ఢిల్లీలో వింత ఘటన..!

ప్రస్తుత కాలంలో మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువ అయిపోతున్న విషయం తెలిసిందే . ఒక ఇళ్ళనే కాదు దేవాలయాలను సైతం దోచుకుంటున్నారు దొంగల ముఠా.. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడడం.. విలువైన వస్తువులను దొంగలించడం లేదా మరి కొంతమంది కరుడుగట్టిన దొంగల ముఠాలు ఉన్న వారిని హతమార్చి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను సైతం ఎత్తుకెళ్లిపోతున్నారు. మరీ ముఖ్యంగా రోజుకు ఒకచోట వినూత్నంగా దొంగలు  సరికొత్త పద్ధతులను అవలంబిస్తూ వారు దొంగతనాలు చేస్తున్న […]

Share:

ప్రస్తుత కాలంలో మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువ అయిపోతున్న విషయం తెలిసిందే . ఒక ఇళ్ళనే కాదు దేవాలయాలను సైతం దోచుకుంటున్నారు దొంగల ముఠా.. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడడం.. విలువైన వస్తువులను దొంగలించడం లేదా మరి కొంతమంది కరుడుగట్టిన దొంగల ముఠాలు ఉన్న వారిని హతమార్చి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను సైతం ఎత్తుకెళ్లిపోతున్నారు. మరీ ముఖ్యంగా రోజుకు ఒకచోట వినూత్నంగా దొంగలు  సరికొత్త పద్ధతులను అవలంబిస్తూ వారు దొంగతనాలు చేస్తున్న తీరు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు.  అయితే ఇక్కడ జరిగిన ఒక వింత ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఢిల్లీలోని ఒక వృద్ధుల ఇంట్లో దోచుకోవడానికి ఏమి దొరకపోవడంతో 500 రూపాయల నోటును అక్కడే ఇంటి ముంగిట్లో పడేసి వెళ్ళిపోయారు దొంగలు. ఇక పూర్తి వివరాల గురించి ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళితే.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఒక వృద్ధుడి ఇంట్లో దొంగలు చోరీకి ప్రయత్నించారు. అయితే ఆ చోరీలో విలువైన వస్తువులు ఏమి దొరకపోవడంతో ఇంటి మెయిన్ గేటు వద్ద దొంగలు రూ .500 నోటు వదిలి వెళ్ళినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఈ ఘటన గురువారం మరియు శుక్రవారం మధ్య రాత్రి జరిగింది అని.. జూలై 21వ తేదీన పోలీసులకు ఈ దొంగతనానికి సంబంధించిన ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. అయితే పోలీసులు రోహిణి సెక్టార్ 8 ఇంటికి రాగా అక్కడ నివసించే 80 ఏళ్ల వ్యక్తిని పోలీసులు కలిసి పూర్తి వివరాలను సేకరించడం జరిగింది.

ఇకపోతే ఆ వృద్ధ దంపతులు తెలిపిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం.  ఇక ఆ వృద్ధ దంపతులు ఏమని వెల్లడించారు అనే విషయానికి వస్తే.. 80 ఏళ్ల వృద్ధుడు మాట్లాడుతూ.. నేను నా భార్యతో కలిసి జూలై 19వ తేదీన బుధవారం ఉదయం గురుగ్రామ్ కి వెళ్ళాము.. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి ప్రధాన గేటు తాళం పగలగొట్టి ఉండడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయపడ్డాము. అయితే ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ ఏమీ కనిపించలేదు కేవలం మెయిన్ గేటు దగ్గర పడి ఉన్న 500 రూపాయల నోటు మాత్రమే మాకు కనిపించింది.

అయితే మేమిద్దరం వయోభార రీత్యా బాధపడుతున్న నేపథ్యంలో ఇంట్లో విలువైన వస్తువులేవి పెట్టుకోలేదు అంటూ 80 సంవత్సరాల వయసు కలిగిన ఎం రామకృష్ణ అనే వృద్ధుడు పోలీసులకు తమ ఇంటిలో జరిగిన విషయాలను వెల్లడించారు.. అయితే దంపతులు తిరిగి వచ్చేసరికి అల్మరాలు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయని పోలీసులకు తెలిపారు. ఇక రామకృష్ణ రిటైర్డ్ ఇంజనీర్.. అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ శిక్షణ స్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు వెతుకుతున్నామని వెల్లడించారు.. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఆ దొంగలకు ఆ ఇంట్లో ఏమి దొరకపోయేసరికి 500 రూపాయల నోటు చెల్లనిది అక్కడ వేయడం నిజంగా మరికొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా నుంచి వెలుగులోకి రాగా నేటిజెన్లు ఈ విషయంపై రకరకాలుగా స్పందిస్తూ ఉండడం గమనార్హం.