ఉద్యోగంలో జాయిన్ అయిన రోజే రిసైన్ చేసిన వ్యక్తి

ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది జీవితంలో మొదటి విజయం కింద భావిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఉద్యోగం రావటానికి కాంపిటేషన్ ఎక్కువ అవ్వడం వల్ల, మంచి ఉద్యోగం దొరకడానికి కూడా కష్టం అవుతుంది. ఎంతోమంది నిరుద్యోగులు, ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తుంటారు. ఇలాంటి క్రమంలో ఒక వ్యక్తి మాత్రం ఉద్యోగంలో జాయిన్ అయిన రోజే రిసైన్ చేశారు.  అసలు విషయం ఏమిటి:  సరైన మద్దతు లేకపోవడం, అధికారుల నుండి ఒత్తిడి, తక్కువ జీతం ఇలాంటి […]

Share:

ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది జీవితంలో మొదటి విజయం కింద భావిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ఉద్యోగం రావటానికి కాంపిటేషన్ ఎక్కువ అవ్వడం వల్ల, మంచి ఉద్యోగం దొరకడానికి కూడా కష్టం అవుతుంది. ఎంతోమంది నిరుద్యోగులు, ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తుంటారు. ఇలాంటి క్రమంలో ఒక వ్యక్తి మాత్రం ఉద్యోగంలో జాయిన్ అయిన రోజే రిసైన్ చేశారు. 

అసలు విషయం ఏమిటి: 

సరైన మద్దతు లేకపోవడం, అధికారుల నుండి ఒత్తిడి, తక్కువ జీతం ఇలాంటి కారణాలు ఉద్యోగాన్ని వదిలివేయడానికి ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రిజైన్ చేయడానికి గలకారణాన్ని పంచుకున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

ఆ వ్యక్తి తన అనుభవాన్ని Redditలో పంచుకోవడం జరిగింది. మంచి జీతంతో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. కంపెనీలో ఖాళీలు ఉన్నాయి మరియు కొన్ని రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత అతనికి ఆ జాబు వచ్చినట్లు ఉత్సాహంగా చెప్పాడు. ఇది తన మొదటి ఉద్యోగమని, అయితే ఆఫీసుకు వెళ్లేందుకు తనకి ప్రయాణ సమయం చాలా ఎక్కువ అవుతుందని గ్రహించానని చెప్పాడు. ప్రయాణించాల్సిన దూరం దాదాపు 36 కిలోమీటర్లు, దానికి గంటన్నర సమయం పడుతుందని అందుకే జాయిన్ అయిన రోజే రిజైన్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది, చాలా మంది నెటిజన్లు ఎక్కువ గంటలు ప్రయాణించి ఉద్యోగాలు చేస్తున్న వారి స్వంత అనుభవాలను పంచుకున్నారు.

సోషల్ మీడియాలో ఇదే ప్రస్తావన: 

“నేను ఘజియాబాద్ నుండి గుర్గావ్‌కు వెళ్తాను. ఆఫీసుకు వెళ్లడానికి 120-130 నిమిషాలు. మీ ప్రాంతంలో  ప్రయాణించే కొంతమంది సహోద్యోగులను కలిసి ఒక్కసారి వారి పరిస్థితిని తెలుసుకోండి. నేను మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు పుస్తకాలను తీసుకెళ్లమని సీనియర్ నుండి నాకు లభించిన ఉత్తమ సలహా. దాదాపు 6 ఏళ్లుగా అలానే చేస్తున్నా. సమయం వినియోగించుకోవడానికి ఇదే ఉత్తమమైన మార్గం,” అంటూ ఒకరు కామెంట్ చేశారు.

“నా ఇంటర్న్‌షిప్ అమెక్స్ గుర్గావ్‌లో జరిగింది. నేను ఘజియాబాద్ నుండి గుర్గావ్ వరకు ప్రయాణించాను. నేను కోర్సెరాలో కోర్సులు తీసుకోవడం, ఒక నెలలో 3 కోర్సులను పూర్తి చేసాను. ఒక్కో కోర్సు ఒక నెల పాటు నిజానికి చేయాల్సి ఉంది. మెట్రోలో వెళ్లడమే ఉత్తమమైన మార్గం అని చెప్తాను. నేను ఉండేది బెంగుళూరులో కాబట్టి లగ్జరీగా ఉండకపోవడమే బెటర్’’ అన్నాడు మరొకరు.

“మీ ఉద్యోగం మానేయడానికి ఇది అసలు కారణమే కాదు. నేను ఉద్యోగం కోసం ప్రతిరోజూ గుర్గావ్ నుండి న్యూఢిల్లీకి వెళ్లేవాడిని. తర్వాత సైడ్ హస్టిల్ కోసం ఘజియాబాద్‌కి వెళ్లాను. అప్పుడు ఘజియాబాద్ నుండి గుర్గావ్ వరకు ఇంటికి తిరిగి వెళ్లాలంటే మెట్రో రైడ్ చేయడమే. ఇలా ప్రయాణించే హడావుడి వల్లే నా కెరీర్‌ను చాలా మెరుగుపరుచుకోగలిగాను’ అని మరో వ్యక్తి పంచుకున్నారు. 

అయితే ఇటువంటి కామెంట్లు అన్నీ విన్న తర్వాత ఆ వ్యక్తి ఇటువంటి నిర్ణయాలు నిజానికి హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమని, ఉద్యోగం కోసం చాలా మంది ఎక్కువ దూరం ప్రయాణించడం తనకు తెలియదని పోస్ట్ చేశాడు. భవిష్యత్తులో ఎలాంటి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ, ఉద్యోగ విషయాలలో కాస్త జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మరొకరి ఆప్షన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఉద్యోగ అవకాశాలను ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది.