హర్యానా కావాలనే వ‌ర‌ద నీరు మావైపు మ‌ళ్లిస్తోంది: ఆప్

ప్రస్తుతానికి ఢిల్లీ పరిస్థితి అతలాకుతలంగా ఉంది. వరద నీరు ఢిల్లీని ముంచెత్తింది. 45 సంవత్సరాలుగా ఎన్నడూ చూడని వరదలు ఢిల్లీ అతలాకుతలమవుతుంది. ఎన్నో ప్రముఖ ప్రదేశాలు ఇప్పటికే నీటములిగాయి. ప్రత్యేకమైన సిబ్బంది ద్వారా బాధితులను పునరావాస శాఖలకు తరలిస్తున్నారు. ఇంకా అనేకమంది వరదల్లోని చిక్కుకున్నారు.  హర్యానా కావాలని చేస్తుంది:  అయితే ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఈ విధంగా ఉండగా, హర్యానా ప్రభుత్వం చేత బిజెపి కావాలని వరద నీటిని ఢిల్లీ వరకు మళ్ళీస్తుందని, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ […]

Share:

ప్రస్తుతానికి ఢిల్లీ పరిస్థితి అతలాకుతలంగా ఉంది. వరద నీరు ఢిల్లీని ముంచెత్తింది. 45 సంవత్సరాలుగా ఎన్నడూ చూడని వరదలు ఢిల్లీ అతలాకుతలమవుతుంది. ఎన్నో ప్రముఖ ప్రదేశాలు ఇప్పటికే నీటములిగాయి. ప్రత్యేకమైన సిబ్బంది ద్వారా బాధితులను పునరావాస శాఖలకు తరలిస్తున్నారు. ఇంకా అనేకమంది వరదల్లోని చిక్కుకున్నారు. 

హర్యానా కావాలని చేస్తుంది: 

అయితే ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఈ విధంగా ఉండగా, హర్యానా ప్రభుత్వం చేత బిజెపి కావాలని వరద నీటిని ఢిల్లీ వరకు మళ్ళీస్తుందని, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. కావాలనే హత్నికున్ద్  బారేజీ ద్వారా నీటిని ఢిల్లీ వైపుకి మల్లిస్తుందని, హర్యానా మీద ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. 

ఇదిలా ఉండగా కేజీ ఇవ్వాల్ చేసిన ఆరోపణలను హర్యానా కొట్టివేసింది. అంతేకాకుండా, తమ మీద ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని మందలించింది. ఇలాంటి ఆరోపణలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా బ్యారేజీ లోకి వచ్చిన లక్ష క్యూసెక్కుల నీళ్లు ఇతర ప్రాంతాలకు మళ్లీంచేందుకు వీలు పడదు అని హర్యానా తన ప్రభుత్వాన్ని తోసుకొచ్చింది. 

ఢిల్లీ వైపుకు వరద నీరు:

సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) మార్గదర్శకాల ప్రకారం లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువ ప్రవాహం ఉన్న నీటిని పశ్చిమ యమునా మరియు తూర్పు యమునా కెనాల్ లోకి విడుదల చేయలేమని సమాచార మరియు పౌర సంబంధాల శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. 

అంతేకాకుండా, అంతకుముందు రోజు, విలేకరుల సమావేశంలో, AAP సీనియర్ నాయకుడు మరియు రాజ్యసభ ఎంపీ, సంజయ్ సింగ్ మరియు AAP ప్రధాన అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ, వరదలు సంభవించినప్పుడు, హత్నీ కుండ్ నుండి ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తారని, కానీ జూలై 9 నుంచి 13 వరకు మొత్తం నీటిని ఢిల్లీ వైపు విడుదల చేశారని, మూడు రాష్ట్రాలకు సమానంగా నీటిని విడుదల చేసి ఉంటే యమునా నదికి ఆనుకుని ఉన్న ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలు సురక్షితంగా ఉండేవని మీడియాతో పేర్కొన్నారు.

వరద ముప్పు ప్రాంతాలు: 

దేశంలోని ఐదు రాష్ట్రాలు, ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్నాయి – హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ. ఒక్క ఢిల్లీ గురించే మాట్లాడితే గత మూడు రోజులుగా నగరంలో వర్షాలు కురవలేదని ఇక్కడి వారందరికీ తెలిసినప్పటికీ, యమునా నదికి అత్యధిక స్థాయిలో చేరుకున్న వరద నీరు కారణంగా ఢిల్లీ నీట మునిగింది అంటున్నారు సంజయ్ సింగ్. కానీ ఢిల్లీలో మూడు రోజులుగా వర్షం పడినప్పటికీ ఢిల్లీ, వరద ముంపు ప్రాంతాల లిస్టులోకి ఎలా వచ్చింది అంటున్నారు సింగ్. 

ఢిల్లీ వరద పరిస్థితి: 

రోడ్లు చిన్న చిన్న నదులుగా మారడంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగించారు. తరలించిన జనాలతో పాటుగా, కొన్ని జంతువులు, కుక్కలు, పశువులు కూడా ఉన్నాయి. ఉద్రిక్తంగా నీరు ప్రవహించే ప్రాంతాల నుండి ప్రజలను పడవలపై రక్షించినట్లు మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాము. 

కొంతమంది లోతట్టు ప్రాంతాల నివాసితులు, తమకు తినేందుకు ఆహారం లేదని సహాయం చేయాలి అంటూ మొరపెట్టుకుంటున్నారు. మీరట్ నుండి ఢిల్లీకి రెండు టాస్క్‌ఫోర్స్‌లను కూడా తరలిస్తున్నారు మరియు ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తున్నారు.