ఇంటర్వ్యూకి వెళ్తున్న కోడల్ని ఇటుక రాయితో దాడి చేసిన మామ.. వీడియో వైరల్

వేడి నీళ్లకి చన్నీళ్లు తోడన్నట్టుగా భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే సంఘంలో ఆర్థికంగా నిలదొక్కుకోగలం. భర్తకి ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఓ మహిళ ఉద్యోగం చేయాలనుకుంది. రాను రాను ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులను తట్టుకొని నాలుగు వేళ్ళు కడుపులోకి వెళ్లాలి అంటే.. ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండాలి. ఈ రోజుల్లో భర్త ఒక్కడే సంపాదిస్తే కుటుంబ భారం మొత్తం గడిచిపోతుందనుకోవడం ఏమరపాటే. వేడి నీళ్లకి చన్నీళ్లు తోడన్నట్టుగా భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే సంఘంలో ఆర్థికంగా నిలదొక్కుకోగలం. భర్తకి ఆర్థికంగా […]

Share:

వేడి నీళ్లకి చన్నీళ్లు తోడన్నట్టుగా భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే సంఘంలో ఆర్థికంగా నిలదొక్కుకోగలం. భర్తకి ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఓ మహిళ ఉద్యోగం చేయాలనుకుంది.

రాను రాను ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులను తట్టుకొని నాలుగు వేళ్ళు కడుపులోకి వెళ్లాలి అంటే.. ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండాలి. ఈ రోజుల్లో భర్త ఒక్కడే సంపాదిస్తే కుటుంబ భారం మొత్తం గడిచిపోతుందనుకోవడం ఏమరపాటే. వేడి నీళ్లకి చన్నీళ్లు తోడన్నట్టుగా భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే సంఘంలో ఆర్థికంగా నిలదొక్కుకోగలం. భర్తకి ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఓ మహిళ ఉద్యోగం చేయాలనుకుంది. అందుకు భర్త కూడా అనుమతి ఇచ్చాడు. కానీ.. అతని మామ ససేమీరా ఒప్పుకోలేదు. పైగా ఆమెను ఇటుక రాయితో దాడి చేశాడు. ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిందనుకుంటే పొరపాటే.. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మహిళలకు ఇంకా స్వేచ్ఛ లేదంటూ పలు కామెంట్స్ వెల్లువెత్తున్నాయి.

ఇంటర్వ్యూ కి వెళ్తున్న కాజల్ పై మామ దాడి..

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటున్న ఓ మహిళ అయిన కాజల్ తన భర్త సంపాదనకు అండగా నిలవాలని భావించింది. కాజల్ కూడా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఉద్యోగం చేస్తానని తన భర్త ప్రవీణ్ కుమార్ కి కూడా చెప్పింది. తన భర్త కూడా సరే అని అన్నాడు. కానీ.. కాజల్ ఉద్యోగం చేయడానికి తన మామ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా కానీ కాజల్ ఉద్యోగం చేయాలని పట్టుబట్టింది. మీరు ఎన్ని చెప్పినా నేను వినను అని ఇంటర్వ్యూ కి కూడా బయలుదేరింది కాజల్. 

అంతే.. నేను ఎంతగా చెబుతున్నా నా మాట వినవా.. అంటూ కాజల్ మామ చేతిలో ఇటిక రాయి పట్టుకొని వచ్చి, ఇంటర్వ్యూకి వెళ్తున్న కాజల్ తలపై గట్టిగా కొట్టాడు. అయినా కానీ..  కాజల్ అతని నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పరిగెత్తింది. కానీ.. కాజల్ మామ ఆమెను వెంబడించి మరీ ఇటిక రాయితో దబిదబిమని ఆమె తలపై బలంగా కొట్టాడు.  దాంతో కాజల్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కాజల్ భర్త ప్రవీణ్.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.

ఢిల్లీలోని సంజీవ్ గాంధీ హాస్పిటల్ కు కాజల్ ను తీసుకు వెళ్ళారు. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు ఆమె ప్రమాదవశాత్తు బాగానే ఉందని తెలిపారు. ఆమె తలకు 17 కుట్లు వేసినట్లు తెలిపారు. మరోవైపు కాజల్ మామ పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్న కోడలిపై ఇటుక రాయితో మామ దాడి చేసిన సంఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డు అయింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తున్న పలువురు నెటిజన్స్.. ఇంకా ఆడవారికి స్వేచ్ఛ లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని మహిళలకు ఇలాంటి బాధాకరమైన పరిస్థితులు ఉంటే.. ఇక దేశవ్యాప్తంగా మహిళలకు భద్రత ఎక్కడ ఉంది అంటూ పలువురు సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారా.. అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.