ప్రసిద్ధ కెనడియన్ థియేటర్ ఫెస్టివల్‌లో ఆధునిక మహాభారతం

కెనడాలోని ప్రముఖ థియేటర్ ఈవెంట్‌లో వైవిధ్యమైన తారాగణం, శాస్త్రీయ నృత్య రూపాలతో కలిపి ఇతిహాసమైన మహాభారతం, ప్రతిష్టాత్మకమైన రీటెల్లింగ్ గా ప్రదర్శించబడుతోంది. బార్బికన్ ఆఫ్ లండన్‌తో కలిసి టొరంటోకు చెందిన వై నాట్ థియేటర్ నిర్మించిన ఈ నాటకం ప్రారంభ ప్రదర్శన ఆరు దశాబ్దాల నాటి షా ఫెస్టివల్‌లో నయాగరా-ఆన్-ది-లేక్ టౌన్‌షిప్‌లో  గురువారం నాడు ప్రదర్శించబడుతోంది. ఈ నాటకానికి టొరంటోకు చెందిన రవి జైన్ దర్శకత్వం వహించారు. ఆయన దీనిని రాసి.. మిరియం ఫెర్నాండెజ్‌ చేసిన మార్పులను […]

Share:

కెనడాలోని ప్రముఖ థియేటర్ ఈవెంట్‌లో వైవిధ్యమైన తారాగణం, శాస్త్రీయ నృత్య రూపాలతో కలిపి ఇతిహాసమైన మహాభారతం, ప్రతిష్టాత్మకమైన రీటెల్లింగ్ గా ప్రదర్శించబడుతోంది.

బార్బికన్ ఆఫ్ లండన్‌తో కలిసి టొరంటోకు చెందిన వై నాట్ థియేటర్ నిర్మించిన ఈ నాటకం ప్రారంభ ప్రదర్శన ఆరు దశాబ్దాల నాటి షా ఫెస్టివల్‌లో నయాగరా-ఆన్-ది-లేక్ టౌన్‌షిప్‌లో  గురువారం నాడు ప్రదర్శించబడుతోంది.

ఈ నాటకానికి టొరంటోకు చెందిన రవి జైన్ దర్శకత్వం వహించారు. ఆయన దీనిని రాసి.. మిరియం ఫెర్నాండెజ్‌ చేసిన మార్పులను స్వీకరించాడు. దాని సంక్లిష్టత కారణంగా.. ఇది రెండు విభాగాలుగా విభజించబడింది. అవి కర్మ, ధర్మ. ఈ రెండు భాగాలకూ కలిపి దాదాపు ఐదు గంటల పాటు స్టేజ్ ప్రదర్శన ఉంటుంది. 

ఈ నాటకానికి మహమ్మారి నీడ కమ్మేసింది. దానివల్ల ప్రీమియర్‌ ఆలస్యం అయ్యింది. కానీ ప్రస్తుత పరిస్థితులకు ఈ కథ మరింత సందర్భోచితంగా ఉంటుంది. జైన్ ఇలా అన్నారు, “ధర్మం అనేది చాలా ప్రత్యేక హక్కులు ఉన్నవారి గురించి మరియు తక్కువ ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవడం వారి బాధ్యత.” కోవిడ్ -19 నుండి ప్రపంచం కోలుకుంటున్న ఈ సమయంలో.. ఈ నాటకం “సమాజంలో అసమానతలను పరిష్కరించడంపై దృష్టి పెడుతుంది” అని జైన్ చెప్పారు.

ఈ కాంటెంపరరీ అడాప్షన్లో ఒడిస్సీ, కథాకళి వంటి శాస్త్రీయ నృత్య రూపాలు, ఒపెరా, టెలివిజన్ ప్రొజెక్షన్‌ల వంటి ఆధునిక మాధ్యమాలను ఒకచోట చేర్చడం జరుగుతుంది. “ఈ పురాతన కథను తీసుకొని ఆధునిక ప్రేక్షకులకు సమకాలీనంగా కనెక్ట్ అయ్యేలా ఎలా మార్చాలనేది పెద్ద ప్రశ్న” అని అతను చెప్పాడు.

ఈ మోడరన్ రీటెల్లింగ్‌లో పర్ఫార్మెన్స్ మెకానిక్స్ కూడా భాగమైనప్పటికీ, ఇది కేవలం ఇండో-కెనడియన్లు మాత్రమే కాకుండా పాకిస్తాన్, మలేషియా, మారిషస్‌లలో మూలాలున్న ఎన్నో కులాల వాళ్ళు దీనిలో భాగమయ్యారు. నాన్ బైనరీ, మహిళా నటీనటులు అర్జునుడు, కర్ణుడు వంటి మగ పాత్రలను పోషిస్తున్నందున, “మీరు ఆ వ్యక్తులు ఎలా ఉంటారని అనుకుంటారో, అదే సంప్రదాయ పద్ధతిని మేము అనుసరించాల్సిన అవసరం లేదు” అని జైన్ చెప్పారు.

కెనడా తర్వాత లండన్‌కు వెళ్లనున్న ఈ షో ప్రివ్యూలు ఫిబ్రవరి 28 నుండి అందుబాటులో ఉన్నాయి. వీటికి ఎంతో అనుకూల స్పందన లభించింది. కెనడా జాతీయ దినపత్రిక, గ్లోబ్ అండ్ మెయిల్.. మునుపటి అనుసరణల మాదిరిగానే, మహాభారతం యొక్క ఈ “వ్యాఖ్యానం” “ప్రతిఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉందని నిరూపించే విధంగా కొనసాగుతుంది” అని పేర్కొంది.

ప్రివ్యూకి హాజరైన వారిలో మిస్సిసాగాకు చెందిన సాంస్కృతిక పోషకుడు అతుల్ టోలియా కూడా ఉన్నారు, “ఇది అద్భుతంగా ఉంది.” వేదికపై ప్రదర్శించిన లైవ్ మ్యూజిక్, డ్యాన్స్‌తో పాటు, భగవద్గీత యొక్క ఒపెరాటిక్ రెండరింగ్ హైలైట్‌లలో ఒకటని ఆయన అన్నారు. “అది నన్ను కదిలించింది,” అని అతను చెప్పాడు.

జైన్ మాట్లాడుతూ, “మేము నిజంగా మెటీరియల్‌ని చాలా జాగ్రత్తగా ఉంచటానికి ప్రయత్నించాము. దీనిని గౌరవప్రదంగా, కాలక్రమేణా మారుతున్న విలువలతో సమతుల్యం చేసే విధంగా రూపొందించాము.”

ఐరిష్ నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా గౌరవార్థం 1962లో ప్రారంభమైన షా ఫెస్టివల్‌లో ఇది ప్రీమియర్ కావడం, ఇది కెనడియన్ సాంస్కృతిక సంస్థ కావడం పట్ల జైన్  సంతోషం వ్యక్తం చేశారు.