రాహుల్ గాంధీ మీద 12 కేసులు

2019 ఏప్రిల్‌లో – లోక్‌సభ ఎన్నికలకు ముందు – మోదీ ఇంటిపేరుతో ఉన్న దొంగల గురించి అంటూ కోలార్‌లో గాంధీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిజెపికి చెందిన సూరత్ వెస్ట్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ  దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం రాహుల్ గాంధీ చిక్కుల్లో పడడం జరిగింది.  కోర్టు ఏమంటుంది:  గతవారం కోర్టు వారు జస్టిస్ ప్రచ్ఛక్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు ” చాలా స్పష్టంగా ఉండాలి” అంటూ వ్యాఖ్యానించారు. “ఆయన చేసిన వాక్యలకు సంబంధించి […]

Share:

2019 ఏప్రిల్‌లో – లోక్‌సభ ఎన్నికలకు ముందు – మోదీ ఇంటిపేరుతో ఉన్న దొంగల గురించి అంటూ కోలార్‌లో గాంధీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిజెపికి చెందిన సూరత్ వెస్ట్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ  దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం రాహుల్ గాంధీ చిక్కుల్లో పడడం జరిగింది. 

కోర్టు ఏమంటుంది: 

గతవారం కోర్టు వారు జస్టిస్ ప్రచ్ఛక్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు ” చాలా స్పష్టంగా ఉండాలి” అంటూ వ్యాఖ్యానించారు.

“ఆయన చేసిన వాక్యలకు సంబంధించి అప్పట్లో ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత, ప్రస్తుత నిందితుడిపై ఇతర ఫిర్యాదులు దాఖలయ్యాయని, అందులో ఒక ఫిర్యాదును వీర్ సావర్కర్ మనవడు పునాలోని సంబంధిత కోర్టులో దాఖలు చేసినట్లు రికార్డులో కనిపిస్తుంది. లక్నో సంబంధిత కోర్టులో మరో ఫిర్యాదు కూడా దాఖలైంది. పేర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో, నేరారోపణపై స్టే ఇవ్వడానికి నిరాకరించడం వల్ల దరఖాస్తు చేసిన వారికి ప్రస్తుతానికి ఏ విధంగానూ అన్యాయం జరగదు.” అంటూ ఉద్దేశపూర్వకంగా చెప్పారు.

పరువు నష్టం హత్య వంటి తీవ్రమైన నేరం కాదన్న గాంధీ వాదనను తోసిపుచ్చిన జస్టిస్ ప్రచ్చక్, “ప్రస్తుత నేరారోపణ చాలా తీవ్రమైన విషయం, ఇది సమాజంలోని పెద్ద వర్గాన్ని ప్రభావితం చేస్తుంది మరియు ఈ కోర్టు ఆదేశిస్తున్న నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని స్పష్టంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న కేసులో, నేరం అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో అనే దాన్ని బట్టి అంచనా వేయడానికి, పిటిషనర్‌పై ఇప్పుడున్న కేసు ప్రకారం చూసుకుంటే, ఈ విషయం ఒక వర్గం అనేది వ్యక్తికి సంబంధించినది కాదు, అంటే ఎంతోమంది ఇందులో ఉన్నారు.” అంటూ చెప్పుకొచ్చారు. 

గాంధీ మీద 12 కేసులు: 

1. సావర్కర్ వ్యాఖ్యలపై పూణె కేసు: 

ఈ ఏడాది మార్చిలో తన యుకె పర్యటనలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సావర్కర్‌పై తప్పుడు మరియు దురుద్దేశపూర్వక ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ ఏప్రిల్ 12, 2023న పూణేలోని మేజిస్ట్రేట్ కోర్టులో రాహుల్‌పై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. 

2. థానేలో పరువు నష్టం కేసు: 

శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)కి చెందిన వందనా డోంగ్రే, సావర్కర్‌పై కించపరిచే వాక్యాలు చేసినందుకు రాహుల్‌పై నవంబర్ 2022లో థానే నగర్ పోలీస్ స్టేషన్‌లో పరువు నష్టం ఫిర్యాదు చేసింది. 

