కేంద్ర‌మంత్రి ఇంట్లో యువకుడి మృతదేహం

కేంద్ర‌మంత్రి ఇంట్లో యువకుడు మృతదేహం కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం నాలుగు గంటల సమయంలో యువకుడు మరణించినట్లు సమాచారం. యువకుడుని తుపాకీతో షూట్ చంపడం వల్లే చనిపోయినట్లు నిర్ధారణ. అయితే యువకుడి హత్యకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగింది. మరో ముగ్గురుని విచారిస్తున్నారు.  ఇది కచ్చితంగా వారిపనే అంటున్న అన్న:  కేంద్ర‌మంత్రి అదే విధంగా బిజెపి ఎంపి కౌశల్ కిషోర్ కి సంబంధించి లక్నోలో ఒక ఇంట్లో 30 సంవత్సరాల ఒక యువకుడు […]

Share:

కేంద్ర‌మంత్రి ఇంట్లో యువకుడు మృతదేహం కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం నాలుగు గంటల సమయంలో యువకుడు మరణించినట్లు సమాచారం. యువకుడుని తుపాకీతో షూట్ చంపడం వల్లే చనిపోయినట్లు నిర్ధారణ. అయితే యువకుడి హత్యకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగింది. మరో ముగ్గురుని విచారిస్తున్నారు. 

ఇది కచ్చితంగా వారిపనే అంటున్న అన్న: 

కేంద్ర‌మంత్రి అదే విధంగా బిజెపి ఎంపి కౌశల్ కిషోర్ కి సంబంధించి లక్నోలో ఒక ఇంట్లో 30 సంవత్సరాల ఒక యువకుడు వినయ్ శ్రీవాత్సవ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపబడ్డాడు. చనిపోయిన వినయ్ శ్రీవాస్తవ అలాగే యూనియన్ మినిస్టర్ కొడుకు వికాస్ కిషోర్ స్నేహితులు. ఇది ఇలా ఉండగా వినయ్ శ్రీవాస్తవ డెడ్ బాడీలో దొరికిన బుల్లెట్ వికాస్ కిషోర్ తుపాకీకి సంబంధించిన బుల్లెట్ అని నిర్ధారించారు. 

అంతేకాకుండా బేగారియా గ్రామంలో కేంద్ర‌మంత్రి ఇంట్లో సుమారు ఉదయం నాలుగు గంటలకు హత్య జరిగినట్లు పోలీసులు వారు నిర్ధారించారు. అయితే వినయ్ చనిపోయిన సమయంలో ఇంట్లోనే ఉన్న ఆరుగురిని విచారించగా అందులో ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అయితే ఎప్పటినుంచో కేంద్ర‌మంత్రి, లక్నో లో ఉన్న ఇంటిని వాడట్లేదని, హత్య జరిగిన సమయంలో ఉన్న ఆరుగురు, అంతేకాకుండా మృతి చెందిన యువకుడు వినయ్ అన్న కూడా చెప్పడం జరిగింది. 

కేంద్ర‌మంత్రి ఏమంటున్నారు: 

మరో పక్క కేంద్ర‌మంత్రి కౌశల్ కిషోర్ ఈ హత్యకు సంబంధించి ఆయన బాధపడుతున్నట్లు, అంతేకాకుండా హత్య జరిగిన సమయంలో దొరికిన గన్, తన కొడుకు వికాస్ కి చెందినదే అని, కాకపోతే ఆ సమయంలో వికాస్ ఢిల్లీలో ఉన్నాడని కావాలంటే బోర్డింగ్ ప్రాసెస్ సమయంలో తీసుకున్న ఫోటోలు ఆధారంగా చూపిస్తామని వెల్లడించారు. మరోపక్క వినయ్ అన్న మాత్రం ఇది కచ్చితంగా హత్య అంటూ తన తమ్ముడు మరణం గురించి పదేపదే మాట్లాడారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వినయ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన కౌశల్ కిషోర్ కొడుకు వికాస్, తాను ఎక్కడికి వెళ్లినా సరే తనతో పాటు ఎప్పుడూ తుపాకి తీసుకు వెళ్తాడని, తను మాత్రం ఆ తుపాకీ తీసుకువెళ్లడం మర్చిపోడు అని, మరి ఢిల్లీకి వెళ్లినప్పుడు తుపాకి ఎందుకు వదిలేసి వెళ్లాడు అని ప్రశ్నించాడు. ఇది కచ్చితంగా కావాలని ప్లాన్ ప్రకారం తన తమ్ముడిని హత్య చేయడానికి చేస్తున్న కుట్ర అని తేల్చి చెప్తున్నాడు వినయ్ అన్న. 

అంతేకాకుండా వినయ్ ఎప్పుడు కూడా తనకి తానుగా తుపాకీతో కాల్చుకునే తప్పు చేయడని.. తన తమ్ముడు కేంద్ర‌మంత్రి ఇంట్లో చనిపోవడానికి ఎందుకు వెళ్తాడు అని ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నాడు. అయితే వికాస్ తనతో పాటు ఢిల్లీకి తుపాకి ఎందుకు తీసుకు వెళ్ళలేదు అని అడిగిన ప్రశ్నకు, వికాస్ తండ్రి యూనియన్ మినిస్టర్ కౌశల్ కిషోర్ సమాధానం ఇస్తూ, తన కొడుకు వికాస్ తుపాకీ కి నేషనల్ లైసెన్స్ లేని కారణంగానే తను ఢిల్లీకి వెళ్ళినప్పుడు తుపాకీ ఇంట్లోనే వదిలి వెళ్ళినట్లు చెప్తున్నారు. 

ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరిగిన సంఘటన నిజంగా బాధాకరమని, తాను జరిగిన విషయాన్ని పోలీస్ కమిషనర్ కు ఇన్ఫార్మ్ చేశామని, త్వరలోనే ఈ సంఘటన ఎలా జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేసి నిజ నిజాలు బయటపెడతారని, ఖచ్చితంగా వినయ్ ఫ్యామిలీకి న్యాయం జరిగేలా చేకూరుస్తామని, ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేలా చేసే బాధ్యత తమ మీద ఉందని, వికాస్ కూడా వినయ్ మృతి పట్ల ఎంతో బాధలో ఉన్నట్లు చెప్పారు. అంతేకాకుండా వినయ్ హత్య జరిగిన సమయంలో ఎవరైతే ఇంట్లో ఉన్నారో వారిని కూడా ప్రశ్నించడం జరుగుతుందని చెప్పారు కేంద్ర‌మంత్రి. అంతేకాకుండా వినయ్ ఇంట్లో ఉన్న సమయంలో సిసిటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.