వికలాంగుల కోసం శిబిరాన్ని ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళి సై గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో రకాలుగా రాష్ట్ర ప్రజలకు వారి అవసరాలకు తగ్గట్టుగా అన్ని పనులను పర్యవేక్షిస్తున్న ఆమె ఇప్పుడు వికలాంగుల కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వికలాంగుల ప్రతిభను గుర్తించడానికి ప్రత్యేక శిబిరాన్ని తెలంగాణ గవర్నర్ తమిళి సై శుక్రవారం ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరించిన విధంగా దివ్యాంగులు […]

Share:

తెలంగాణ గవర్నర్ తమిళి సై గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో రకాలుగా రాష్ట్ర ప్రజలకు వారి అవసరాలకు తగ్గట్టుగా అన్ని పనులను పర్యవేక్షిస్తున్న ఆమె ఇప్పుడు వికలాంగుల కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వికలాంగుల ప్రతిభను గుర్తించడానికి ప్రత్యేక శిబిరాన్ని తెలంగాణ గవర్నర్ తమిళి సై శుక్రవారం ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరించిన విధంగా దివ్యాంగులు ఎన్నో అవసరాలను కలిగి ఉన్నారు. వారికి మన సానుభూతి అవసరం లేదు. బదులుగా వారికి మద్దతుతో పాటు ప్రోత్సాహం అలాగే వారిపై వారి సామర్థ్యాల పై నమ్మకాన్ని కలిగించడమే అత్యవసరమైన పని.

ముఖ్యంగా సమాజంలో వారికి కూడా సమాన గౌరవంతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడం వల్ల వారు తమ లోపాలను జయించడానికి వీలవుతుంది.. అదే మన కర్తవ్యం అంటూ గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ముఖ్యంగా అడ్డుకోలు లేని నిర్మాణాలు వికలాంగులకు అందుబాటులో ఉండేలాగా అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది అని తమిళిసై సౌందర్యరాజన్ అభిప్రాయపడ్డారు. ఇకపోతే వారి ముఖాభివృద్ధిని నిర్ధారించడానికి మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి వీలుగా సమాన అవకాశాలు మరియు వనరుల సమాన పంపిణీకి గవర్నర్ తాజాగా పిలుపునిచ్చారు.

ఇకపోతే తమిళి సై సౌందర్య రాజన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వికలాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఆమె తీసుకున్న నిర్ణయం ఎంతోమంది వికలాంగులకు పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జీవితంలో వికలాంగులు అవ్వాలని ఎవరు అనుకోరు అది దురదృష్టవశాత్తు లేకపోతే పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మిస్తూ ఉంటారు. కానీ అలాంటి వారికి సమాజంలో గౌరవం లభించడం అసాధ్యం అనే చెప్పాలి. మానవత్వం ఉన్న చాలా మంది వారిని గౌరవిస్తారు. కానీ ఈ మధ్యకాలంలో అటువంటి వారిని చూస్తేనే అసహ్యించుకునే జనాలు ఎక్కువైపోయారు.

ఒక రకంగా చెప్పాలి అంటే సామాన్య ప్రజల కంటే అంగవైకల్యం ఉన్న వారిలోనే ఆత్మస్థైర్యంతో పాటు అంతకుమించిన ప్రతిభ కూడా ఉంటుంది. ఇక వారిని ప్రతిభ తగ్గట్టుగా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో కూడా వారే ముందు ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే వికలాంగులకు కూడా ప్రత్యేకమైన గుర్తింపును అందించే విధంగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని గవర్నర్ తమిళిసై అందరికి పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీ కోరిక మేరకు దేశంలో ఉన్న వికలాంగుల కోసం ఒక ప్రత్యేకమైన శిబిరాన్ని ఏర్పాటు చేసి అందులో వారి టాలెంట్ను గుర్తించి సమాజానికి పరిచయం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.

ఇకపై వికలాంగులు అన్న పదం లేకుండా వారిలో ఉన్న ప్రతిభను బయటకు తీసి వారికంటూ ఒక హోదాను కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని తమిళిసై సౌందర్యరాజాన్ అభిప్రాయపడ్డారు. ఇకపోతే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. ఇదే విధంగా ప్రోత్సహిస్తే వికలాంగులు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు పెరుగుతాయి. వారు ఇదే దిశగా అడుగులు వేస్తూ వారి టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.