీ ఒబెరాయ్. AAP పార్టీ ఎప్పుడు కూడా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ ఉంటుందని, కార్మికుల జీతాలు విషయంలో ఇప్పుడు అదే జరిగిందని చెప్పుకొచ్చారు. సమయానికి జీతాలు అందుతున్నాయి:  ఆప్ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ మంగళవారం మాట్లాడుతూ, MCD పారిశుద్ధ కార్మికులు ప్రతి నెల […]

Share:

అయితే ప్రస్తుతం, మేయర్ షెల్లీ ఒబెరాయ్ వాక్యాలు పొలిటికల్ పార్టీల్లో వేడిని పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఆప్ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ మంగళవారం నాడు మాట్లాడిన మాటలకు మద్దతునిస్తూ మాట్లాడారు మేయర్, షెల్లీ ఒబెరాయ్. AAP పార్టీ ఎప్పుడు కూడా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ ఉంటుందని, కార్మికుల జీతాలు విషయంలో ఇప్పుడు అదే జరిగిందని చెప్పుకొచ్చారు.

సమయానికి జీతాలు అందుతున్నాయి: 

ఆప్ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ మంగళవారం మాట్లాడుతూ, MCD పారిశుద్ధ కార్మికులు ప్రతి నెల మొదటి రోజునే తమ జీవితాలను అందుకున్నట్లు తమ ప్రభుత్వంలో ఎటువంటి లోపం లేదు అని, ప్రభుత్వంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరు, కమిషనర్ దగ్గర నుంచి టీచర్, స్వీపర్, ఇలా ప్రతి ఒక్కరు ప్రభుత్వం కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల సమయానికి జీతం అందుతున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. 

అంతే కాకుండా, బిజెపి గత 13 సంవత్సరాలుగా చేయలేని విధంగా, ప్రస్తుతం తమ పార్టీ ద్వారా అందరికీ సరైన సదుపాయాలు అందుతున్నట్లు, డిసెంబర్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ సివిక్ ఎలక్షన్స్ లో తమ పార్టీ విజయం సాధించిన అనంతరం నుంచి, కేవలం ఐదు నెలల్లోనే పురోగతి చూపించినట్లు పేర్కొన్నారు ఆప్ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్. ఇది సంబరాలు జరుపుకునే రోజు అని, తమ పిల్లల కోసం, తన తరఫున ఇంటికి స్వీట్స్ తీసుకు వెళ్లాల్సిన రోజు అని ప్రభుత్వం కోసం పని చేసే ప్రతి ఒక్కరికి ఉద్దేశించి మాట్లాడారు కేజ్రీవాల్. ప్రతి ఒక్కరి కోసం నిజాయితీగా పని చేసే ఆప్ పార్టీ ఎప్పుడూ ప్రజలకు తోడుగా ఉంటుందని గుర్తు చేశారు  ఢిల్లీ ముఖ్యమంత్రి.

మద్దతు ఇచ్చిన మేయర్: 

మేయర్ షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ, MCD పారిశుద్ధ్య కార్మికులకు జూన్ నెల జీతాలు జూలై 1న ఇవ్వడం కేవలం ఆప్ పార్టీలోనే సాధ్యపడిందని, బీజేపీ 15 ఏళ్ల పాలనలో ఎప్పుడూ ఇలా జరగలేదని, పార్టీ మీద బురద జల్లారు మేయర్. MCD, BJP పాలనలో ఉన్నప్పుడు, 2007 మరియు 2022 మధ్య ఇలా ఎప్పుడు జరగలేదని నొక్కి చెప్పారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఒబెరాయ్ మాట్లాడుతూ, అన్ని గ్రూపులకు చెందిన ఎంసీడీ ఉద్యోగులకు నెల మొదటి రోజు వేతనాలు క్రమం తప్పకుండా అందుతున్నాయని, ఇంక వచ్చే నెలలో కూడా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు అందే విషయంలో ఎటువంటి మార్పు కనిపించదని, తన మద్దతును తెలిపారు మేయర్.

అయితే తమ పార్టీ MCDకి ఎప్పుడు అండగానే ఉంటుందని, ఎవరు ఎలాంటి రాజకీయాలు చేయాలనుకున్నప్పటికీ, నిజాయితీగా చేసే రాజకీయం మాది అంటూ, కార్మికులకు తమ వైపు నుంచి ఎప్పుడు సహాయం కావాలన్నా అందుతుంది అని ఒబెరాయ్. ముఖ్యంగా ట్విట్టర్ లో ఆప్ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన హామీలు గురించి ఉద్దేశించి ఒబెరాయ్ తనదైన శైలిలో మద్దతు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జీతాలు విషయాలలో మునపటి కంటే పురోగతి కనిపిస్తుందని, బిజెపి న్యాయకత్వంలో జీతాలు విషయంలో ఎప్పుడూ ఇలాంటి నిజాయితీ అనేది ఎప్పుడు కనిపించలేదు అని మేయర్ చెప్పుకొచ్చారు.