మనలోని లోపం ప్రతిభకు అడ్డు కాదు: ప్రధాని మోదీ

తెలంగాణకు చెందిన కామిశెట్టి వెంకట్ తనలోని లోపం తన ప్రతిభకు అడ్డు కాకుండా పాడాలనే తన కలను నెరవేర్చుకోగలిగాడు. ఆయన ప్రధాన మోదీని ఇటీవల కలవడం జరిగింది. ప్రధాన మోదీ ఆయన గురించి చాలా పొగడారు. తను నిజానికి ప్రతిభావంతుడని, తనలోని మూగబోయిన తన గొంతుని పాడాలనే తన కలకు అడ్డు కాకూడదని వెంకట్ చేసిన ప్రయత్నాన్ని మోదీ మెచ్చుకున్నారు.  మెచ్చుకున్న మోదీ:  వరంగల్లో ఆరువేల కోట్లు విలువ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి […]

Share:

తెలంగాణకు చెందిన కామిశెట్టి వెంకట్ తనలోని లోపం తన ప్రతిభకు అడ్డు కాకుండా పాడాలనే తన కలను నెరవేర్చుకోగలిగాడు. ఆయన ప్రధాన మోదీని ఇటీవల కలవడం జరిగింది. ప్రధాన మోదీ ఆయన గురించి చాలా పొగడారు. తను నిజానికి ప్రతిభావంతుడని, తనలోని మూగబోయిన తన గొంతుని పాడాలనే తన కలకు అడ్డు కాకూడదని వెంకట్ చేసిన ప్రయత్నాన్ని మోదీ మెచ్చుకున్నారు. 

మెచ్చుకున్న మోదీ: 

వరంగల్లో ఆరువేల కోట్లు విలువ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి శంకుస్థాపానికి సంబంధించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ గారు ముఖ్య అతిథిగా తెలంగాణకు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే మోదీ గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రఖ్యాతన గురించి, తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాలు గురించి, చరిత్రలో నిలిచిపోయే సహకారం గురించి మాట్లాడారు. 

వరంగల్లు వెళ్ళిన మోదీ గారిని సింగర్ కామిశెట్టి వెంకట్ కలవడం జరిగింది. ఈ సందర్భంలో వెంకట్ గురించి చాలా విషయాలు మోదీ గారు తెలుసుకోవడం జరిగింది. వెంకట్ నిజానికి మూగవాడైనప్పటికీ తనలోని ఎంతో నైపుణ్యం టాలెంట్ ఉన్నాయని మోదీ గారు చాలా మెచ్చుకున్నారు. 

ట్విట్టర్లో పంచుకున్నా మోదీ: 

అంతే కాకుండా, ” కామిశెట్టి వెంకట లో నిజంగా చాలా అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది. తను యువతకు ఒక స్ఫూర్తిదాయకం. అంతేకాకుండా, తనలోని లోపం పాడాలనే తన కలకు అడ్డు కానివ్వలేదు. చాలా సరదాగా నవ్వుతూ, పాడుతూ ‘నాటు నాటు’ పాటకి డాన్స్ కూడా వేశాడు. నిజంగా తన మనోధైర్యానికి నా సెల్యూట్” అంటూ నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెంకట గురించి పలు మాటలు పంచుకున్నారు. 

కెసిఆర్ గురించి మాట్లాడిన మోదీ: 

వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుపైనా, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపైనా, అలాగే కాంగ్రెస్‌పైనా వారు చేసేది అవినీతి అంటూ వారి మీద మండిపడ్డారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం వంశపారంపర్య రాజకీయాల వలయంలో చిక్కుకుపోయిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ ప్రమాదకరమని, కేసీఆర్‌ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు.

తెలంగాణకు ప్రజలకు అవకాశాలు ఎన్నో: 

వరంగల్లో 6,100 కోట్లు విలువ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి శంకుస్థాపానికి సంబంధించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ గారు ముఖ్య అతిథిగా తెలంగాణకు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే మోదీ గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రఖ్యాతన గురించి, తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాలు గురించి, చరిత్రలో నిలిచిపోయే సహకారం గురించి మాట్లాడారు. అంతేకాకుండా ఆయన ముందుగా తెలంగాణ ప్రజలతో మాట్లాడే ముందు, భారత్ మాతాకీ జై అంటూ వందేమాతరం అనే నినాదాలతో మొదలుపెట్టారు.

ముఖ్యంగా, ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదుగుతున్న మన భారతదేశం వైపు ఎన్నో దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు వేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రజలకు అవకాశాలు తప్పకుండా దొరుకుతాయని హామీ వ్యక్తం చేశారు.

అంతేకాకుండా భారత దేశ యువత కారణంగా మన భారతదేశం ఒక కొత్త అభివృద్ధి పుంజుకుంటూ ప్రపంచంలో ముందుకు వెళుతుంది అని పేర్కొన్నారు. ప్రతి బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, భారతీయ ప్రజలు ఎక్కడ కూడా తక్కువ కాకుండా డెవలప్మెంట్ లో ముందుకు వెళ్లాలని సూచించారు. 

తెలంగాణ గురించి మాట్లాడుతూ,“ ఇప్పుడు మన భారతదేశ ఆర్థికంగా ప్రపంచంలోనే అయిదవ స్థానం దక్కించుకోవడానికి మన తెలంగాణ ప్రజల కృషి కూడా ఇందులో తోడ్పడింది. ఇది నిజానికి గర్వించదగ్గ విషయం,” అంటూ ఆయన మరోసారి ర్యాలీ సందర్భంగా తెలంగాణ గురించి మాట్లాడారు.

తర్వాత రాజస్థాన్లోని ఉన్న బికనీర్ ప్రాంతంలో రైల్వే స్టేషన్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కూడా మోదీ గారి చేతుల మీదగా జరిగింది. మొత్తం జూలై 7 నుంచి 8 తారీఖుల మధ్య ఆయన నాలుగు రాష్ట్రాల పర్యటన అనేది జరిగింది. ఇందులో భాగంగా ఆయన ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, చతిస్గర్ వెళ్లారు.