ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్న బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్..!

ప్రస్తుత కాలంలో యువత ఎంతలా క్షణికా వేశానికి గురి అవుతున్నారు అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ముఖ్యంగా చదువులో ఫెయిల్ అయినా లేదా అనుకున్న దానికంటే మార్కులు తక్కువ వచ్చిన.. తల్లిదండ్రులు మందలించినా.. కాలేజ్,  స్కూల్స్లో టీచర్లు పిల్లలను ఏమైనా తిట్టినా కొట్టినా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటూ వారి తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొంతమంది చదువుకొమ్మని తల్లిదండ్రులు కాలేజీకి పంపిస్తే ప్రేమ దోమ అంటూ జీవితాలనే నాశనం […]

Share:

ప్రస్తుత కాలంలో యువత ఎంతలా క్షణికా వేశానికి గురి అవుతున్నారు అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ముఖ్యంగా చదువులో ఫెయిల్ అయినా లేదా అనుకున్న దానికంటే మార్కులు తక్కువ వచ్చిన.. తల్లిదండ్రులు మందలించినా.. కాలేజ్,  స్కూల్స్లో టీచర్లు పిల్లలను ఏమైనా తిట్టినా కొట్టినా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటూ వారి తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొంతమంది చదువుకొమ్మని తల్లిదండ్రులు కాలేజీకి పంపిస్తే ప్రేమ దోమ అంటూ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రేమ విఫలం అయిందని ఇక జీవితమే లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ అర్ధాంతరంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.  ఇక ఈ క్రమంలోనే తాజాగా బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి ప్రేమ విఫలమయ్యిందని గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం ప్రతి ఒక్కరిని కలిసి వేసింది. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న ఈ విద్యార్థి ఇలా ప్రేమ పేరుతో మోసపోయానని ఇక తాను బ్రతకలేనంటూ ఒక వీడియో రూపంలో తన కుటుంబానికి తెలియజేస్తూ మరి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.  ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు పూర్తిగా చదివి తెలుసుకుందాం..

తాజాగా ప్రేమ విఫలమైందని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ లో తన అన్నతో లైవ్ వీడియో కాల్ మాట్లాడుతూ.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు విషయంలోకి వెళితే వికారాబాద్ జిల్లా తాండూర్ వద్ద వున్న అల్లాపూర్ గ్రామానికి చెందిన కురువ మహేష్ (21) అనే విద్యార్థి.. నగరంలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా బుధవారం మధ్యాహ్నం శంకర్ పల్లి కి వచ్చిన ఇతను.. ఫోన్లో వాట్సాప్ కాల్ లైవ్ మాట్లాడుతూ.. శంకర్పల్లి రైల్వేస్టేషన్  సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వీడియో కాల్ లో  తన అన్నతో ఆ విద్యార్థి ఏం మాట్లాడాడు అనే విషయానికి వస్తే..అమ్మా నాన్న నన్ను క్షమించండి ..నాకు బ్రతకాలని అస్సలు లేదు. దివ్య నన్ను విడిచిపెట్టి వెళ్లి పోయింది. ఆ పిల్ల నన్ను ఘోరంగా మోసం చేసింది అమ్మా. అందుకే నేను ఉండలేక పోతున్నా.. ఇక పోతాను అన్న…అమ్మా నాన్నని మంచిగా చూసుకో.. నా నుంచి ఇక అవుతలేదు ఇక పోతా అంటూ రైలు కింద పడడంతో శరీరం కాస్తా రెండు ముక్కలు అయింది. ఈ సంఘటన… చూసిన ప్రతి ఒక్కరి కంట కన్నీటి తెప్పించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు బిఎస్సి అగ్రికల్చర్ చదివి ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే, అర్ధాంతరంగా చనిపోవడం పట్ల తల్లిదండ్రులు తీరని దుఃఖం  తో కన్నీరు మున్నీరయ్యారు. వికారాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా వ్యక్తిగత కారణాలతో మహేష్ ఈ విపరీతమైన చర్య తీసుకున్నారని వీడియోను తమకు విద్యార్ధి అన్న షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

శంకర్‌పల్లి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీడియో చూసిన అతని కుటుంబం వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఈలోగా రైలు పట్టాలపై మృతదేహం పడి ఉన్నట్టు సమాచారం కూడా అందింది.గురువారం పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. విద్యార్థులు ఇకనైనా మీ బంగారు భవిష్యత్తు కోసం ఇలాంటి చిన్న చిన్న వాటికి ప్రాణాలు కోల్పోవడం మంచిది కాదని పోలీసులు కూడా చెబుతున్నారు.