3. హరిద్వార్‌లో పరువు నష్టం ఫిర్యాదు: 

కురుక్షేత్రలో భారత్ జోడో యాత్రలో ఆర్‌ఎస్‌ఎస్ గురించి వివరిస్తూ చేసిన వ్యాఖ్యలపై హరిద్వార్ సిజెఎం కోర్టులో ఆయనపై కేసు నమోదైంది. ఈ ఫిర్యాదును ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్ కమల్ భడోరియా దాఖలు చేశారు. 

4. రాంచీలో క్రిమినల్ పరువు నష్టం కేసు: 

2019లో రాహుల్ గాంధీ, మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసిన వెంటనే, ప్రదీప్ మోదీ అనే న్యాయవాది రాంచీలోని సీజేఎం కోర్టులో ఆయనపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత విచారణ ఎదుర్కొంటున్నారు. 

5. పాట్నాలో సుశీల్ మోదీ పరువునష్టం దావా: 

ఏప్రిల్ 13, 2019న రాహుల్, మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల తర్వాత, బీహార్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ పాట్నా సదర్ CJM కోర్టులో అతనిపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. 

6. అహ్మదాబాద్‌లో క్రిమినల్ పరువు నష్టం కేసు: 

మే 2019లో, అప్పటి బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను “హత్య నేరస్తుడు” అని పిలిచినందుకు రాహుల్‌పై, బిజెపి సభ్యుడు కృష్ణవదన్ బ్రహ్మభట్, అహ్మదాబాద్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.

7. అహ్మదాబాద్‌లో మరో పరువు నష్టం కేసు: 

ఏప్రిల్ 2019లో, అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ (ADC) బ్యాంక్ మరియు దాని చైర్‌పర్సన్ అజయ్ పటేల్ 2016 నోట్ల రద్దు సమయంలో అమిత్ షాను మనీలాండరింగ్ ఆరోపణలతో పరువు తీశారంటూ రాహుల్‌పై అహ్మదాబాద్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. 

8. ముంబైలో పరువు నష్టం కేసు: 

రాఫెల్ డీల్‌లో అవినీతికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు చేసినందుకు రాహుల్‌పై 2018లో ముంబైలోని గిర్గావ్ మేజిస్ట్రేట్ కోర్టులో బీజేపీ నేత మహేశ్ శ్రీశ్రీమల్ పరువు నష్టం ఫిర్యాదు కేసు వేశారు. 

9. భివాండిలో క్రిమినల్ పరువు నష్టం కేసు: 

2014 ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడి ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2014లో థానేలోని భివాండి సివిల్ అండ్ క్రిమినల్ కోర్టులో రాహుల్‌పై పరువు నష్టం ఫిర్యాదును ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త భివాండి నివాసి రాజేష్ కుంటే దాఖలు చేశారు.

10. ముంబైలో మరో పరువు నష్టం కేసు: 

జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసుతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం ఉందని ఆరోపించిన రాహుల్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ధృతిమాన్ జోషి 2018లో ముంబైలోని సెవ్రీ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. 

11. రాంచీలో మరో పరువు నష్టం కేసు: 

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అంతర్గత సమావేశంలో బీజేపీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌పై 2018లో బీజేపీ కార్యకర్త నవీన్ ఝా రాంచీలోని సీజేఎం కోర్టులో క్రిమినల్ పరువునష్టం ఫిర్యాదు దాఖలు చేశారు. 

12. గౌహతిలో క్రిమినల్ పరువు నష్టం కేసు: 

ఒక RSS కార్యకర్త అంజన్ కుమార్ బోరా 2016లో గౌహతిలోని CJM కమ్రూప్ కోర్టులో రాహుల్‌పై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. డిసెంబర్ 2015లో ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, RSS కార్యకర్తలు తనను బార్‌పేటలోని మఠంలోకి రానివ్వలేదని రాహుల్ ఆరోపించారు. దీనిని మఠం అధికారులు ఖండించారు.