Leopard: అలిపిరి నడక మార్గంలో మ‌ళ్లీ చిరుతపులి కలకలం

తిరుమల (Tirumala)కు వెళ్లే దారి మార్గాలలో ఇటీవల పులులు, చిరుతపులుల (Leopard) సంచారం ఎక్కువగా మారింది. మెట్ల మార్గంలో వెళ్తున్న ఒక చిన్నారిపైన ఇటీవల చిరుతపులి (Leopard) దాడి చేసిన వైనం కనిపిస్తోంది. తిరుమల (Tirumala)కు మెట్ల మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరికి టీటీడీ (TTD) అధికారులు కర్రలు ఇచ్చి చిరుతపులి (Leopard) వస్తే భయభ్రాంతులకు గురికాకుండా, కర్రతో ఆత్మరక్షణ చేసుకోవచ్చని ఇటీవల కర్రల పంపిణీ చేశారు.  అలిపిరి నడక మార్గంలో చిరుత కలకలం:  తిరుమల (Tirumala)కు […]

Share:

తిరుమల (Tirumala)కు వెళ్లే దారి మార్గాలలో ఇటీవల పులులు, చిరుతపులుల (Leopard) సంచారం ఎక్కువగా మారింది. మెట్ల మార్గంలో వెళ్తున్న ఒక చిన్నారిపైన ఇటీవల చిరుతపులి (Leopard) దాడి చేసిన వైనం కనిపిస్తోంది. తిరుమల (Tirumala)కు మెట్ల మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరికి టీటీడీ (TTD) అధికారులు కర్రలు ఇచ్చి చిరుతపులి (Leopard) వస్తే భయభ్రాంతులకు గురికాకుండా, కర్రతో ఆత్మరక్షణ చేసుకోవచ్చని ఇటీవల కర్రల పంపిణీ చేశారు. 

అలిపిరి నడక మార్గంలో చిరుత కలకలం: 

తిరుమల (Tirumala)కు వెళ్లే అలిపిరి నడకదారిలోని శ్రీలక్ష్మీ నారాయణస్వామి ఆలయానికి సమీపంలోని రిపీటర్ స్టేషన్ పరిసరాల్లో ఇటీవల చిరుతపులి (Leopard), ఎలుగుబంటి కనిపించడంతో భక్తులు (devotees), అటవీశాఖ, తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానం టీటీడీ (TTD)లో ఆందోళన నెలకొంది.

ఆంజనేయ స్వామి దేవాలయం (Temple), నరసింహ స్వామి దేవాలయం (Temple) మధ్య ఉన్న కాలిబాట మార్గంలో ఉంచిన ట్రాప్ కెమెరాల ద్వారా అడవి జంతువుల ఫోటోలను తీశారు. ఈ రెండు జంతువుల సంచారం ఈ నెల 24 నుంచి 27వ తేదీ మధ్య నమోదైందని టీటీడీ (TTD) శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ నేపథ్యంలో టీటీడీ (TTD), అటవీశాఖ అధికారులు తిరుమల (Tirumala)కు వెళ్లే భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. అలిపిరి మరియు శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, గుంపులుగా కదలాలని, అధికారులు కోరారు. భక్తుల (devotees) రక్షణ, తమకి ముఖ్యమని, అది తమ బాధ్యత అంటూ, టీటీడీ (TTD) అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జనావాసాల్లోకి జంతువులు: 

అటవీ ప్రాంత సమీపంలో ఉన్న ప్రాంతాలకు అడవి జంతువులు (Animals) రాక సర్వసాధారణంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు అనేక ప్రాంతాలలో జనావాసాల్లోకి కూడా జంతువులు (Animals) రాక మొదలైంది. ఇళ్లల్లోకి జంతువులు (Animals) వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం కనిపిస్తోంది. మరి దీనంతటికీ కారణం.. అడవు (Forest)లు అంతరించుకుపోవడమే.. అవును మీరు విన్నది నిజమే.. ఒకప్పుడు అడవు (Forest)లు పుష్కలంగా ఉన్న సమయాలలో వన్యప్రాణులు (Animals) ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అడవు (Forest)ల్లోనే తలదాచుకుంటూ ఉండేది. అన్ని రకాల వాతావరణలకు తట్టుకుంటూ, కాలాలు మారుతున్నప్పటికీ వన్యప్రాణులు (Animals) తమ అడవు (Forest)లలో సురక్షితంగా తలదాచుకుంటూ ఉండేవి. 

కానీ ఇప్పుడు మనుషులు తమ స్వార్థం కోసం అడవు (Forest)లను తమ స్థావరాలగా మార్చుకుంటున్న వైనం కనిపిస్తోంది. అడవు (Forest)లలో ఉండే వన్యప్రాణులు (Animals) ఎక్కడికి వెళ్లాలో తెలియక, జనావాసాల్లోకి హఠాత్తుగా వచ్చి దర్శనమిస్తున్నాయి. కొన్నిసార్లు భయభ్రాంతులకు గురైన జనాలు జంతువులను అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.. మరి కొన్నిసార్లు జంతువులు (Animals) జనాల చేతుల్లో బలైపోతున్నాయి. 

ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి, ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అడవు (Forest)లు అంతరించిపోవడం వల్ల.. అకాల వర్షాలు.. విపరీతమైన వేడి. వేటి కారణంగా.. వరదల కారణంగా, కారు చిచ్చు కారణంగా, చాలా జంతువులు (Animals) బలైపోతున్నాయి. మరికొన్ని జంతువులు (Animals), వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, ఎడారిలుగా మారుతున్న అడవు (Forest)ల్లో ఉండలేక.. నీళ్లను వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు ప్రయాణం అవుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జనావాసుల్లోకి జంతువులు (Animals) రాకకు కారణం మనమే. ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవికి బ్రతికే అవకాశం, హక్కు ఉంటుంది. ఆ హక్కును తీసుకోవడానికి ఎవరికీ అధికారం లేదు.