మహాశివరాత్రి నాడు మాత్రమే తెరుచుకునే ఏకైక ఆలయం

నాటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రకాశ్ చంద్ సేథీ కోట కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భారీ జాతర నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు మాత్రమే ఆలయ ద్వారాలు తెరుస్తారు. ఆ ఆలయానికి సంబంధించిన మరెన్నో విషయాలు తెలుసుకుందాం. భక్తులంతా పరమశివుడిని దర్శించుకునేందుకు దేవాలయాలకు వెళ్తుంటారు. మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రసిద్ధ శివాలయం విశిష్ఠత వెలుగులోకి […]

Share:

నాటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రకాశ్ చంద్ సేథీ కోట కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భారీ జాతర నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు మాత్రమే ఆలయ ద్వారాలు తెరుస్తారు. ఆ ఆలయానికి సంబంధించిన మరెన్నో విషయాలు తెలుసుకుందాం.

భక్తులంతా పరమశివుడిని దర్శించుకునేందుకు దేవాలయాలకు వెళ్తుంటారు. మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రసిద్ధ శివాలయం విశిష్ఠత వెలుగులోకి వచ్చింది. దశాబ్దాలుగా మూసివేసిన ఆలయాన్ని కేవలం మహాశివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు. సోమేశ్వరాలయంగా పిలవబడే ఈ దేవాలయం భోపాల్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెయ్యి అడుగుల ఎత్తైన కొండపై ఉంది. ఆలయం కొండపై ఉంది కాబట్టి అక్కడి వెళ్లేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. వృద్ధులు అక్కడికి చేరుకోవడం అనేక సవాళ్లతో కూడుకుని ఉంటుంది. అందుకోసమే వృద్ధులు ఈ కొండ పైకి రాకపోవడమే మంచిది.  

కేవలం శివరాత్రి రోజునే..

మహా శివరాత్రి శివ భక్తులకు అత్యంత పర్వదినం. భక్తులంతా ఆ పరమశివుడిని దర్శించుకునేందుకు దేవాలయాలకు వెళ్తారు. ఆ రోజు మన దేశంలోని ఏ శివాలయాన్ని చూసినా మనకు జనాలు, వారు పెట్టే దీపాలే కనిపిస్తాయి. ఇక అటువంటిది అంత ప్రతిష్టమైన శివరాత్రి అంటే తప్పకుండా దర్శించుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ శివాలయాలుండగా అన్నీ వేటికవే ప్రత్యేకం. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరవడం ఒక ప్రత్యేకత. శివరాత్రి రోజు మాత్రమే ఈ ఆలయం తెరుచుకుంటుంది. రాత్రికి మరలా ఆలయాన్ని మూసివేయడం సాంప్రదాయంగా వస్తుంది. ఒక్క శివరాత్రి రోజు సాయంత్రం వరకు మాత్రమే ఈ ఆలయంలో భక్తులు శివయ్యను దర్శించుకునేందుకు మాత్రమే అనుమతి ఇవ్వడం విశేషం. 

సోమేశ్వరాలయం చరిత్ర

మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 48 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ శివాలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించగా, 1283లో జలాలుద్దీన్ ఖిల్జీ స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత మాలిక్ కాఫూర్, మహమ్మద్ షా తుగ్లక్, సాహిబ్ ఖాన్‌‌లు సోమేశ్వరాలయాన్ని ఆక్రమించుకున్నారు. ఆ తరువాత 1543లో షేర్ షా సూరి ఆ దేవాలయాన్ని స్వాధీనం చెసుకున్నారు.

సామాన్య ప్రజల కోసం ఆలయం తెరవాలంటూ 1974లో పెద్దయెత్తున ఉద్యమం జరిగింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సేథి సోమేశ్వర దేవాలయానికి తాళం తీసి సామాన్య ప్రజలు వెళ్ళేందుకు అనుమతినిచ్చారు. అయితే కేవలం శివరాత్రి రోజు మాత్రమే ఆ దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు అనుమతించారు. అందువల్ల ఈ శివాలయం కేవలం శివరాత్రి పర్వదినాన మాత్రమే భక్తులకు అందుబాటులోకి వచ్చింది. 

ప్రస్తుతం కేవలం శివరాత్రి రోజు మాత్రమే తెరుచుకునే సోమేశ్వర ఆలయం

అప్పటి నుంచి ఎంతో ప్రసిద్ధి చెందిన సోమేశ్వర ఆలయం కేవలం విశిష్టమైన శివరాత్రి రోజు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ ఒక్కరోజు మాత్రమే శివుడికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ నిర్వహణలో ఉంది. కేవలం పన్నెండు గంటల పాటు మాత్రమే ఇక్కడ శివుడికి పూజలు నిర్వహిస్తారు. ఏడాదిలో ఒకరోజు మాత్రమే తెరుచుకునే ఈ ఆలయానికి భక్తులు పెద్దయెత్తున తరలి వస్తున్నారు. శివయ్యకు పూజలు చేస్తున్నారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత ఏడాది ఓ మతపరమైన కార్యక్రమంలో పండిత్ ప్రదీప్ మిశ్రా సోమేశ్వరాలయాన్ని ప్రస్తావించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ శివాలయం గురించి దేశం మొత్తం తెలియకపోయినా కానీ శివరాత్రి రోజు వచ్చే భక్తుల సంఖ్య మాత్రం అధికంగానే ఉంటుంది.