యువకుడి పై పెట్రోల్ దాడి

పట్టణంలో పట్ట పగలు యువకుడిపై ముగ్గురు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలైన యువకుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది..  అల్తాఫ్(19) అనే యువకుడిపై ముగ్గురు యువకులు పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన నగరంలో సంచలనంగా మారింది.. పుంగనూరు రోడ్డు డ్రైవర్స్ కాలనీ సమీపంలో డ్రైవర్స్ కాలనీకి చెందిన అల్తాఫ్‌పై ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి పట్టపగలే పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.  సోమవారం అల్తాఫ్ ఇంటి […]

Share:

పట్టణంలో పట్ట పగలు యువకుడిపై ముగ్గురు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలైన యువకుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది.. 

అల్తాఫ్(19) అనే యువకుడిపై ముగ్గురు యువకులు పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన నగరంలో సంచలనంగా మారింది.. పుంగనూరు రోడ్డు డ్రైవర్స్ కాలనీ సమీపంలో డ్రైవర్స్ కాలనీకి చెందిన అల్తాఫ్‌పై ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి పట్టపగలే పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. 

సోమవారం అల్తాఫ్ ఇంటి నుంచి బయటకు వస్తుండగా బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు… అల్తాఫ్ ను అడ్డుకొని, బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని మదనపల్లెలోని నవోదయ పాఠశాల సమీప ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అందరూ చూస్తుండగానే అల్తాఫ్ పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. స్థానికులు వెంటనే స్పందించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వాళ్లు పరారయ్యారు.

మంటలను అదుపు చేసి తీవ్రంగా గాయపడిన బాధితుడిని 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు

ప్రస్తుతం యువకుడికి ప్రాణాపాయం ఏమిలేదని డాక్టర్స్ తెలిపారు.బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు . ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆల్తాఫ్‌ను డీఎస్పీ పరామర్శించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఇటీవల జిల్లాలో ఇదే తరహాలో మరో ఘటన జరిగింది. కురబలకోట మండలం పూజారివాండ్లపల్లెలో జూన్‌ 6న మాజీ ఆర్మీ ఉద్యోగి శ్రీధర్‌‌ ఇంట్లో నిద్రిస్తుండగా అతడి భార్య మమత పెట్రోలు పోసి నిప్పంటించింది. ఉద్యోగ విరమణ తర్వాత దక్కే ప్రయోజనాలు, ఎల్‌ఐసీ డబ్బులు కాజేసేందుకు సొంత భర్తపైనే ఇలా పెట్రోలు పోసి నిప్పంటించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో మమత జైలుకు వెళ్లగా పిల్లలు అనాథలయ్యారు.

అలానే ఇంకో దారుణం కూడా జరిగింది అనంతపురం జిల్లా లో 

అనంతపురం జిల్లా సజ్జలదిన్నెలో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నిద్రపోతున్న దంపతులపై పెట్రోల్‌పోసి నిప్పుపెట్టారు  ఈ ఘటనలో భార్యాభర్తల తో పాటు బాలికకు మంటలు అంటుకుని తీవ్రగాయాలయ్యాయి. ఎల్లనూరు మండలం వేములపల్లెకు చెందిన నల్లపురెడ్డి, కృష్ణవేణి తాడిపత్రి పరిధిలోని సజ్జలదిన్నె వద్ద ఉన్న పరిశ్రమ లో పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. ఆ పరిశ్రమలో పనిచేస్తున్న వీరి బంధువు రమేశ్‌రెడ్డి మద్యాని కి బానిసయ్యాడు. రమేశ్ రెడ్డిని మద్యం ఎక్కువగా తాగొద్దని నల్లపురెడ్డి మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న రమేశ్ రెడ్డి…అర్ధరాత్రి బయట మంచంపై నిద్రపోతున్న నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతుల పై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. వీరి తో పాటు పక్కనే నిద్రిస్తున్న పూజిత అనే బాలికకు మంటలు వ్యాపించాయి.

ఈ ఘటన లో దంపతులకు తీవ్ర గాయాలు అవ్వగా, బాలిక స్వల్పంగా గాయపడింది. స్థానికులు నల్లపురెడ్డి, కృష్ణవేణిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. అప్పట్లో వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం తో మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు.

ఇప్పుడు అల్తాఫ్‌పై నా ముగ్గురు యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించడం కలకలంరేపుతోంది.. మదనపల్లె రూరల్‌ డ్రైవర్స్‌ కాలనీ వద్ద షేక్‌ అల్తాఫ్‌(19) అనే యువకుడిపై బైక్ పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఓ బాలికతో మాట్లాడుతున్నాడనే నెపంతోనే పెట్రోల్ పోసి నిప్పంటించారని బాధితుడు ఆరోపించారు. బాధితుడికి తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.