"టీ" తేవడం ఆలస్యమైందని భార్యను నరికి చంపిన వ్యక్తి..!

ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత "టీ" తీసుకు రావడం ఆలస్యం అయిందని భార్యను కత్తితో నరికి అతి క్రూరంగా చంపాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన దిల్లీ సమీపంలోని ఘజియాబాద్ లోని బోజ్ పురి గ్రామంలో చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు అతడిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Courtesy: IDL

Share:

ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత "టీ" తీసుకు రావడం ఆలస్యం అయిందని భార్యను కత్తితో నరికి అతి క్రూరంగా చంపాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన దిల్లీ సమీపంలోని ఘజియాబాద్ లోని బోజ్ పురి గ్రామంలో చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు అతడిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ లోని బోజ్ పురి గ్రామంలో ధర్మవీర్ అనే వ్యక్తి తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ధర్మవీర్ మంగళవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత టీ కావాలని తన భార్య సుందరిని అడిగాడు. దీంతో ఆమె టీ చేసి తీసుకు రావడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె టీ తీసుకు రావడం కొంత ఆలస్యం అయింది. దీంతో విసిగి పోయిన ధర్మవీర్ భార్యతో గొడవకు దిగాడు. అంతలోనే కోపోద్రిక్తుడైన ధర్మవీర్ భార్య మెడపై కత్తితో దారుణంగా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వారి పిల్లలు మరో గదిలో నిద్రిస్తున్నారు. దాడి అనంతరం బాధితురాలి కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వారు పరుగున అక్కడికి వచ్చి చూసేసరికి సుందరి రక్తపు మడుగులో పడి ఉండటం గమనించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మరణించిన మహిళ శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) గ్యాన్ ప్రకాశ్ రాయ్ ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు." ధర్మవీర్ మంగళవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత టీ కావాలని తన భార్య సుందరిని అడిగాడు. దీంతో ఆమె టీ చేసి తీసుకు రావడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె టీ తీసుకు రావడం కొంత ఆలస్యం అయింది. దీంతో విసిగి పోయిన ధర్మవీర్ భార్యతో గొడవకు దిగాడు. అంతలోనే కోపోద్రిక్తుడైన ధర్మవీర్ భార్య మెడపై కత్తితో దారుణంగా దాడికి తెగబడ్డాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. విచారణ నిమిత్తం నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం." అని ఏసీపీ వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.